అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

యెజ్డీ మోటార్‌సైకిల్స్ ఇటీవల కాలంలోనే అడ్వెంచర్, స్క్రాంబ్లర్ మరియు రోడ్‌స్టర్ అనే మూడు ఆధునిక బైకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే కంపెనీ ఎట్టకేలకు ఈ కొత్త బైకుల యొక్క డెలివరీలను కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ మూడు రెట్రో-థీమ్ మోటార్‌సైకిళ్లు పాత-కాలపు యెజ్డీ మోటార్‌సైకిల్ డిజైన్‌ను ఆధునిక ఫీచర్లు మరియు స్టైలింగ్‌ పొందుతాయి. ఒక్క సరిగా భారత మార్కెట్లో ఈ మూడు మోటార్ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రధాన కారణం, మార్కెట్లోని వివిధ కస్టమర్లను ఆకర్శించడమే.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

కంపెనీ నివేదికల ప్రకారం ఈ బైకుల యొక్క డెలివరీలు నిన్నటి (ఆదివారం) రోజు నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ మూడు బైకులు కూడా చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇందులో 'యెజ్డీ అడ్వెంచర్' సాధారణ రోడ్లపై కూడా నడపగలిగే సుదూర ఆఫ్‌రోడింగ్ రైడ్‌లను అనుభవించాలనుకునే రైడర్‌ల కోసం ఉద్దేశించిన అడ్వెంచర్ టూరర్. 'యెజ్డీ స్క్రాంబ్లర్' హార్డ్‌కోర్ ఆఫ్‌రోడింగ్ కోసం ఉద్దేశించబడింది, అదే విధంగా 'యెజ్డీ రోడ్‌స్టర్' బైక్ సౌకర్యవంతమైన సుదూర ప్రయాణం కోసం ఉద్దేశించబడింది.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

మహీంద్రా & మహీంద్రా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న ఈ కంపెనీ దాదాపు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టడం జరిగింది. క్లాసిక్ లెజెండ్స్ భారతదేశంలో జావా బైక్‌లను తయారు చేసే అదే కంపెనీ. భారతదేశంలోని జావా షోరూమ్‌ల ద్వారా కొత్త Yezdi మోటార్‌సైకిళ్లు విక్రయించబడుతున్నాయి.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

ఈ మూడు బైకులు చూడటానికి కొంత భిన్నంగా ఉన్నప్పటికీ, మూడు బైక్‌లు ఒకే ప్లాట్‌ఫారమ్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతాయి. Yezdi మోటార్‌సైకిళ్లు 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ DOHC ఇంజన్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కానీ పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్‌లు మూడు బైకులలోనూ చాలా భిన్నంగా ఉంటాయి.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

ఇందులో యెజ్డీ అడ్వెంచర్ 30 బిహెచ్‌పి పవర్ మరియు 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగా, యెజ్డీ స్క్రాంబ్లర్ 29.1 బిహెచ్‌పి పవర్ మరియు 28.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మూడవ బైక్ యెజ్డీ రోడ్‌స్టర్ విషయానికి వస్తే, ఇది 29.7 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Yezdi Scrambler ఆధునిక డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఈ బైక్ లో స్పీడో మీటర్ అనేది ఫ్రంట్ ఫోర్క్ పైన ఉంటుంది. ఇది బైక్ గురించిన చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది, కావున రైడింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

యెజ్డీ అడ్వెంచర్ విషయానికి వస్తే, , ఇది పూర్తిగా ఆఫ్-రోడ్ రైడింగ్ మరియు టూరింగ్‌కు అంకితమైన బైక్. ఈ కొత్త బైక్ యొక్క కుడివైపు రైడర్ ఎర్గోనామిక్స్, లార్జ్ స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి టర్న్-సిగ్నల్ ఇండికేటర్, ఫుట్‌పెగ్‌లు, USB A-టైప్ మరియు C-టైప్ ఛార్జింగ్ స్లాట్‌లు వంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా సరైన దృశ్య మానతను అందించడానికి టిల్ట్ ఫంక్షన్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీని స్టాండర్డ్‌గా కలిగి ఉంది, ఇది సెకండరీ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

Yezdi రోడ్‌స్టర్‌ విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు హాలోజన్ బల్బులు ఉన్నాయి. ఈ బైక్‌లో రౌండ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది స్పీడ్, గేర్, ఫ్యూయెల్, ఆర్‌పిఎమ్, టర్న్ ఇండికేటర్ వంటి సమాచారాలను అందిస్తుంది. Yezdi రోడ్‌స్టర్‌లో బ్యాక్ రెస్ట్‌తో సింగిల్ పీస్ సీటు కూడా లభిస్తుంది, ఇది పిలియన్ రైడర్ సౌకర్యాన్ని మరింత పెంచుతుంది. ఇది స్టాండర్డ్‌గా డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో డ్యూయల్ ఛానెల్ ABSని పొందుతుంది. మొత్తానికి ఈ మూడు బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో అద్భుతంగా ఉన్నాయి.

అప్పుడే ప్రారంభమైన Yezdi బైక్ డెలివరీలు.. మీరూ బుక్ చేసుకోండి

దేశీయ మార్కెట్లో ఈ మూడు బైకులు ఖచ్చితంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాము. అంతే కాకుండా ఇటీవల మేము ఈ యెజ్డీ అడ్వెంచర్, స్క్రాంబ్లర్ మరియు రోడ్‌స్టర్ ల యొక్క ఫస్ట్ లుక్ రివ్వూ కూడా చేసాము. ఈ బైక్స్ కి సంబంధించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #యెజ్డి #yezdi
English summary
Yezdi roadster adventure scrambler delivery starts details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X