యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) మాక్సీ స్కూటర్ అభిమానుల కోసం తమ కొత్త తరం ఆర్15 మోడల్ ఆధారంగా తయారు చేసిన సరికొత్త యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ మ్యాక్సీ-స్కూటర్ భారతదేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ, దీనికి ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

అంతే కాకుండా, 'Aerox' అనే నేమ్‌ప్లేట్ చాలా కాలంగా యూరప్ మరియు ఆసియా మార్కెట్లలో ఉపయోగించబడుతోంది. Yamaha Aerox 155 భారతదేశంలో మాక్సీ-స్కూటర్‌గా ప్రవేశపెట్టబడింది మరియు ఇది Aprilia SR160 వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. మార్కెట్లో ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. మరి ఈ మాక్సీ స్టైల్ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆ టాప్ 5 విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

డిజైన్ మరియు ప్లాట్‌ఫామ్:

యమహా అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 (R15) మాదిరిగానే ఈ ఏరోక్స్ 155 (Aerox 155) స్కూటర్ కూడా అదే ప్లాట్‌ఫామ్ మరియు టెక్నాలజీపై ఆధారపడి తయారు చేయబడింది. ఫలితంగా, ఇందులోని ఇంజన్ కూడా యమహా ఆర్15 మోడల్ తో పంచుకుంటుంది. కాబట్టి, ఈ మాక్సీ స్కూటర్ మెరుగైన స్పోర్టీ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

యమహా ఏరోక్స్ 155 భారీ స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. యమహా ఏరోక్స్ 155 యొక్క ఫ్లోర్‌బోర్డ్ డిజైన్ భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్‌ల మాదిరిగా ట్రెడిషనల్ గా కాకుండా నిటారుగా ఉంటుంది, ఇదొక మోటార్‌సైకిల్ లాంటి అనుభూతిని అందిస్తుంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

ఇందులో ఆచరణాత్మకమైన మరియు సౌకర్యవంతమైన ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్‌కు బదులుగా, యమహాలోని ఇంజనీర్లు రెండు ఫుట్‌వెల్‌లను వేరుచేసే మధ్యలో ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉండే కాలమ్‌ను అమర్చారు. ఈ సెటప్ తక్కువ గురుత్వాకర్షణ కేంద్రం కారణంగా మంచి హ్యాండ్లింగ్ ను అందిస్తుంది. యమహా ఏరోక్స్ 155 వెనుక భాగం మొత్తం షార్ప్ డిజైన్‌తో చక్కగా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు చంకీ 140-సెక్షన్ రియర్ టైర్‌ను కలిగి ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

ఇంజన్:

Yamaha Aerox 155 పవర్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు VVA టెక్నాలజీతో కూడిన 155cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,000rpm వద్ద 15.1 Bhp శక్తిని ఉత్పత్తి మరియు 6,500rpm వద్ద 13.9Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని పవర్ అవుట్‌పుట్ దాని సమీప పోటీదారు అయిన అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కంటే దాదాపు 4.3 Bhp ఎక్కువ.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

ఆప్రిలియా స్కూటర్ దాని సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, SOHC, 3 వాల్వ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉండి గరిష్టంగా 10.7 Bhp శక్తిని మరియు 11.6 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ Yamaha R15 బైక్ నుండి గ్రహించిన ఇంజన్‌ని ఉపయోగిస్తున్నప్పటికీ, అదనపు సౌలభ్యం కోసం ఇది CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

ఫీచర్లు:

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లో సింగిల్ ఛానల్ ఏబిఎస్, 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెడల్పాటి 140 మిమీ రియర్ టైర్, బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్, 5.8 ఇంచ్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌లైట్లు, ఎల్ఈడి టెయిల్‌లైట్లు మరియు బాహ్య ఇంధన మూత వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో 24.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీ సామర్థ్యం కూడా ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

దీనిని పోల్చి చూస్తే, యమహా సిగ్నస్ ఆల్ఫా స్కూటర్ 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. అయితే, పెద్ద సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 స్కూటర్ మాత్రం 21.5 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ను కలిగి ఉంటుంది. కొత్త Yamaha Aerox 155 స్కూటర్ లో మెయింటినెన్స్ రిమైండర్స్, చివరిగా పార్క్ చేసిన ప్రదేశం, ఇంధన వినియోగం, మెకానికల్ నోటిఫికేషన్స్ మరియు స్టార్ట్ అండ్ స్టాప్ ఫంక్షన్ వంటి ఇథర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్ ద్వారా మరిన్ని ఫీచర్లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

కాంపిటీషన్:

యమహా ఏరోక్స్ 155 స్కూటర్ ఈ విభాగంలో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 స్కూటర్ కి పోటీగా నిలుస్తుంది. ఈ రెండు స్కూటర్‌లు మ్యాక్సీ-స్కూటర్‌లుగా వర్గీకరించబడినప్పటికీ, పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే Yamaha Aerox 155 ఈ రేసులో ముందంజలో ఉంటుంది.

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు..

ధర:

కొత్త యమహా ఏరోక్స్ 155 స్కూటర్ ధర విషయానికి వస్తే, ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ. 1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా, Yamaha YZF-R15 V4.0 స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ ధర రూ. 1.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha aerox 155 maxi scooter top five things know about it design engine price and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X