భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అన్నట్లుగా ఉంది. ఈ విభాగంలో ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా వంటి పాత బ్రాండ్లతో పాటుగా ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్, రివోల్ట్ మరియు సింపుల్ ఎనర్జీ వంటి కొత్త సంస్థలతో పాటు అనేక ఇతర బ్రాండ్లు కూడా ఉన్నాయి. వీటికి తోడుగా పెట్రోల్ టూవీలర్లను విక్రయించే బజాజ్ ఆటో (చేతక్ ఈవీ), టీవీఎస్ (ఐ-క్యూబ్) వంటి బ్రాండ్లు కూడా కనీసం ఒక ఎలక్ట్రిక్ మోడల్‌నైనా విక్రయిస్తున్నాయి.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

తాజాగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ రేస్‌లో పాల్గొనేందుకు యమహా (Yamaha) కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. యమహా ఇటీవల నిర్వహించిన డీలర్ల సమావేశంలో తమ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రదర్శించింది. యమహా ఈ01 (Yamaha E01) మరియు యమహా నియో (Yamaha Neo) ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఆవిష్కరించింది. యమహా త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించడం ద్వారా యమహా కూడా EV విభాగంలోకి అడుగుపెట్టింది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

యమహా ఈ01 (Yamaha E01) కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ 125 సిసి పెట్రోల్ పవర్డ్ స్కూటర్‌కు సమానమైన ఎలక్ట్రిక్ స్కూటర్. కంపెనీ ముందుగా దీనిని భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, యమహా మోటార్‌సైకిల్స్ ఇప్పటికే ఈ01 కోసం ట్రేడ్‌మార్క్‌ ను కూడా దాఖలు చేసింది. యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌ ను కంపెనీ తొలిసారిగా 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

ఈ01 ఒక మాక్సీ-స్టైల్ స్కూటర్, దీని ఫ్రంట్ ఫాసియా (ముందు వైపు నుండి చూస్తే) చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్ హెడ్‌లైట్లు, కాంపాక్ట్ విండ్‌స్క్రీన్ మరియు వెడల్పాటి మరియు సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇది చాలా స్పోర్టీ ప్రొఫైల్‌ ను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ స్కూటర్ సింగిల్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందించే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ సిమ్ కార్డ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పూర్తి-డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు కీలెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఆల్-ఎల్ఈడి లైటింగ్, రివర్స్ డ్రైవ్ ఫంక్షన్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ లో ఎకో, నార్మల్ మరియు పవర్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఉంటాయి. పెర్ఫార్మెన్స్ (పవర్) మోడ్‌లో ఇది బ్యాటరీ పూర్తి ఛార్జ్ పై గరిష్ట పరిధి 70-80 కి.మీ రేంజ్ ను అందిస్తుందని చెప్పబడింది. యూరోపియన్ నిబంధనల ప్రకారం, E01 ఎలక్ట్రిక్ స్కూటర్ 11 కిలోవాట్ (15హెచ్‌పి) పవర్ అవుట్‌పుట్ ‌ను అందించే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

ఇక యమహా నియో (Yamaha Neo) ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, కంపెనీ దీనిని 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడిన E02 కాన్సెప్ట్‌ ను ఆధారంగా చేసుకొని తయారు చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే యూరోప్ మార్కెట్లో 3,005 (సుమారు రూ. 2.52 లక్షలు) యూరోల ప్రారంభ ధరతో విడుదల చేయబడింది. ఈ ఏడాది మే నెలలో ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

యమహా నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 50.4V మరియు 19.2Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్ బరువు కేవలం 8 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 2.5 kW (3.4PS) శక్తిని మరియు 136 న్యూటన్ మీటర్ల టార్క్‌ను (స్టాండర్డ్ మోడ్‌లో) అందించే బిల్ట్-ఇన్ బ్రష్‌లెస్ డిసి హబ్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌ను దాదాపు 50 సిసికి సమానమైన స్కూటర్ తో పోల్చవచ్చు. ఇది సింగిల్ బ్యాటరీ ప్యాక్‌పై సుమారు 38.5 కి.మీ మరియు డ్యూయల్ బ్యాటరీపై 68 కి.మీ చార్జ్‌ను అందిస్తుంది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్మార్ట్ కీ ఇంటిగ్రేషన్, ఎల్‌ఈడీ లైటింగ్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్ మరియు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌, పూర్తి-డిజిటల్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు 27-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న యమహా, కొత్త ఈవీల ఆవిష్కరణ

ఇదిలా ఉంటే, యమహాతో పాటు హోండా మరియు సుజుకి టూవీలర్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. హోండా తమ యాక్టివా-ఆధారిత ఇ-స్కూటర్‌ను పరిచయం చేయనుండగా, సుజుకి తమ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఆధారంగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేయనుంది. ఆటోమొబైల్స్‌ కి సంబంధించి తెలుగులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 14:53 [IST]
English summary
Yamaha electric scooters shows at dealers meet expected launch soon details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+