Hero Xpulse 200 4v 2023 అదిరిపోయే ఫీచర్లతో కొత్త హీరో Xpulse.. ధర ఎంతంటే.!

2023 Hero Xpulse 200 4v : హీరో మోటో కార్ప్‌(Hero moto corp) అదిరిపోయే ఫీచర్లతో హీరో Xpulse బైక్‌ను దేశీయ మార్కెట్లోకి బుధవారం లాంచ్ చేసింది. సరికొత్తగా ఈ బైక్‌ 200 4v తో పాటు ప్రో వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది. రెండో దశ బీఎస్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ అడ్వెంచర్‌ బైక్‌ను హీరో మోటో కార్ప్‌ ప్రవేశపెట్టింది. మరి ఈ హీరో ఎక్స్‌పల్స్‌ అందిస్తున్న ఫీచర్లు ఏంటో చూద్దాం..

హీరో మోటో కార్ప్‌ ఈ అడ్వెంచర్ Hero Xpulse 200 4v బైక్‌లో బీఎస్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్‌ను అప్‌డేట్ చేసింది. హీరో ఎక్స్‌పల్స్‌ 200 4వీ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ బైక్(ఎక్స్‌ షోరూమ్‌) రూ.1.43 లక్షల్లో అందుబాటులో ఉండగా ప్రో వేరియంట్ బైక్(ఎక్స్‌ షోరూమ్‌) రూ.1.50 లక్షలు పలుకుతోంది. లాంగ్ విండ్‌స్క్రీన్, కొత్త ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, రైడింగ్ మోడ్‌లను ప్రవేశపెట్టింది.

Hero Xpulse 200 4v 2023

ప్రో వేరియంట్‌ : హీరో ఎక్స్‌ప్లస్ 2004వీ బైక్ (Hero XPulse 200 4V 2023) ప్రో వేరియంట్ పూర్తిగా 250ఎంఎం అడ్జస్టబుల్ ఫ్రంట్‌ సస్పెన్షన్, 220ఎంఎం రేర్‌ సస్పెన్షన్ ఉంటుంది. న్యూ సస్పెన్షన్‌ సెటప్‌ ద్వారా 270 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. 850 ఎంఎం సీట్ హైట్‌తోపాటు ఎక్స్‌టెండెడ్ గేర్ లివర్, హ్యాండిల్ బార్ రైజర్ ఉంటది.

హీరో మోటో కార్ప్‌ లాంగ్ విండ్‌స్క్రీన్, కొత్త ప్రొజెక్టర్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లను ఈ కొత్త మోడళ్లలో అప్‌డేట్‌ చేసింది. LED హెడ్‌ల్యాంప్‌ల కాంతి తీవ్రతను 230 శాతం పెంచుకోవచ్చు. వాహనదారులకు వీలుగా USB పోర్ట్‌ను ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌కు కింద అమర్చింది. న్యూ స్విచ్‌ గేర్‌ను ఇందులో చూడవచ్చు.

Hero Xpulse 200 4v 2023

హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్ (Hero XPulse 200 4V 2023) మూడు న్యూ ఏబీఎస్ రైడింగ్ మోడ్స్‌లో వస్తోంది. రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ మోడ్‌లలో లభిస్తుంది. డ్రై రోడ్ పైనా దూసుకెళ్లే రోడ్ మోడ్, ఆఫ్-రోడ్ మోడ్‌లో ఏబీఎస్ పవర్‌ లెవెల్‌ తక్కువగా ఉంటుంది. బైక్‌ మరింత స్లిప్‌ను అనుమతిస్తుంది. ఇసుక, రాళ్ల మధ్య, కొండ ప్రాంతాల్లో సజావుగా ఈ బైక్‌ వెళ్లగలుగుతుంది. ర్యాలీ మోడ్‌లో ఏబీఎస్ పూర్తిగా స్విచ్చ్‌డ్ ఆఫ్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది.

హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్‌లో న్యూ 60mm ట్యాలర్ ర్యాలీ-స్టైల్ వైండ్ షీల్డ్‌తో పాటు క్లాస్-డీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటుంది. దీంతోపాటు అప్‌డేటెడ్ లగేజ్ ప్లేట్, హ్యాండ్ గార్డ్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ తదితర ఫీచర్లను హీరో మోటో కార్ప్‌ అందిస్తోంది.

Hero Xpulse 200 4v 2023

హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్ 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో 200 సీసీ వన్-వాల్వ్ ఆయిల్-కూల్డ్ బీఎస్-6 4వీ ఇంజిన్ ట్యూన్‌డ్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8000 ఆర్పీఎం వద్ద 18.8 బీహెచ్పీ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 17.35 ఎన్ఎం గరిష్ఠ టార్చిని ఉత్పత్తి చేస్తుంది.

ఆకర్షణీయమైన కలర్స్‌లో : హీరో ఎక్స్‌ప్లస్ 200 4వీ బైక్ (Hero XPulse 200 4V 2023 Edition) బోల్డ్ గ్రాఫిక్స్, డ్యుయల్ టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ మ్యాటె నెక్సస్ బ్లూ, టెక్నో బ్లూ, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. మరి 'ప్రో' వేరియంట్ విషయానికొస్తే ఈ మోడల్‌ ప్రో వైట్ కలర్ ఆప్షన్‌లోనే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 18, 2023, 14:55 [IST]
English summary
2023 hero xpulse 200 4v and pro variant launched in india with price details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+