కొత్త కలర్స్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Yezdi Roadster.. వివరాలు
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు ద్విచక్ర వాహన విభాగాన్ని తిరుగులేకుండా పాలించిన యెజ్డీ (Yezdi) కంపెనీ యొక్క బైకులు రానురాను తక్కువ డిమాండ్ పొందటంలో కొన్ని సంవత్సరాల పాటు వెనుకబడిపోయాయి. అయితే ఈ బైకులు 2022 ప్రారంభంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి.
Recommended Video
కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో యెజ్డీ రోడ్‌స్టర్, యెజ్డీ స్క్రాంబ్లర్ మరియు అడ్వెంచర్ అనే మూడు బైకులను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి ఇప్పుడు తన 'రోడ్‌స్టర్' మరో రెండు కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

కంపెనీ ఇప్పుడు తన యెజ్డీ రోడ్‌స్టర్ బైకును 'ఇన్ ఫెర్నో రెడ్' మరియు 'గ్లేసియల్ వైట్' అనే రెండు కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. ఈ రెండు కలర్స్ లోనూ గ్లోస్ ఫినిష్ చూడవచ్చు. అంతే కాకుండా సైడ్ కేసింగ్ లతో పాటు మోటార్ సైకిల్ మీద చాలా చోట్ల బ్లాక్ ఫినిషింగ్ చూడవచ్చు. కంపెనీ ప్రారంభించిన ఈ రెండు కలర్స్ యొక్క కాంబినేషన్ కు "ఫైర్ & ఐస్" అని పేరుపెట్టింది.

కంపెనీ మొదట్లో యెజ్డీ రోడ్‌స్టర్ బైకును స్మోక్ గ్రే, స్టీల్ బ్లూ, హంటర్ గ్రీన్, గాలంట్ గ్రే మరియు సిన్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు 'ఇన్ ఫెర్నో రెడ్' మరియు 'గ్లేసియల్ వైట్' కలర్స్ తో కలిపి మొత్తమ్ 7 కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు విడుదల చేసిన ఈ కొత్త కలర్ బైక్స్ ధర రూ. 2,01,142 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

యెజ్డీ కంపెనీ తన రోడ్‌స్టర్ లో రెండు కొత్త కలర్ ఆప్సన్స్ తీసుకురావడపైన కంపెనీ సీఈఓ 'ఆశిష్ సింగ్ జోషి' మాట్లాడుతూ.. ఇప్పుడు ఈ రెండు కొత్త కలర్ ఆప్సన్స్ మరింత ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉందని, ఇది తప్పకుండా రైడర్ల అనుభూతికి దగ్గరగా ఉంటుందని ఆయన అన్నారు.

కంపెనీ ఇప్పుడు ఈ కొత్త కలర్ ఆప్సన్స్ లో తీసుకురావడం తప్పా, డిజైన్ మరియు ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. కావున యెజ్డీ రోడ్‌స్టర్ 334 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

ఈ బైక్ మంచి డిజైన్ కలిగి ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఇందులోని హ్యాండిల్‌బార్ కూడా పైకి ఉంటుంది, కావున రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ ముందు ఫోర్క్ పైన అమర్చబడి ఉంటుంది. అయితే కీహోల్ అనేది మోటార్ సైకిల్ యొక్క కుడి వైపున ఉంటుంది.

రోడ్‌స్టర్ 12.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. అదే సమయంలో ట్యాంక్‌పైన Yezdi బ్యాడ్జింగ్‌ను పొందుతారు. ఇది హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి కొన్ని ఆప్సనల్ ఫీచర్‌లను కూడా పొందుతుంది. ఈ బైక్ సింగిల్-పీస్ సీటు కలిగి ఉంటుంది, అంతే కాకుండా ఇది బ్యాక్‌రెస్ట్‌తో కలిపి సౌకర్యవంతంగా మరియు సపోర్టివ్‌గా కనిపిస్తుంది.

యెజ్డీ రోడ్‌స్టర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది స్టైలిష్‌గా కనిపించే రౌండ్ LCD యూనిట్, ఇది బైక్ గురించి చాలా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో ట్రిప్ మీటర్లు, డిస్టెన్స్-టు-ఎంప్టీ రీడౌట్, గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ మొదలైనవి ఉంటాయి.

ఈ కొత్త బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందువైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుక 240 మిమీ డిస్క్ బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఒకప్పుడు దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన యెజ్డీ రోడ్‌స్టర్ ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం పొందటానికి సిద్ధంగా ఉంది. దీనికోసం కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తగిన ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. ఈ కొత్త కలర్ రోడ్‌స్టర్ బైకులు మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతాయి అనేది తెలియరావాలి.


Click it and Unblock the Notifications








