బైక్ లవర్స్ మనసు దోచుకుంటున్న ఈ వింటేజ్‌ బైక్‌ల చరిత్ర తెలుసా.. ఇప్పటికీ అదే జోరు.!!

అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఎన్ని అధునాతన బైక్‌లు వచ్చినా.. వింటేజ్‌ బైక్‌లకి ఇప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే తరాలు మారుతున్నా పురాతన కాలం నాటి అధునాతనంగా మార్పులు చెందుతూ బైక్‌ లవర్స్‌ మనసు దోచుకుంటున్నాయి. కాగా అసలు ఈ వింటేజ్‌ బైక్‌లు ఎప్పుడు స్టార్ట్‌ అయ్యాయో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా వందేళ్ల క్రితం నుంచే కస్టమర్లకు టూ వీలర్లు సేవలందిస్తున్నాయి. ప్రపంచ యుద్ధాల సమయంలోనూ వీటిదే కీలక పాత్ర. మరి ఆ బైక్‌లేంటి.. వాటిని ప్రవేశపెట్టిన సంస్థలేంటి.. ఎక్కడి నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టాయి.. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి మరి..

Harley-Davidson

హార్లే డేవిడ్‌సన్: ప్రముఖ వింటేజ్‌ మోటార్‌ సైకిల్‌ తయారీదారు హార్లే డేవిడ్‌సన్‌(Harley Davidson).. అమెరికాకు చెందిన కంపెనీ.. దీనిని 1903లో తొలిసారిగా అమెరికాలో ప్రవేశపెట్టారు. హార్లే డేవిడ్ సన్‌ మోటార్ సైకిల్ తయారీ కంపెనీని ఇద్దరు స్నేహితులు కలిసి ప్రారంభించారు. విలియం S. హార్లే, ఆర్థర్ డేవిడ్సన్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు. వారిద్దరి పేర్లనే ఈ కంపెనీకి నామకరణం చేశారు. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

హార్లే డేవిడ్‌సన్‌ ప్రీమియం బ్రాండ్‌ కావడంతో ఈ కంపెనీకి చెందిన బైక్‌లన్నీ చాలా ఖరీదైనవి. ఈ బైక్‌లు దాదాపు ఎంట్రీ లెవెల్‌ కార్ల ధరలతో సమానంగా ఉంటాయి. ఈ ఏడాదితో ఈ సంస్థను ప్రారంభించి 120 ఏళ్లు పూర్తి అవుతుంది. కంపెనీ ఉత్పత్తి చేసిన మొదటి ఇంజిన్‌ 7.07 కాగా, అమ్మకంలో ఉన్నది మాత్రం 24.74 మాత్రం సీసీ బైక్‌. దీనిని మోడల్‌ 1 అని పిలుస్తారు.

Husqvarna

హస్క్‌వర్నా(Husqvarna): హార్లే డేవిడ్‌సన్ మాదిరిగానే అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న మరో సంస్థ హస్క్‌వర్నా.. మొదట్లో ఇది కంపెనీ మస్కెట్ రకం పిస్టల్స్ తయారీదారుగా తన కార్యకలాపాలు ప్రారంభించగా.. తర్వాత మోటార్‌ సైకిల్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది.

హస్క్‌వర్నా మోటార్‌ సైకిల్‌ తయారీని 1903 లో ప్రారంభించింది. ప్రారంభంలో బైక్‌ల కోసం ఇంజిన్లను దిగుమతి చేసుకున్న సంస్థ.. తర్వాత సొంతంగా ఇంజిన్లను ఉత్పత్తి చేసుకుంది. ప్రీమియం బ్రాండ్లుగా ప్రసిద్ధి చెందిన Husqvarna బైక్‌లకు భారత మార్కెట్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. వీటి ధర కూడా ఎక్కువే..

Triumph-Motorcycles

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్: ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్‌(Triumph Motorcycles) 1902 లోనే మార్కెట్లోకి అడుగుపెట్టింది. అంటే ఇది హార్లే-డేవిడ్‌సన్, హుస్క్‌వర్నా బ్రాండ్‌ల కంటే ముందుగానే ప్రారంభమైంది. కాగా ఇది బ్రిటిష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌. అయితే 1889 లోనే బైక్‌ల తయారీని ప్రారంభించినా 1902 లో మొదటి బైక్‌ విడుదలైంది. ఇందులో బెల్జియన్‌ మినర్వా ఇంజిన్‌ను ఉపయోగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రీమియం, సూపర్‌ బైక్‌లను ట్రయంఫ్‌ తయారేచేస్తోంది.

Royal-Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield): వింటేజ్‌ బైక్‌ సంస్థల్లో మరో ప్రముఖ బ్రాండ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీ తన మొదటి బైక్‌ను 1901 లో ఉత్పత్తి చేసింది. కాగా రెండో ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను ఎక్కువగా ఉపయోగించారు. ఇది యూకే కంపెనీగా అడుగుపెట్టినా.. 1960 లో భారత్‌ బ్రాండ్‌గా మారింది. కాగా ఇది ప్రస్తుతం ఐసర్‌ బ్రాండ్‌ యాజమాన్యంలో ఉంది.

Indian-Motorcycle

ఇండియన్ మోటార్‌సైకిల్స్: ప్రపంచంలోనే మొట్టమొదటి పురాతన మోటార్‌సైకిల్‌ తయారీదారు ఇండియన్‌ మోటార్‌సైకిల్స్‌(Indian Motorcycles). దీనిని 1901 లో ప్రారంభించారు. చైన్‌ డ్రైవ్‌ను ఉత్పత్తి చేసిన మొదటి సంస్థ ఇదే. ఈ సంస్థకు చెందిన బైక్‌ అప్పట్లో అత్యంత వేగం అంటే.. గంటకు 90 కి.మీ వేగంతో దూసుకెళ్లేది. ఇది అమెరికన్‌ బ్రాండ్‌ కాగా.. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 30, 2023, 9:36 [IST]
English summary
100 plus years old vintage bike manufacturing companies list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+