భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ-మొబిలిటీ స్టార్టప్ కాంపెనీ VAAN ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ లిమిటెడ్ దేశీయ మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

VAAN ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేరియంట్లలో అందుబటులో ఉంటుంది. ఇందులో ఒకటి అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ కాగా, మరొకటి అర్బన్‌స్పోర్ట్ ప్రో ఎలక్ట్రిక్ సైకిల్. వీటి ధరలు వరుసగా రూ. 59,999 మరియు రూ. 69,999.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో అంటే గోవా, కొచ్చి, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ మరియు ఢిల్లీ వంటి నగరాల్లో విక్రయానికి అందుబటులో ఉంది. కావున ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://vaanmoto.com/ ద్వారా బైక్ కోసం ప్రీ-ఆర్డర్‌లను తీసుకోవడం ప్రారంభించింది. అయితే డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

అర్బన్‌స్పోర్ట్ మరియు అర్బన్‌స్పోర్ట్ ప్రో రెండూ ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్న మరియు వినియోగానికి కావలసిన ఆధునిక ఉత్పత్తులు. ఈ రెండు వాహనాలు గతంలో ఇటలీలో జరిగిన EICMA 2021 మోటార్‌సైకిల్ ప్రదర్శనలో పరిచయం చేయబడ్డాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబటులో వచ్చాయి. ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

రెండు ఎలక్ట్రిక్ బైక్‌లు కాంపాక్ట్ 6061 అల్యూమినియం యునిసెక్స్ ఫ్రేమ్, శాడిల్, రిమ్స్ మరియు హ్యాండిల్‌బార్‌లను ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఇ-బైక్ వర్టికల్‌గా రూపొందించిన బెనెల్లీ బిసిక్లెట్ రూపొందించాయి. VAAN వారితో ఇంజినీరింగ్ మరియు సరఫరా గొలుసు కోసం టైఅప్ చేసారు మరియు అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ అభివృద్ధి చేయడానికి బెనెల్లీ బృందంతో కలిసి పనిచేశారు. ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ లో దాదాపు అన్ని ప్రధాన మెకానికల్‌లు ఒకే విధంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

ఇందులో షిమనో టోర్నీ 7-స్పీడ్ డెరైలర్ గేర్ సిస్టమ్, ముందు మరియు వెనుక డిస్క్ బ్రేక్‌లు మరియు స్పిన్నర్ USA ఫ్రంట్ షాక్‌లను కలిగి ఉంటాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్ లో 250 W హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి ఉంటుంది. 48-వోల్ట్, 7.5 యాంపియర్ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ సైకిల్ మోటార్‌కు శక్తినివ్వడానికి ఉపయోగించబడుతుంది. సైకిల్‌లో పెడల్ అసిస్ట్ సిస్టమ్ మరియు మొత్తం 5-ఎలక్ట్రిక్ 'గేర్ లెవెల్' సిస్టమ్‌ను అమర్చారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగంతో నడుస్తుంది. అదే సమయంలో, ఇది పెడల్ అసిస్ట్ సిస్టమ్ సహాయంతో 60 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఒకసారి పూర్తి ఛార్జింగ్‌కు కేవలం అర యూనిట్ పవర్ మాత్రమే అవసరమవుతుంది. దీని ధర కేవలం రూ.4 నుంచి రూ. 5 మాత్రమే అని కంపెనీ తెలిపింది. ఈ సైకిల్ లో రిమూవబుల్ బ్యాటరీ కేవలం 2.5 కిలోల బరువు ఉంటుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు సమయం పడుతుంది.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

VAAN అర్బన్‌స్పోర్ట్ ఈ-సైకిల్ స్మార్ట్ LCD డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది వినియోగదారునికి వెహికల్ గురించి కావాల్సిన సమాచారం తెలుపుతుంది. ఇది ముందు మరియు వెనుక లైట్లను నియంత్రించడానికి కూడా ఉపయోగించవచ్చు. అర్బన్‌స్పోర్ట్ ఈ రెండింటిలో అత్యంత ఆచరణాత్మకమైనది మరియు 20 ఇంచెస్ స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇది 15 కిలోల వరకు బరువును మోయగల క్యారియర్‌తో అమర్చబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

VAAN అర్బన్‌స్పోర్ట్ ప్రో అనేది మరింత స్టైలిష్ మరియు ప్రీమియం ఈ-బైక్, ఇది అల్లాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రిక్ మోటారు రియర్ హబ్‌తో జత చేయబడి ఉంటుంది. కెటిఎమ్ యాజమాన్యంలోని కిష జిఎంబిహెచ్, ఆస్ట్రియా వాన్ యొక్క బ్రాండింగ్‌ను నిర్వహిస్తుంది. బ్రాండ్ దుస్తులు, సైక్లింగ్ హెల్మెట్‌లు మరియు జెర్సీలను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్టార్టప్ స్మార్ట్ వాచ్‌లు ఇప్పటికే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్: ధర రూ. 59,999 మాత్రమే

మొత్తానికి ఈ సైకిల్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. అయితే ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే విషయాలు త్వరలో తెలుస్తాయి. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులకు మరియు కార్లకు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సైకిల్ కి కూడా డిమాండ్ భారీగానే ఉన్న కారణంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కూడా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Vaan electric launches e cycles in india price features details
Story first published: Saturday, January 22, 2022, 15:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X