ప్రపంచంలోనే ఇది మొట్ట మొదటి హెల్మెట్: అంత ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చదవాల్సిందే

ప్రపంచం రోజురోజుకి అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తోంది. ఈ తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటాలియన్ హెల్మెట్ తయారీదారు ఒక అద్భుతమైన హెల్మెట్ ఆవిష్కరించింది. ఇలాంటి హెల్మెట్ ప్రపంచంలోనే మొట్ట మొదటి హెల్మెట్ కావడం గమనార్హం.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో అత్యంత దృఢమైన హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్ల యొక్క భద్రత కోసం ప్రత్యేకంగా తయారుచేయబడి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఏ హెల్మెట్ కూడా ఎయిర్ బ్యాగుతో రాలేదు. అయితే ఇప్పుడు ఇటాలియన్ హెల్మెట్ తయారీదారు 'ఎయిర్ బ్యాగ్' కలిగిన హెల్మెట్ రూపొందించింది. ఇది ప్రపంచంలో ఎయిర్ బ్యాగ్ కలిగిన మొట్ట మొదటి హెల్మెట్.

ప్రపంచంలోనే ఇది మొట్ట మొదటి హెల్మెట్

ఇటాలియన్ కంపెనీ రూపొందించిన ఎయిర్ బ్యాగ్ ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ 2023 నాటికి ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 70 సంవత్సరాలు గొప్ప అనుభవం కలిగిన స్వీడిష్ కంపెనీ సహకారంతో ఈ ఎయిర్ బ్యాగ్ కలిగిన హెల్మెట్ రూపొందించబడింది. ఇది తప్పకుండా వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తూ.. ప్రమాదాల్లో తప్పకుండా బైక్ రైడర్ కి రక్షణ కల్పిస్తుంది. తద్వారా ప్రాణాపాయం తప్పుతుంది.

ఇంటిగ్రేటెడ్ ఎయిర్ బ్యాగ్ కారు డ్యాష్ బోర్డ్ లోని టెక్నాలజీ మాదిరిగానే పనిచేస్తుంది. ఇది ప్రమాద సమయంలో హెల్మెట్ నుంచి బయటకు వచ్చి తలకు ఎక్కువ గాయాలు కాకుండా కాపాడటంలో సహాయపడుతుంది. సరైన మరియు దృఢమైన హెల్మెట్ ధరించని సమయంలో తలకు గట్టి దెబ్బలు తగిలినప్పుడు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ఒక వేళ ప్రాణాలు పోకుండా పోయినా తప్పకుండా పెద్ద నష్టాన్ని తీసుకువస్తుంది.

ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఎయిర్ బ్యాగ్ హెల్మెట్ కోసం 2020 నుంచి టెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆశించిన స్థాయిలో కావలసిన ఫీచర్స్ అందించడానికి కంపెనీ తగిన ఏర్పాట్లు చేస్తూ మొత్తానికి ఇప్పుడు ఆవిష్కరించింది. అయితే ఈ హెల్మెట్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే 2023 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ హెల్మెట్ భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేది ఖచ్చితంగా తెలియదు.

ఈ రకమైన ఎయిర్ బ్యాగ్ కలిగిన హెల్మెట్ భారతీయ మార్కెట్లో కూడా విడుదలయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నియమాలను అమలు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్యను తగ్గించలేకుండా పోతోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లోనూ బైక్ రైడ్ చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలి. బైక్ మీద ఇద్దరు ప్రయాణిస్తే తప్పకుండా ఇద్దరూ హెల్మెట్ ధరించాలి. లేకుంటే భారీగా జరిమానాలు విధించడమే కాకుండా, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి కఠినమైన శిక్షలు కూడా విధిస్తారు. అయితే ప్రస్తుతం దేశంలో చాలా వరకు బైక్ రైడర్స్, కార్ వినియోగదారులు అందరూ కూడా చాలావరకు మోటార్ వాహన చట్టాలను పాటిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఇలాంటి హెల్మెట్స్ అవసరం చాలా ఉంది. ఇలాంటి హెల్మెట్స్ వల్ల ప్రమాదాల్లో మరణించేవారు సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. భారతదేశంలోకి ఇలాంటి హెల్మెట్స్ తీసుకురావడానికి కూడా కంపెనీలు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతోపాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, December 5, 2022, 16:02 [IST]
English summary
Worlds first airbag helmet to launch soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+