హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

ప్రపంచంలో ఎక్కువ రోడ్డుప్రమాదాలు జరిగే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉండటం గమనార్హం. ఈ కారణంగానే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన రోడ్డు నియమాలను అమలులోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ చాలామంది ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

సాధారణంగా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహన వినియోగదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఏకంగా ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంది. కావున తప్పకుండా హెల్మెట్ ధరాయించాలి. హెల్మెట్ అన్ని విధాలుగా వాహనదారుల ప్రాణాలను రక్షిస్తుంది.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

ఇటీవల ప్రభుత్వం 1998 నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ సరిగ్గా ధరించకపోతే వారికి రూ. 2,000 వరకు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అంతే కాకూండా హెల్మెట్ ధరించి, హెల్మెట్ పట్టీ తెరిచి ఉంటే వారికి రూ. 1,000 వరకు జరిమానా విధించబడుతుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఈ నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

అది మాత్రమే కాకుండా.. వాహన వినియోగదారులు ఉపయోగించే హెల్మెట్స్ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' చేత తప్పకుండా ధృవీకరించబడి ఉండాలి. ఆలా ద్రువీకరించబడకపోతే రూ. 1,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనితోపాటు మీరు హెల్మెట్ ధరించి ఉండి కూడా ట్రాఫిక్ సిగ్నెల్ క్రాస్ చేసినా.. మీకు రూ.2000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కావున ద్విచక్ర వాహనదారులు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

ఇప్పుడు హెల్మెట్ ధరించిన వారు దానికున్న పట్టీ కూడా లాక్ చేయాలి. ఒక వేళా హెల్మెట్ పట్టీ లాక్ చేసుకోకపోతే, ప్రమాదం జరిగే సమయలో హెల్మెట్ వెంటనే బయట పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వాహనదారునికి ప్రమాదం జరుగుతుంది. అయితే చలానాలు నుంచి తప్పించుకోవడానికి పగిలిన లేదా సురక్షితం కానీ హెల్మెట్స్ ధరిస్తారు. అది వాహనదారునికి మరింత ప్రమాదాన్ని తెస్తుంది.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

ఇప్పటికే భారతదేశంలో సురక్షితం కానీ హెల్మెట్స్ అమ్మకం కానీ.. వినియోగించడం కానీ పూర్తిగా నిషేదించింది. ఇది 2021 జూన్ నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలో బిఐఎస్ సర్టిఫికేట్ లేని హెల్మెట్ల ఉత్పత్తి మరియు అమ్మకాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

ఇప్పుడు మార్కెట్లో బీఐఎస్ సర్టిఫికేట్ లేకుండా ఉండే హెల్మెట్‌లను విక్రయించడం శిక్షార్హమైన నేరం. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కొత్త నిబంధన జూన్ 1, 2021 నుండి అమలు చేయబడింది. ఇప్పుడు ఐఎస్‌ఐ లేని హెల్మెట్‌లను విక్రయిస్తే కనీసం 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించబడే అవకాశం ఉంది. ఈ నిబంధన ఐఎస్‌ఐ కాని హెల్మెట్‌ల తయారీదారులకు, దిగుమతిదారులకు మరియు అమ్మకందారులకు సమానంగా వర్తిస్తుంది.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

భారతదేశంలోని దాదాపు అన్ని సేఫ్టీ ఉత్పత్తులకు ISI సేఫ్టీ మార్క్ ఇచ్చే పనిని 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) చేస్తుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇది ఉత్పత్తులకు భద్రతా ప్రమాణాలను నిర్దేసిందే ప్రభుత్వ సంస్థ. అన్ని హెల్మెట్ తయారీ కంపెనీలు బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నాణ్యతా రుజువును తీసుకోవాలి. అప్పుడే అవి మార్కెట్లో సురక్షితమైన హెల్మెట్స్ గా పరిగణించబడతాయి.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

దేశంలో విక్రయిస్తున్న నకిలీ హెల్మెట్‌ల కారణంగా, రోడ్డు ప్రమాదాల సమయంలో ఐఎస్‌ఐ లేని నకిలీ హెల్మెట్‌లు ద్విచక్ర వాహనదారుడి తలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని బిఐఎస్ ప్రకటించింది. దీంతో రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల మరణాల రేటు పెరుగుతుందని కూడా దీని ద్వారా తెలిపింది. కావున తప్పకుండా మార్కెట్లో అధికారికంగా దృవీకరించబడిన హెల్మెట్స్ మాత్రమే వాడాలని తెలిపింది. వాహన వినియోగదారులు కూడా దీనిని తప్పకుండా పాటించాలి. అప్పుడే ప్రమాదాల్లో జరిగే మరణాల సంఖ్య తగ్గుతుంది.

హెల్మెట్ ధరించినా అలా చేస్తే జరిమానా తప్పదు.. ఎలా అనుకుంటున్నారా..?

హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలతో బయటపడిన సంఘటనలు చాలానే తెలుసుకున్నాం. కావున ద్విచక్ర వాహన వినియోగదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడం ఎప్పుడూ విస్మరించకూడదు. అది వాహన దారునికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని తీసుకువస్తుంది. మొత్తం మీద ద్విచక్ర వాహన వినియోగదారులు హెల్మెట్ ధరించాలి. అప్పుడే ట్రాఫిక్ ఫైన్ వంటి వాటి నుంచి కూడా తప్పించుకోగలుగుతారు.

Most Read Articles

English summary
Wearing helmet without strap to attract fine of rs 2000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X