రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, భారత మార్కెట్లో మరో కొత్త ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ను ప్రవేశపెట్టేందుకు చూస్తోంది. ఈ కొత్త బైక్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411 ) పేరుతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, తాజాగా స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క బ్రోచర్ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఇది రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

ఇది చూడటానికి ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan) యొక్క టోన్-డౌన్ వెర్షన్ గా ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ఉపకరణాలు (యాక్ససరీస్) అయిన టీ-షర్టులు మరియు కీచైన్‌లు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ల వద్దకు వచ్చాయి. త్వరలోనే ఈ మోటార్‌సైకిల్ కూడా డీలర్‌షిప్ లకు చేరుకునే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ నెలాఖరులోపు తమ సరికొత్త స్క్రాంబ్లర్-స్టైల్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 యొక్క లీకైన బ్రోచర్ చిత్రాల ను గమనిస్తే, కంపెనీ ఈ బైక్ ను ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ ఆధారంగా డిజైన్ చేసినట్లు స్ఫష్టంగా తెలుస్తోంది. కాకపోతే, ఇది చూడటానికి స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌పై ఆధారపడి రూపొందినప్పటికీ, కంపెనీ ఇందులో ఆ రెట్రో థీమ్‌ను అలానే ఉపయోగించడం కొనసాగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

విండ్‌స్క్రీన్ మరియు ఫ్రంట్ ఫెండర్ లేకుండా ఉండే ఈ కొత్త స్క్రాంబ్లర్ స్టైల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ మొదటి చూపులో హిమాలయన్ మాదిరిగా కనిపిస్తుంది. అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్, ఫోర్క్ గైటర్‌లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ మరియు ఫ్యూయల్ ట్యాంక్‌ వంటి డిజైన్ లు కూడా హిమాలయన్ మోడల్ ను తలపిస్తాయి. అయితే, ఇందులోని హెడ్‌ల్యాంప్ యూనిట్ హిమాలయన్‌లోని ఫిక్స్‌డ్ యూనిట్‌లా కాకుండా స్టీరింగ్ తో పాటుగా కదిలే యూనిట్ గా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

ఇక ఇందులోని ఇతర మార్పులను గమనిస్తే, ముందు వైపున చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్‌లు మరియు వెనుకవైపు సింపుల్-పీస్ గ్రాబ్ రైల్ ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని డిజైనర్లు స్క్రామ్ 411ని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ నుండి వేరు చేయడానికి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోల్చితే రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మరింత రోడ్-ఫోకస్డ్ వెర్షన్ అయినందున, కంపెనీ ఇందులో ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 21 ఇంచ్ ఫ్రంట్ వీల్స్‌కు బదులుగా రోడ్-బయాస్డ్ మరియు ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ అయిన 19 ఇంచ్ ఫ్రంట్ వీల్స్‌ను జోడించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

ఈ రెట్రో డిజైన్ థీమ్‌ను పూర్తి చేయడానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ రెండు చివర్లలో స్పోక్డ్ వీల్స్‌ను ఉపయోగించింది మరియు ఈ రెండు చక్రాలపై డ్యూయల్ పర్పస్ టైర్‌లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కొత్త 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 యొక్క లీకైన బ్రోచర్ ఈ మోటార్‌సైకిల్ యొక్క కొన్ని హైలైట్ ఫీచర్లను కూడా వెల్లడిస్తుంది. ఈ బ్రోచర్ ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్ తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మరియు అల్యూమినియం సంప్ గార్డ్‌లను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

స్క్రామ్ 411 తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ ఇందులో హిమాలయన్ లో ఉపయోగించిన అదే 411సిసి ఇంజన్ ను ఈ కొత్త మోడల్ లో కూడా ఉపయోగించనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ నుండి ప్రయత్నించిన మరియు పరీక్షించబడిన 411cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్- SOHC ఇంజన్ ద్వారా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 శక్తిని పొందుతుందని మేము ఆశిస్తున్నారు. హిమాలయన్ లోని ఈ ఇంజన్ కూడా 24.3bhp పవర్ మరియు 32Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

అయితే, కొత్త స్క్రామ్ 411 లో దాని లైట్ వెయిట్ కారణంగా ఈ పవర్ మరియు టార్క్ గణాంకాలు స్వల్పంగా మారే అవకాశం ఉంది. మెకానికల్ అంశాలను గమనిస్తే, ముందువైపు 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ల ద్వారా బ్రేకింగ్ విధులు నిర్వహించబడే అవకాశం ఉంది. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ యొక్క రోడ్-ఫోకస్డ్ స్వభావానికి అనుగుణంగా దానిని సస్పెన్షన్‌ సెటప్ ను రీట్యూన్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ కి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌‍డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ బ్రోచర్ లీక్.. ఇది బక్కచిక్కిన హిమాలయన్ బైక్‌లా ఉందే..!?

ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ గతేడాది ఇటలీలోని మిలాన్ లో జరిగిన EICMA 2021 మోటార్ షోలో అనేక కొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. వీటిలో కొన్ని ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో ముందుగా రాబోతున్నది స్క్రామ్ 411. ఆ తర్వాత ఈ బ్రాండ్ నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650 - SG 650) వంటి ప్రీమియం మోటార్‌సైకిళ్లు కూడా ఇక్కడి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మూలం: బుల్లెట్ గురు

More from DriveSpark

Article Published On: Thursday, February 10, 2022, 16:15 [IST]
English summary
Upcoming royal enfield scram 411 brochure leaked online is it based on new himalayan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+