భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

చైనాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ జోంటెస్ (Zontes) భారతదేశంలో తమ సరికొత్త టూవీలర్లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ కు చెందిన ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Adishwar Auto Ride India Pvt Ltd) తో కలిసి జోంటెస్ తమ టూవీలర్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లలో జోంటెస్ 350R, 350X, GK350, 350T, మరియు 350T ADV మోటార్‌సైకిళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ. 3.15 లక్షల నుండి రూ. 3.67 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ విడుదల చేసిన మోటార్‌సైకిళ్లన్నీ కూడా చాలా స్టైలిష్‌గా మరియు విలాసవంతంగా ఉన్నాయి. అయితే, 350సీసీ సెగ్మెంట్లో వచ్చిన ఈ మోడళ్లన్నీ కూడా, భారత మార్కెట్లో లభిస్తున్న ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే, స్వల్పంగా అధిక ధరను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఐదు మోటార్‌సైకిళ్లు కూడా వివిధ కలర్ ఆప్షన్లతో లభిస్తాయి. కంపెనీ ఇప్పటికే ఈ మోటార్‌సైకిళ్ల యొక్క స్పెసిఫికేషన్‌లను వెల్లడించగా, తాజాగా ఇప్పుడు వాటి ధరల వివరాలను వెల్లడించింది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా భారతదేశంలో జోంటెస్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు మరియు అమ్మకాల తర్వాత సేవలకు బాధ్యత వహిస్తుంది. భారతదేశంలోని ఏకైక మల్టీ-బ్రాండ్ సూపర్ బైక్ ఫ్రాంచైజీ అయిన మోటోవాల్ట్ (MotoVault) ద్వారా జోంటెస్ మోటార్‌సైకిళ్లు విక్రయించబడతాయి. జోంటెస్ బ్రాండ్‌కి చెందిన ఈ ఐదు మోటార్‌సైకిళ్ల ధరలు, స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి:

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350ఆర్ (Zontes 350R)

జోంటెస్ 350ఆర్ ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న స్ట్రీట్ లేదా నేక్డ్ మోటార్‌సైకిల్ మాదిరిగా కనిపిస్తుంది. షార్ప్ హెడ్‌ల్యాంప్, షార్ప్ బాడీ ప్యానెళ్లతో ఇది మంచి మజిక్యులర్ లుక్‌ని కలిగి ఉంటుంది. జోంటెస్ 350ఆర్ బ్లూ, బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే రంగును బట్టి ధరలు మారుతూ ఉంటాయి. బ్లూ షేడ్ ధర రూ. 3,15,000 కాగా, మిగిలిన రెండు కలర్ ఆప్షన్‌ల ధరలు రూ. 3.25 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350ఎక్స్ (Zontes 350X)

జోంటెస్ 350ఎక్స్ చూడటానికి ఓ మంచి స్పోర్ట్స్ టూరర్ బైక్ లా కనిపిస్తుంది. ఫుల్లీ ఫెయిరింగ్ డిజైన్‌ మరియు వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లో ఇది చూడటానికి కెటిఎమ్ బైక్ లను పోలినట్లుగా ఉంటుంది. ఇది చాలా వరకూ యూరోపియన్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, పొడవైన విండ్‌స్క్రీన్ డిజైన్‌తో మంచి అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350ఎక్స్ మూడు విభిన్న డ్యూయెల్-టోన్ కలర్లలో లభిస్తుంది. బ్లాక్ & గోల్డ్ షేడ్ ధర రూ. 3.35 లక్షలు కాగా, సిల్వర్ & ఆరెంజ్ మరియు బ్లాక్ & గ్రీన్ ఆప్షన్‌ల ధర రూ. 3.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ జికె350 (Zontes GK350)

భారత మార్కెట్లో విడుదల చేసిన ఐదు మోటార్‌సైకిళ్లలో జోంటెస్ జికె350 చాలా విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇదొక ఓల్డ్-స్కూల్ నియో-రెట్రో మోటార్‌సైకిల్. చూడటానికి ఇది కేఫ్-రేసర్ మాదిరిగా కనిపిస్తుంది. ముందువైపు గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌, మజిక్యులర్ ప్యూయెల్ ట్యాంక్, వెనుక వైపు ఎత్తుగా ఉండే డిజైన్, ఎత్తు తక్కువగా ఉండే రైడర్ సీట్, ఎక్స్‌పోజ్డ్ ఇంజన్ అండ్ చైన్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ జికె350 కూడా డ్యూయెల్ షేడ్స్ లో లభిస్తుంది. ఇందులో బ్లాక్ & బ్లూ కలర్ ఆప్షన్ ధర రూ. 3.37 లక్షలు కాగా వైట్ & ఆరెంజ్ మరియు బ్లాక్ & గోల్డ్ ఆప్షన్స్ ధర రూ. 3.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350టి అడ్వెంచర్ (Zontes 350T ADV)

జోంటెస్ 350టి అడ్వెంచర్ ప్రత్యేకించి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ టూరింగ్ కోసం డిజైన్ చేయబడిన మోటార్‌సైకిల్. అంతేకాదు, ఇది జోంటెస్ బ్రాండ్ నుండి ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ కూడా. జోంటెస్ 350టి మాదిరిగానే ఈ అడ్వెంచర్ మోడల్ కూడా ముందు వైపు ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్‌ను కూడా పొందుతుంది. దూర ప్రయాణాలకు ఈ ఫీచర్ చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350టి మాదిరిగానే ఈ అడ్వెంచర్ ఎడిషన్ కూడా కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటిలో ఆరెంజ్ షేడ్ ధర రూ. 3.57 లక్షలు కాగా షాంపైన్ కలర్ ఆప్షన్ ధర రూ. 3.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350టి (Zontes 350T)

జోంటెస్ 350టి అనేది రోడ్-బయాస్డ్ టూరర్, ఇది చూడటానికి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఇది ఎక్కువగా రహదారి ఆధారిత వినియోగానికి ఉపయోగించబడుతుంది. ఇందులో ముందు వైపు ఉన్న పెద్ద విండ్‌స్క్రీన్‌ను రైడర్ తన అవసరానికి తగినట్లుగా ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. నిజానికి, ఇదొక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోంటెస్ 350టి కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీటిలో ఆరెంజ్ షేడ్ ధర రూ. 3.37 లక్షలు కాగా షాంపైన్ కలర్ ఆప్షన్ ధర రూ. 3.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

జోన్‌టెస్ 350 రేంజ్ ఇంజన్ స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లు

జోంటెస్ భారతదేశంలో విడుదల చేసిన ఈ ఐదు మోటార్‌సైకిళ్లు విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఉపయోగించిన ఇంజన్, పరికరాలు మరియు ఫీచర్లు దాదాపు ఒకేలా ఉంటాయి. వీటిలో 348సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 38 బిహెచ్‌పి శక్తిని మరియు 7,200 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్ తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన మేడ్ ఇన్ చైనా బైక్స్.. జోంటెస్ బైక్స్‌ని ఇండియాకు తెచ్చిన ఆదీశ్వర్ ఆటో...

ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్ లలో టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంటేషన్, నాలుగు రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, ముందు వైపు 43 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్ సెటప్, పెద్ద ఇంధన ట్యాంక్, సీటు మరియు హెడ్‌లాక్‌లను ఎలక్ట్రికల్‌గా ఓపెన్ చేయడం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎల్ఈడి లైటింగ్ మరియు డ్యూయల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎస్‌యూబి స్లాట్‌లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Zontes launches five motorcycles in india price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X