యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీదారుగా విజయవంతంగా స్థిరపడింది. హీరో మోటోకార్ప్, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీల మాదిరిగా యమహా తమ ప్రోడక్ట్ లైనప్ లో ఎలాంటి బడ్జెట్ కమ్యూటర్ బైక్‌ లను అందించడం లేదు. ప్రస్తుతం, యమహా ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మోటార్‌సైకిళ్లు FZ సిరీస్ నుండి ప్రారంభం అవుతాయి. మార్కెట్లో దీని ధర రూ. 1.12 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి స్టార్ట్ అవుతుంది. అయితే, కంపెనీ తమ YZF సిరీస్ మోటార్‌సైకిళ్లలో ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ బైక్‌ను అందిస్తోంది మరియు భారతదేశంలో ఇవి మంచి ఆదరణ కూడా పొందాయి.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

యమహా భారతదేశంలో YZF సిరీస్ లో రెండు మోడళ్లను విక్రయిస్తోంది - వీటిలో YZF R15 V3 మరియు YZF R15 V4 మోడళ్లు ఉన్నాయి. కాగా, ఈ ఇందులోని యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వి3లో కంపెనీ ఇటీవలే కొత్త మ్యాట్ బ్లాక్ పెయింట్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త పెయింట్ స్కీమ్‌లో, ఈ బైక్ మునుపటి కంటే మరింత ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో బైక్ ఫెండర్లు, ఇంజన్, మడ్‌గార్డ్, ఇంధన ట్యాంక్ మరియు అల్లాయ్ వీల్స్ మ్యాట్ బ్లాక్ పెయింట్‌ స్కీమ్ ను పొందుతాయి. కొత్త పెయింట్ జాబ్ మినహా ఈ బైక్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వి3 (Yamaha YZF R15 V3) డెల్టాబాక్స్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. ఈ 155 సిసి సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 18.1 బిహెచ్‌పి పవర్ మరియు 14 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. కొత్త కలర్ స్కీమ్ ప్రారంభించడంతో, కంపెనీ ఈ బైక్ ధరలను కూడా సవరించింది. ఇప్పుడు కొత్త యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వి3 ధర రూ. 1,60,900 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మునుపటి ధరతో పోలిస్తే దీని ధర సుమారు రూ.1,000 పెరిగింది.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

కొత్త యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వి3 విషయానికి వస్తే, దీని డిజైన్ పాత ఆర్15 వి2 మోడల్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ బైక్ లో డ్యూయల్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ తొలగించబడింది మరియు దాని స్థానంలో ఎల్ఈడి డ్యూయల్ పాడ్ క్లస్టర్ అమర్చబడింది. ఈ హెడ్‌ల్యాంప్‌ల మధ్యలో డిజైన్ స్పేస్ ఖాలీగా ఉంచబడింది. కొత్త ఆర్15 వి3 షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫెయిరింగ్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు పొడవైన విండ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

స్పోర్టియర్ స్టైలింగ్ డిజైన్ ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆర్15 వి3 సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్‌ను అందిస్తుందని, ఇది రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ స్ట్రీట్ మరియు ట్రాక్ అనే రెండు డిస్‌ప్లే మోడ్‌లతో కూడిన LCD డిస్‌ప్లే యూనిట్‌ను పొందుతుంది. కొత్త యమహా ఆర్15 వి3లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వై-కనెక్ట్ సిస్టమ్ ఇవ్వబడింది. ఇది కాల్ మరియు మెసేజ్ అలెర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్, ఇంజన్ ఆర్‌పిఎమ్, నోటిఫికేషన్స్, పార్కింగ్ రికార్డ్, బైక్ లొకేషన్, రైడ్ హిస్టరీ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

కొత్త యమహా ఆర్15 వి3 భారతదేశంలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను పొందిన మొదటి 155 సీసీ బైక్ గా రికార్డు సృష్టించింది. ఈ బైక్ లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు సర్దుబాటు చేయగల మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్, ఇరు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు రెండు చక్రాలపై డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేసే డిస్క్ బ్రేకులు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కాగా, ఈ లైనప్ లో ప్రీమియం వెర్షన్ అయిన యమహా ఆర్15 వి4 (Yamaha R15 V4) వెనుక వైపు మోనో-షాక్‌ మరియు ముందువైపు ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3 స్టైలిష్ గా కనిపించడమే కాకుండా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్‌తో సైడ్ స్టాండ్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్ మరియు సూపర్ వైడ్ 140/70-R17 రేడియల్ టైర్‌లు ఉన్నాయి. ఈ కొత్త యమహా బైక్ మునుపటి మోడల్స్ మాదిరిగా కాకుండా, స్ప్లిట్ సీట్ ను కాకుండా సింగిల్ పీస్ సీట్ ను కలిగి ఉంటుంది. కావున రైడర్ మరియు పిలియన్ కి రైడర్ కి మంచి సౌకర్యంగా ఉంటుంది.

యమహా ఆర్15 వి3 లో కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్.. ధర, ఫీచర్లు మరియు వివరాలు!

భారతదేశంలో పూర్తిగా అమ్ముడైపోయిన యమహా ఆర్15 మోటోజిపి ఎడిషన్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) భారత మార్కెట్లో అందిస్తున్న యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 (Yamaha YZF-R15 V4) మోటార్‌సైకిల్ లో కంపెనీ ఈ ఏడాది మాన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి (Monster Energy MotoGP) ఎడిషన్ విడుదల చేసింది. మార్కెట్లో ఈ ప్రత్యేకమైన మోటార్‌సైకిల్ ధర రూ. 1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండేది. కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ యమహా ఆర్15ఎమ్ (Yamaha YZF-R15M) వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్ ను తయారు చేశారు. అయితే, ఇప్పుడు ఇది దేశీయ మార్కెట్లో పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Friday, July 8, 2022, 14:53 [IST]
English summary
Yamaha r15 v3 gets new matte black colour option price features details
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+