పాత మోడల్ ఏథర్ 450ఎక్స్‌కి మరియు కొత్త జెన్ 3 మోడల్‌కి మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే..?
బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ ఇటీవలే మూడవ తరం మోడల్ ను విడుదల చేసిన చేసిన సంగతి తెలిసినదే. కొత్త 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (2022 Ather 450X Gen 3) మోడల్ దాని పాత మోడల్ తో పోలిస్తే మరిన్ని అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్‌లలో అదనపు ఫీచర్లు, పెద్ద మరియు మెరుగైన బ్యాటరీ మేనేజ్‌మెంట్, మరింత ఎక్కువ రేంజ్ మరియు మెరుగైన పనితీరు వంటి అంశాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి మనం ఇదివరకటి కథనాల్లో కూడా తెలుసుకున్నాం.

అయితే, పాత తరం మోడల్‌కో పోలిస్తే, ఈ కొత్త మోడల్ ఎంతవరకు మెరుగుపడింది మరియు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లలో కంపెనీ చేసిన ప్రధాన మార్పులు ఏమిటో ఈ కథనంలో చాద్దాం రండి. ముందుగా ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో సైడ్ మిర్రర్ల డిజైన్‌లో మార్పు తప్ప వేరే మార్పును గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే, కంపెనీ ఈ కొత్త తరం మోడల్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు దీని డిజైన్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం యాంత్రికపరమైన మార్పులు మాత్రమే చేసింది.

పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ లోని సైడ్ మిర్రర్స్ ఇప్పుడు కొంచెం వెడల్పుగా మరియు మరింత స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. కంపెనీ ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు కనీసం కొత్త Ather 450X Gen3 ఎలక్ట్రిక్ స్కూటర్ పై 'Gen3' బ్యాడ్జింగ్ కూడా అంటించలేదు. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో వ్యత్యాసాన్ని గుర్తించడం ఎవరికైనా కష్టమే అని చెప్పాలి. ఇతర ఎక్స్టీరియర్ మార్పులలో మరింత ధృడమైన కొత్త సైడ్ స్టెప్స్ మరియు ఎక్కువ రోడ్ గ్రిప్ ను అందించే కొత్త MRF టైర్‌లు ఉన్నాయి. అంతే కాకుండా, వెనుక టైర్లు వెడల్పుగా ఉండి, 100/80-R12 కొలతలను కలిగి ఉంటాయి.

ఈ కొత్త టైర్లు మెరుగైన యాక్సిలరేషన్, కార్నరింగ్ మరియు బ్రేకింగ్ పనితీరులో సహాయపడతాయి మరియు టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (TPMS) ను కూడా సపోర్ట్ చేస్తాయని కంపెనీ తెలిపింది. ఇక అసలైన మార్పులన్నీ కూడా స్కూటర్ క్రింది భాగంలో చేయబడ్డాయి. పాత తరం ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.9kWh బ్యాటరీ ప్యాక్ ను అందించేవారు. ఇది పూర్తి చార్జ్ పై కేవలం 116 కిమీ సర్టిఫైడ్ రేంజ్ మరియు 85 కిమీ రియల్ టైమ్ రేంజ్‌ను మాత్రమే ఆఫర్ చేసేది. ఇదే విషయంపై వినియోగదారులు కూడా ఫిర్యాదు చేయడంతో కంపెనీ తమ జెన్ 3 మోడల్ బ్యాటరీ సామర్థ్యాన్ని మరియు రేంజ్ ను రెండింటినీ పెంచింది.

కొత్త తరం 2022 ఏథర్ 450ఎక్స్ జెన్ 3 మోడల్ లో కంపెనీ పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ కేవలం 19 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది మరియు పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 146 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను మరియు ఎకో మోడ్ లో 105 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏథర్ 450ఎక్స్ యొక్క పాత బ్యాటరీ ప్యాక్ తో పోలిస్తే, ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు 25 శాతం మెరుగ్గా ఉంటుంది మరియు 20 శాతం అదనపు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్‌లో చేసిన మార్పుల కారణంగా, దాని బ్యాటరీ బరువు కూడా 4 కేజీలు పెరిగింది. దీంతో, పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని అమర్చడానికి వీలుగా ఏథర్ ఎనర్జీలోని ఇంజనీర్లు బ్యాటరీ ప్యాక్‌కి సరిపోయేలా స్కూటర్ యొక్క ఛాసిస్‌లోని మౌంటు పాయింట్‌లను కూడా మార్చారు. ఇది ఫుల్ స్పీడ్ లో స్కూటర్ ను నడిపే వార్ప్ మోడ్‌లో, పూర్తి ఛార్జ్‌పై 65 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఈ రేంజ్ కూడా దాని ముందున్న మోడల్ కంటే 10 కిమీ అదనంగా ఉంటుంది. ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ టార్క్ గణాంకాలు కూడా మారాయి.

ఏథర్ ఎనర్జీ ఈ కొత్త తరం మోడల్ లో అదే పాత 6kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించినప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ వలన ఈ ఎలక్ట్రిక్ మోటార్ అత్యుత్తమమైన 26 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సగటున ఓ 350సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ విడుదల చేసే టార్క్ తో సమానంగా ఉంటుంది. ఇకపోతే, ఇందులో చేసిన చివరి మార్పు ఏంటంటే, ఈ స్కూటర్ లో ఉపయోగించే డిస్‌ప్లే యూనిట్ యొక్క ర్యామ్ సామర్థ్యాన్ని 2జిబికి పెంచడం. గత మోడల్ లో ఇది 1జిబిగా మాత్రమే ఉండేది. పెరిగిన ర్యామ్ కారణంగా దీని టచ్ రెస్పాన్స్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఉంటుంది మరియు భవిష్యత్తులో మరిన్ని అప్‌డేట్ లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది.

ఇక చివరిగా ధర విషయానికి వస్తే, పాత తరం మోడల్ తో పోలిస్తే కొత్త తరం మోడల్ ధరలు కేవలం రూ.5,000 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.34 లక్షల నుండి రూ.1.57 లక్షల మధ్యలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








