ఒక్కసారిగా మూడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్: Joy e-bike.. ధర తక్కువ, మంచి పరిధి కూడా
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల యొక్క వినియోగం రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశీయ విఫణిలోని 'వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్' మార్కెట్లో రెండు కొత్త 'మేడ్-ఇన్-ఇండియా' హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేసింది. అవి వోల్ఫ్+ (Wolf+) స్కూటర్ మరియు నాను+ (Nanu+) స్కూటర్ మరియు డెల్ గో (Del Go) (ఫ్లీట్ మేనేజ్‌మెంట్ స్కూటర్). ఈ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ స్కూటర్ల ధరలు వరుసగా రూ.1.10 లక్షలు (వోల్ఫ్+), రూ.1.06 లక్షలు (నాను+) మరియు రూ.1.14 లక్షలు (డెల్ గో). ఈ మూడు స్కూటర్ల యొక్క బుకింగ్స్ కంపెనీ యొక్క అన్ని డీలర్‌షిప్‌లలో ప్రారంభమవుతుంది.

కంపెనీ యొక్క అన్ని స్కూటర్ల యొక్క ఉత్పత్తి గుజరాత్‌లోని వడోదరలో ఉన్న కంపెనీ తయారీ కేంద్రంలో జరుగుతుంది. వోల్ఫ్+ ఎలక్ట్రిక్ స్కూటర్ నగర ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉటుంది. అదే సమయంలో మిగిలిన రెండు స్కూటర్లు కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

కంపెనీ యొక్క నాను (Nanu+) స్కూటర్ యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మంచి డిజైన్ తో తయారుచేయడం జరిగింది. ఈ స్కూటర్ (వోల్ఫ్+) పొడవైన సీటును కలిగి ఉంటుంది. దీని ఎత్తు 740 మిమీ వరకు ఉంటుంది. వీల్‌బేస్ 1,345 మి.మీ వరకు ఉంటుంది. అదేవిధంగా నాను (Nanu+) స్కూటర్ సీటు ఎత్తు 730 మిమీ మరియు 325 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు స్కూటర్ల యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు కూడా దాదాపు ఒకేవిధంగా ఉంటుంది.

ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ మరియు వెనుక వైపున మోనో-షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లు 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 1.6 మీ టర్నింగ్ రేడియస్‌తో ఆఫ్-రోడ్‌ల కోసం ఖచ్చితంగా రూపొందించబడ్డాయి.

వోల్ఫ్+, నాను+ విభిన్న సెన్సార్‌లతో ఇంటెలిజెంట్ ఫీచర్‌లను కూడా పొందుతుంది. అంతే కాకూండా వోల్ఫ్+ మరియు నాను+ కోసం వన్-ట్యాప్ కంట్రోల్ అయిన ‘జాయ్ ఇ-కనెక్ట్ యాప్' వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కి కనెక్ట్ చేయవచ్చు. దీని ద్వారా ఈ స్కూటర్‌లను ట్రాక్ చేయవచ్చు మరియు బ్యాటరీ స్థితిని కూడా రిమోట్‌గా తనిఖీ చేయవచ్చు.

ఈ రెండు స్కూటర్లు మూడు డ్రైవ్ మోడ్‌లతో వస్తాయి. అవి ఎకో, స్పోర్ట్స్ మరియు హైపర్ మోడ్స్. స్కూటర్ల ప్రాక్టికాలిటీని మరింత మెరుగుపరచడానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని రివర్స్ మోడ్ సదుపాయంతో, ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల నుండి సులభంగా బయటకు రావడానికి మరియు వెనుకకు రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, జిపిఎస్ సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ మరియు జియో-ఫెన్సింగ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ బ్రేక్ లివర్‌ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని రీఛార్జ్ చేయడం ద్వారా వాహనం యొక్క పరిధిని పెంచడానికి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఇందులోని మోటార్లు స్కూటర్ల ప్రాక్టికాలిటీని మెరుగుపరచడానికి మూడు-స్పీడ్ కంట్రోలర్‌తో కలిపి కేటగిరీలో అత్యుత్తమ టార్క్‌ను అందించడానికి అనుకూలంగా ఇవి తయారుచేయబడ్డాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఇందులో 1500 వాట్ మోటార్ ఉంటుంది. రెండు స్కూటర్‌లకు బ్యాటరీ 60V 35 Ah గా రేట్ చేయబడింది. ఇది ఒక పోర్టబుల్ బ్యాటరీ, ఇది ఛార్జ్ చేసుకోవడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఒక చార్జికి దాదాపు 100కిమీ పరిధిఐ అందిస్తుంది. ఇది 20 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం 55 కిమీ/గం వరకు ఉంటుంది.

స్కూటర్‌లలో ట్విన్ డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉంటాయి, వాహనాన్ని వీలైనంత తక్కువ దూరం వద్ద ఆపడానికి ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఇవి రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

డెల్ గో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాల కోసం డెలివరీ వాహనం. డెల్ గో యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క సీట్ ఎత్తు 820 మి.మీ, వీల్ బేస్ 1315 మి.మీ,1950 మిమీ పొడవు మరియు 720 మిమీ వెడల్పు మరియు 1070 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది.

డెల్ గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ అందుబాటులో ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఇందులో ఫ్లీట్ హెల్త్ మానిటరింగ్ మరియు జియో-ఫెన్స్ అలర్ట్‌లను కూడా కలిగి ఉంది. ఈ బైక్ ఒక్క ఛార్జ్ తో దాదాపు 100 కిమీ పరిధిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








