Just In
- 6 hrs ago
దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
- 13 hrs ago
మొత్తానికి 125సీసీ కమ్యూటర్ సెగ్మెంట్లో బజాజ్ నుండి ఓ కొత్త బైక్ రాబోతోంది.. అదేంటంటే..?
- 18 hrs ago
జర్మన్ బ్రాండ్ కారు కొన్న 'సూర్యకుమార్ యాదవ్': ధర రూ. 2.15 కోట్లు
- 1 day ago
"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే
Don't Miss
- Movies
Film Critic Kaushik LM కన్నుమూత.. గుండెపోటుతో ఆకస్మిక మృతి
- News
ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
- Sports
Ricky Ponting : ఒకప్పటి ఆస్ట్రేలియా యోధులతో రికీ పాంటింగ్ ఫోటో.. వార్నర్, పంత్ కామెంట్లు
- Lifestyle
గుండె జబ్బులకు కారణమేమిటో తెలుసా?
- Finance
Bank FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు ఇవే.. వీటిలో పెట్టుబడి పెట్టండి..
- Technology
ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
2022 యమహా మోటోజిపి ఎడిషన్స్ (Yamaha MotoGP Edition) విడుదల.. వేరియంట్లు మరియు ధరలు
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని ఎంపిక చేసిన మోడళ్లలో కొత్త 2022 మోటోజిపి ఎడిషన్లను విడుదల చేసింది. గతేడాది యమహా విడుదల చేసిన మోన్స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్ (2021 Yamaha Monster Energy MotoGP Edition) మోడళ్లు మార్కెట్లో మంచి విజయం సాధించడంతో కంపెనీ ఇప్పుడు తమ లైనప్ లో Aerox మరియు RayZR స్కూటర్‌లతో పాటు R15M మరియు MT15 మోటార్‌సైకిళ్లలో మొత్తం నాలుగు మోటోజిపి ఎడిషన్లను విడుదల చేసింది.

యమహా మోటోజిపి ఎడిషన్ ధరలు:
పైన చెప్పినట్లుగా యమహా ఆర్15ఎమ్, ఎమ్‌టి-15 వెర్షన్ 2.0, రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మరియు ఏరోక్స్ 155 మోడళ్లలో కంపెనీ ఈ కొత్త 2022 వెర్షన్ మోటోజిపి మోడళ్లను విడుదల చేసింది. వీటిలో ఏరోక్స్ 155 మ్యాక్సీ స్కూటర్ మినహా ఇతర వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడి చేసింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* యమహా ఆర్15ఎమ్ మోటోజిపి ఎడిషన్ - రూ.1.90 లక్షలు
* యమహా ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 మోటోజిపి ఎడిషన్ - రూ.1.65 లక్షలు
* యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మోటోజిపి ఎడిషన్ - రూ.87 వేలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

యమహా మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్ వేరియంట్లు స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ ని కలిగి ఉంటాయి. వీటిలో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ మరియు టెక్నికల్ అప్‌గ్రేడ్స్ ఉండవు. ఈ యమహా మోటోజిపి ఎడిషన్ లైనప్, కంపెనీ యొక్క ప్రతిష్టాత్మక రేసింగ్ జట్టు అయిన టీమ్ బ్లూ యొక్క రేసింగ్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేయబడుతాయి. కాబట్టి, ఇవి చూడటానికి ట్రాక్ పై నడిపే రేసింగ్ టూవీలర్ల మాదిరిగా కనిపిస్తాయి.

గతేడాది యమహా మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్లలో భాగంగా కంపెనీ ఎఫ్‌జెడ్ (FZ) సిరీస్ మోటార్‌సైకిళ్లను కూడా విక్రయించింది. అయితే, ఈసారి FZ రేంజ్ మోటోజిపి ఎడిషన్ లను 2022 అప్‌డేట్‌తో ప్రారంభించబడలేదు. గతంలో విక్రయించిన అన్ని మోటోజిపి ఎడిషన్‌ల మాదిరిగానే, ఇప్పుడు ఈ విభాగంలో కొత్తగా ప్రవేశించిన మోడళ్లు కూడా మోటోజిపి రేసులలో ఉపయోగించే ట్రాక్ బైక్‌ల నుండి ప్రేరణ పొందిన ప్రత్యేక లివరీని కలిగి ఉంటాయి.

ఈ నాలుగు మోటోజిపి-ప్రేరేపిత మోడల్‌లు కూడా మోటోజిపి రేసులలో యమహా రేస్ బైక్‌లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న మాన్‌స్టర్ ఎనర్జీ బ్రాండింగ్‌ను బాడీ ప్యానెల్‌లపై కలిగి ఉంటాయి. వీటిలో ఈ మోన్‌స్టర్ ఎనర్జీ ఫంకీ లుకింగ్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కాకుండా, మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండవు. అన్ని మోటోజిపి ద్విచక్ర వాహనాలు వాటి సంబంధిత స్టాండర్డ్ మోడల్‌ల మాదిరిగానే ఉంటాయి. ఇవన్నీ వాటి సంబంధిత స్టాండర్డ్ మోడల్‌లోని టాప్-స్పెక్ ట్రిమ్‌గా ఉండే అండర్‌పిన్నింగ్‌లు, పవర్‌ట్రెయిన్‌లు మరియు ఎక్విప్‌మెంట్‌లను కలిగి ఉంటాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, యమహా ఆర్15ఎమ్, యమహా ఎమ్‌టి15 వి2.0 మరియు యమహా ఏరోక్స్ 155 ఈ మూడు మోడళ్లు కూడా ఒకే రకమైన 155సీసీ ఇంజన్ ను కలిగి ఉంటాయి. అయితే, ఈ ఇంజన్ ను ఆయా టూవీలర్ల బాడీ స్టైల్ మరియు క్యారెక్టర్ కు తగినట్లుగా ట్యూన్ చేయబడి ఉంటాయి. వీటిలో R15M ఫుల్లీ ఫెయిర్డ్ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కాగా, MT15 V2.0 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది. అయితే, Aerox 155 మాత్రం పెద్ద మ్యాక్సీ స్టైల్ స్కూటర్ గా ఉంటుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, యమహా విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి మోడళ్లన్నీ కూడా పరిమితం కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, వీటిలో ఒక్కో మోడల్‌కు ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. స్టాండర్డ్ మోడల్‌ల కంటే అదనపు ప్రీమియం మరియు ఎక్స్‌క్లూజివిటీ కోరుకునే వారి కోసం కంపెనీ వీటిని పరిమితం సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది.

యమహా యొక్క మోటోజిపి లైనప్ లో అత్యంత సరసమైన మోడల్ యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్. అప్‌డేట్ చేయబడిన RayZR స్కూటర్ ఇప్పుడు స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌తో కూడిన హైబ్రిడ్ అసిస్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ వలన స్కూటర్ నిశ్శబ్దంగా స్టార్ట్ చేసుకోవచ్చు మరియు ఇది ఉత్తమ మైలేజ్ ను అందించడం కోసం ఆటోమేటిక్ స్టాప్ / స్టార్ట్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ అప్‌డేటెడ్ స్కూటర్ ఇప్పుడు సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్‌ని స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా పొందుతుంది.

ఇక యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ విషయానికి వస్తే, ఆర్15 మోటార్‌సైకిల్ లో ఉపయోగించే అదే 155 సిసి లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, సింగిల్-సిలిండర్, వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA) ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 14.8 బిహెచ్‌పి పవర్ ను మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది మరియు బెల్ట్ డ్రైవ్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు నడుపుతుంది.