హోండా CB200X 2023 బైక్ వచ్చేసింది.. పదేళ్ల వారంటీ, ధర రూ. 1.47 లక్షలు
పండుగల సీజన్ మొదలవుతుండటంతో దేశీయ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీలు అమ్మకాల వేగాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ కార్లపై ఆఫర్లను ప్రకటించడంతో పాటు కొత్త వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. ICE, EV రంగాల్లో ఇప్పటికే పలు ఆటో మేకర్లు చాలా మోడళ్లను ప్రవేశపెట్టాయి.
ఈ నేపథ్యంలో దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(HMSI), మార్కెట్లో అప్‌డేటెడ్ 2023 హోండా CB200X మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కొత్తగా విడుదలైన హోండా CB200X BS6ను ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు.

హోండా CB200X బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌ను అప్‌డేటెడ్ పవర్‌ట్రెయిన్‌తో పాటు 3 షేడ్స్‌లో హోండా మోటార్స్ అందిస్తోంది. డీసెంట్ బ్లూ మెటాలిక్, పర్ల్ నైట్‌స్టార్ బ్లాక్ మరియు స్పోర్ట్స్ రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ బైక్‌ను విడుదల చేసింది. ఈ మూడు కలర్ ఆప్షన్లలో, డీసెంట్ బ్లూ మెటాలిక్.. జపనీస్ టూ-వీలర్ దిగ్గజం నుండి సరికొత్త ఆఫర్.
ఇక కొత్త హోండా CB200X పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే 184.04cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 17.03 bhp మరియు 6,000 rpm వద్ద 15.9Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని హోండా మోటార్స్ ప్రకటించింది.

కొత్త 2023 హోండా CB200X మోటార్‌సైకిల్‌లోని ట్రాన్స్‌మిషన్ 5-స్పీడ్ యూనిట్‌గా కొనసాగుతున్నప్పటికీ, స్పీడ్‌గా గేర్‌లను మార్చేటప్పుడు వీల్ లాకింగ్‌ను నిరోధించడానికి అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్‌ని కలిగి ఉంది. కొత్త 2023 హోండా CB200X మోటార్‌సైకిల్‌ను 10 సంవత్సరాల వారంటీ (7 సంవత్సరాల ఆప్షనల్ వారంటీ)తో అందిస్తోంది. స్టాండర్డ్ వారంటీ 3 సంవత్సరాల ప్రోగ్రామ్‌గా కొనసాగుతుంది.
ఇక ఈ బైక్‌లో హార్డ్‌వేర్ బిట్‌లను పరిశీలిస్తే, కొత్త 2023 హోండా CB200X ముందు భాగంలో USD ఫోర్క్‌లు, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది. అలాగే, మోడల్ ముందు మరియు వెనుక వరుసగా 276 mm మరియు 220 mm పెటల్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.

2023 హోండా CB200X బైక్‌లో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5 స్థాయిల సర్దుబాటు చేయగల బ్రైట్‌నెస్‌తో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్ LED లైటింగ్ టెక్నాలజీ, అల్లాయ్ వీల్స్, సింగిల్ ఛానల్ ABS, ట్విన్ ట్రిప్ మీటర్లు, బ్యాటరీ వోల్ట్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఒక క్లాక్‌ను కలిగి ఉంది.
కొత్త CB200X లాంచ్‌పై HMSI మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & CEO సుట్సుము ఒటాని మాట్లాడారు. హోండా యొక్క లెజెండరీ CB లెగసీ నుంచి ప్రేరణ పొందిన 2023 CB200Xని ప్రారంభించడం ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అన్నారు. 2021లో CB200X ను ప్రారంభించినప్పటి నుంచి కస్టమర్లలో మంచి ఆదరణ అందుకుందని పేర్కొన్నారు. రోజువారీ ప్రయాణాలకు, వారాంతపు విహారయాత్రలు మంచి రైడ్ అనుభూతిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








