యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా (Yamaha) కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్‌' ఇప్పుడు కొత్త కలర్స్ లో అందుబాటులో వచ్చింది. ఈ కొత్త కలర్ ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్‌ మునుపటి కంటే కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఇందులో డిజైన్ మరియు ఫీచర్స్ వంటి వాటిలో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా..? కొత్త కలర్ ఆప్సన్స్ మన దేశంలోకి అందుబాటులోకి వస్తాయా..? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో ఈ మధ్య కాలంలో విడుదలైన కొత్త యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్‌ అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో కేవలం నాలుగు కలర్ ఆప్సన్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది, కాగా ఇండోనేషియా మార్కెట్లో మొత్తం ఎనిమిది కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇది యువ కొనుగోలుదారులను మరింత ఆకర్శించే అవకాశం ఉంది.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్‌ యొక్క కలర్స్ విషయానికి వస్తే, అవి రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లాక్, గ్రే వెర్మిలియన్ మరియు మాన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎడిషన్ కలర్స్. కాగా ఇండోనేషియాలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ సియాన్ సిల్వర్, మెటాలిక్ రెడ్, ఎల్లో బ్లూ మరియు బ్లాక్ సిల్వర్ వంటి కలర్స్ తో పాటు ఎల్లో బ్లూ కలర్ ఆప్షన్‌లో బ్లూ కలర్ ఫ్రంట్ వీల్స్ మరియు ఎల్లో కలర్ రియర్ వీల్స్ లభిస్తాయి. కాగా సియాన్ సిల్వర్ మ్యాక్సీ-స్కూటర్ యొక్క రెండు చివర్లలో వైబ్రెంట్ లుకింగ్ సియాన్ కలర్ వీల్స్‌ను పొందుతుంది. ఇవి ఇప్పుడు చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తాయి.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

మెటాలిక్ రెడ్ మరియు బ్లాక్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లు గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను స్టాండర్డ్‌గా పొందుతాయి. ఏరోక్స్ 155 మాక్సీ-స్కూటర్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధరలు ఇండోనేసియాలో Rp 2,70,75,000. అంటే ఇది మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.42 లక్షలు.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా ఎరోక్స్ 155 సైబర్‌సిటీ కలర్ ఆప్షన్‌లో ప్రత్యేకంగా కనిపించే రెడ్ కలర్ వీల్స్, కలర్ గ్రేడియంట్స్ మరియు స్పోర్టీ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఖరీదైనదిగా ఉంటుంది. దీని ధర Rp 2,72,75,000 (రూ. 1.44 లక్షలు).

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా ఏరోక్స్ 155 మ్యాక్సీ-స్కూటర్ యొక్క ABS వెర్షన్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి మ్యాక్సీ సిగ్నేచర్ బ్లాక్ మరియు ప్రెస్టీజ్ సిల్వర్. వీటి ధరలు మునుపటి వెర్షన్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కావున ఇది Rp 3,06,05,000 వద్ద అందుబాటులో ఉంటుంది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 1.62 లక్షలు.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

చివరగీ టాప్-స్పెక్ వేరియంట్ 'మ్యాక్సీ-స్కూటర్ వరల్డ్ GP 60వ యానివెర్సరీ లైవరీ' విషయానికి వస్తే, ఇది మల్టిపుల్ షేడ్స్ లో అందుబాటులో ఉంటుంది. కావున ఇందులో వైట్, రెడ్, ఎల్లో మరియు బ్లాక్ కలర్ ఉన్నాయి. దీని ధరల విషయానికి వస్తే Rp 3,11,10,000 వద్ద అందుబాటులో ఉంటుంది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర రూ. 1.65 లక్షలు.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

కట్ యమహా ఏరోక్స్ 155 మాక్సీ-స్కూటర్ యొక్క ఇంజిన్ మరియు పర్ఫామెన్స్ లో ఎటువంటి మార్పులు లేదు, కావున ఇందులో అదే 155cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 14.75 బిహెచ్‌పి పవర్ మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సివిటి గేర్‌బాక్స్ ద్వారా పవర్ ను వెనుక చక్రాలకు పంపిస్తుంది.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా ఏరోక్స్ 155 (Aerox 155) స్కూటర్ యొక్క ముందు భాగంలో స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. యమహా ఏరోక్స్ 155 యొక్క ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ట్రెడిషనల్ స్కూటర్‌ల మాదిరిగా ఫ్లాట్‌గా కాకుండా నిటారుగా ఉంటుంది, ఇదొక మోటార్‌సైకిల్ లాంటి అనుభూతిని అందిస్తుంది.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

యమహా ఏరోక్స్ 155 వెనుక భాగం మొత్తం షార్ప్ డిజైన్‌తో చక్కగా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు చంకీ 140-సెక్షన్ రియర్ టైర్‌తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ మాక్సీ స్కూటర్‌లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్, 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి 140 మిమీ రియర్ టైర్, బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్, 5.8 ఇంచ్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ మరియు 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి.

యమహా ఏరోక్స్ 155 స్కూటర్: ఇప్పుడు మరిన్ని హంగులు & మరికొన్ని రంగులలో.. పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందుతున్న యమహా ఏరోక్స్ 155 స్కూటర్ మరిన్ని కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రావడం వల్ల మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఈ కొత్త కలర్స్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో లేదు, రానున్న రోజుల్లో ఈ కొత్త కలర్స్ దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంటుందా.. లేదా అనేది ప్రశ్నార్థకం.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha aerox 155 gets new sportier and youthful colour options details
Story first published: Monday, November 7, 2022, 14:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X