యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ యమహా (Yamaha) ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న వాహన తయారు సంస్థ. కంపెనీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. ఇందులో ఒకటి 'యమహా నియో' (Yamaha Neo) కాగా మరొకటి 'యమహా ఈ01' (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్. వీటి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్స్ స్కూటర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది, కావున కంపెనీ వీటికి త్వరలోనే పరిచయం చేయనుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లు కానున్నాయి. కావున ఇవి ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా నియో (Yamaha Neo):

యమహా విడుదల చేయనున్న కొత్త 'యమహా నియో' (Yamaha Neo) కంపెనీ యొక్క మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్, కానుంది. యమహా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పేరుతో 50సీసీ స్కూటర్‌ను విక్రయిస్తోంది. ఇది 2019 టోక్యో మోటార్ షోలో బ్రాండ్ ద్వారా ప్రదర్శించబడిన E02 కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించబడింది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా ఇప్పటికే 50సీసీ పెట్రోల్‌తో నడిచే నియో స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయిస్తోంది. త్వరలో రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అతిపెద్ద హైలైట్ బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఇది రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. అంతే కాకూండా ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది, ఇది 2kW రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా యొక్క నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లో అడుగుపెడుతుంది ఆశిస్తున్నాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే కంపెనీ వెల్లడిస్తుంది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్:

యమహా కంపెనీ విడుదల చేయనున్న రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, ధీ కూడా ప్రస్తుతం ఉత్పత్తి స్థాయిలో ఉంది. ఇది 125సిసి పెట్రోల్ స్కూటర్‌తో సమానంగా ఉన్న మరింత శక్తివంతమైన స్కూటర్. ఇది ఈ01 కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది E02 కాన్సెప్ట్ వలె అదే ఈవెంట్‌లో ప్రదర్శించబడింది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

ఇప్పటికే కొన్ని జపాన్ మీడియా సంస్థలు ఈ స్కూటర్ యొక్క ఫీచర్లను ఇప్పటికే వెల్లడించాయి. ఈ01 ఎకో, నార్మల్ మరియు పవర్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లతో వస్తుంది. ఇది బ్యాటరీ స్టేటస్, స్పీడ్ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని పంచుకునే ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను పొందుతుంది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

అంతే కాకూండా ఇందులో కీలెస్ ఇగ్నిషన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా ఈ స్కూటర్‌లో ఇవ్వవచ్చు. ఈ01 ఇ-స్కూటర్‌ను యూరప్‌లోని నగరాల్లో రైడ్-షేరింగ్ వెహికల్ గా విడుదల చేసే అవకాశం ఉంటుంది. యమహా ఈ స్కూటర్‌ని విడుదల చేయడానికి ముందు టెస్టింగ్ చేస్తుంది. ప్రతి వాహనానికి ఈ టెస్టింగ్ అనేది చాలా అవసరం.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

యమహా ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్ ఐరోపాలో అరంగేట్రం చేసినందున, లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెగ్యులేటరీ క్లాస్ ప్రకారం దీని పవర్ 11kW వద్ద పరిమితం చేయబడే అవకాశం ఉంది. కంపెనీ ఇటీవల తన ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసినందున ఈ01ని భారత మార్కెట్‌కు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

ఇదిలా ఉండగా యమహా భారతదేశంలో షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్ షేర్డ్/రెంటల్ ప్లాట్‌ఫారమ్‌లో వాహనాల వినియోగాన్ని పెంచడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం అని యమహా మోటార్ ఒక ప్రకటనలో తెలిపింది. షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అనేది వినియోగదారులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద యమహా కంపెనీ త్వరలో మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తుంది.

యమహా నుంచి రానున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్.. Neo & E01

ఇప్పటికే మార్కెట్లో యమహా యొక్క ప్రత్యర్థి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యమహా కంపెనీ కూడా మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున యమహా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో విడుదల కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు.

Article Published On: Monday, March 7, 2022, 11:07 [IST]
English summary
Yamaha neo e01 prototype model unveiled launch soon details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+