BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) ఇటీవలే తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్‌బైక్ బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ఆర్ (BMW G 310 RR) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. బిఎమ్‌డబ్ల్యూ ఈ బైక్ ను భారతదేశంలోని టీవీఎస్ మోటార్ కంపెనీ సహకారంతో అభివృద్ధి చేసింది. చైన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) ప్లాట్‌ఫారమ్‌ ను ఆధారంగా చేసుకొని బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ఆర్ ను తయారు చేశారు.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

టీవీఎస్ మోటార్ కంపెనీతో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ యొక్క భాగస్వామ్యంలో భాగంగా, ఈ జర్మన్ కంపెనీ భారత మార్కెట్లో BMW G 310 RR మరియు BMW G 310 GS అనే రెండు ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. ఇకపోతే, టీవీఎస్ తమ అపాచే లైనప్ లో ఫ్లాగ్‌షిప్ మోడల్ గా RR 310 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ను అందిస్తోంది. ఈ మూడు మోటార్‌సైకిళ్లు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారు చేయబడ్డాయి మరియు ఒకే రకమైన ఇంజన్‌ను ఉపయోగిస్తాయి. అయితే, వీటిలోని ఇతర భాగాలు మాత్రం భిన్నంగా ఉంటాయి.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ఆర్ అనేది BMW-TVS భాగస్వామ్యంలో తయారు చేయబడిన నాల్గవ మోటార్‌సైకిల్ మరియు ఇది టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 మోడల్ కు చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. మరి ఈ రెండు మోడళ్లలో ఉన్న సారూప్యతలు మరియు వ్యత్యాసాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

డిజైన్ మరియు కొలతలు

డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకేలా ఉంటాయి. ఇందులోని అన్ని బాడీ ప్యానెల్‌లు ఒకదానితో మరొకటి పంచుకుంటాయి మరియు ఇవి రెండూ కూడా పూర్తి ఫెయిరింగ్‌ను కలిగి ఉంటాయి. బిఎమ్‌డబ్ల్యూ తమ బైక్ లో హెడ్‌లైట్ ఏరియాలో మరియు బైక్ చుట్టుపక్కల చిన్నపాటి మార్పులు చేసి మరింత షార్ప్ లుక్‌ని అందించింది. కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని, ఈ రెండు మోటార్‌సైకిళ్ల రూపకల్పనలో సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందించారు.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

వాస్తవానికి, ఈ రెండు బైక్‌ల మధ్య అతిపెద్ద వ్యత్యాసం కలర్ ఆప్షన్లలో ఉంటుంది. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 రెండు కలర్లలో లభిస్తుంది. ఇందులో టైటానియం బ్లాక్ మరియు రేసింగ్ రెడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, బిఎమ్‌డబ్ల్యూ దాని సిగ్నేచర్ కలర్ ఆప్షన్ లో జి 310 ఆర్ఆర్ బైక్ ని అందిస్తుంది. ఇది ఈ రెండు మోటార్‌సైకిళ్లకు స్పష్టమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే ఛాసిస్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి, కొలతల పరంగా కూడా ఒకేలా ఉంటాయి. అలాగే, ఇవి రెండూ ఒకే ఇంజన్, బాడీ ప్యానెల్‌లు, ఎలక్ట్రికల్‌లు మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ రెండు బైక్‌ల పొడవు 2001 మిమీ, వెడల్పు 786 మిమీ, సీట్ ఎత్తు 810 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లుగా ఉంటాయి.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

పరికరాలు మరియు సాంకేతికత

పరికరాల పరంగా చూస్తే, మరోసారి రెండు మోటార్‌సైకిళ్లు కూడా ఒకేలా సమానంగా ఉంటాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ముందువైపు అప్-సైడ్ డౌన్ (USD) ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు మరియు మూడు మోడ్‌లతో కూడిన డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, 5.0 ఇంచ్ టిఎఫ్టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 17 ఇంచ్ వీల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

అపాచే యొక్క బిటిఓ వెర్షన్ ను సర్దుబాటు చేయగల ఫ్రంట్ సస్పెన్షన్, దిగువ సెట్ హ్యాండిల్‌బార్లు, వెనుక సెట్ ఫుట్ పెగ్‌లు, కస్టమైజబల్ కలర్ ఆప్షన్లు, బ్రాస్-కోటెడ్ చైన్, పూర్తిగా సర్దుబాటు చేయగల వెనుక సస్పెన్షన్ వంటి వాటితో కస్టమైజ్ చేయవచ్చు.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

ఇంజన్ మరియు పనితీరు

ఇదివరకు చెప్పుకున్నట్లుగా BMW G 310 RR మరియు TVS Apache RR 310 రెండూ కూడా ఒకే రకమైన ఇంజన్ ను కలిగి ఉంటాయి. ఇందులోని 312.2 సీసీ, ఆయిల్ మరియు లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 27.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్ అసిస్ట్ క్లచ్ తో అనుసంధానించబడి ఉంటుంది. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కేవలం 7.1 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు మరియు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీయగలదు.

BMW G 310 RR వర్సెస్ TVS Apache RR 310.. ఈ రెండు బైక్స్ ఒకేలా ఉన్నాయా..?

టీవీఎస్ అపాచే 310 ఆర్ఆర్ నాలుగు రైడింగ్ మోడ్‌ లను కూడా పొందుతుంది. ఇందులో స్పోర్ట్, ట్రాక్, అర్బన్ మరియు రెయిన్ అనే రైడింగ్ మోడ్స్ ఉంటాయి. స్పోర్ట్ మరియు ట్రాక్ మోడ్‌లు పూర్తి శక్తిని అందిస్తాయి, అయితే రెయిన్ మరియు అర్బన్ మోడ్‌లలో పవర్ 25 బిహెచ్‌పి మరియు టార్క్ 25 ఎన్ఎమ్ గా ఉంటాయి. అలాగే, అర్బన్ మరియు రెయిన్ మోడ్‌లు కూడా మోటార్‌సైకిల్ యొక్క గరిష్ట వేగాన్ని గంటకు 125 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేస్తాయి.

Most Read Articles

English summary
What is the difference between bmw g310 rr and tvs apache rr 310
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X