యమహా నుంచి మూడు చక్రాల బైక్.. అదిరిపోయే ఫీచర్స్!!
ప్రముఖ బైక్ తాయరీసంస్థ యమహా మూడు చక్రాలు కల్గిన సరికొత్త బైక్ ను రిలీజ్ చేసింది. జపాన్ మార్కెట్ లో ప్రస్తుతం ఈ అధునాతన బైక్ అందుబాటులో ఉంది. ఇది భారత్ మార్కెట్ లోకి రావాలంటే వెయిట్ చేయాల్సిందే. సరికొత్త డిజైన్ ఆకర్షించే లుక్ ఈ బైక్ ని కంపెనీ డిజైన్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
బైక్ మోడల్స్ లను ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చేందుకు యమహా కంపెనీ ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఈ సారి సరికొత్తగా మూడు చక్రాల వాహనాన్ని తీసుకువచ్చి వినియోగదారుల్ని ఆశ్చర్యపరచింది. ముందు రెండు చక్రాలు వెనక ఒక చక్రాన్ని అమర్చి క్రేజీ లుక్ లో బైక్ ని పరిచయం చేసింది. దాదాపు స్పోర్ట్స్ బైక్ ని పోలినట్లు ఉండే ఈ న్యూ లుక్ బైక్ చూపరులను ఆకట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

రెండు సీసీలలో అందుబాటులోకి..
ఆసియా మార్కెట్ లో మంచి పట్టు ఉన్న యమహా ప్రస్తుతానికి ఈ బైక్ ని జపాన్ కి మాత్రమే పరిమితం చేసింది. 125సీసీ, 155సీసీ, 300సీసీలలో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది. 125, 155 సీసీలలో ఒకే మాదిరి ఇంజిన్ ని డిఫరెంట్ పవర్ లో కంపెనీ అందిస్తోంది. ఈ అధునాతన ట్రైసిటి బైక్ లో లిక్విడ్ కూల్ ఇంజన్ ని కంపెనీ పొందుపరచింది.
125 సీసీ బైక్ 12.06 BHP వద్ద 11.02 NM టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అలానే 155సీసీ బైక్ 14.8BHP వద్ద 14NM టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెండు సీసీలలోనూ R15 V4 ఇంజిన్ ని కలిగి ఉంది. దాదాపు స్పోర్ట్స్ బైక్ కి ఉండే ఫీచర్లు ట్రైసిటికి యమహా జోడించింది.

ఆకట్టుకోని డిజైన్..
ట్రైసిటి డిజైన్ ఆకట్టుకునేలా లేదని చెప్పవచ్చు. యమహా మోటార్ సైకిల్ శ్రేణులను పోలి ఉండేలా కంపెనీ దీనిని తయారు చేసింది. ముందు భాగంలోని డూమ్ తో పాటు సీటింగ్ కెపాసిటీ అంతగా ఆకర్షించేలా లేదు. రోడ్డుపై ఈ బైక్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. దీంతో రైడర్ అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. భారీ బరువు చూడటానికి పెద్దగా ఉండటం బైక్ కి కలిసిరాని అంశాలు.
ముందు భాగంలోని రెండు చక్రాలు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది. వెనక భాగంలో 13 ఇంచ్ అల్లాయ్ వీల్ ఉంది. ముందు ఉన్న చక్రాలు చాలా సులభంగా తిరిగేలా తయారు చేశారు. అన్నీ చక్రాలకు డిస్క్ బ్రేక్ లను ట్రైసిటిలో చూడవచ్చు. దీనివల్ల బైక్ ని రియల్ టైంలో నిలుపుదల చేయవచ్చు. బ్రేక్ సస్పెన్షన్ ఈ బైక్ కి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఫీచర్లు సూపర్..
డిజైన్ సంగతి పక్కన పెడితే ఫీచర్ల పరంగా బైక్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ముందు భాగంలో అతిపెద్ద LED లైట్ ని ఈ బైక్ కి అమర్చారు. సీట్ ఇన్ సైడ్ లో ఛార్జింగ్ సెట్, లగేజ్ పొందుపర్చేందుకు ఎక్కువ స్థలాన్ని కల్పించింది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటితో పాటు కీలెస్ ఆపరేషన్ ని ఈ బైక్ లో పొందవచ్చు. ఇంకా ఎన్నో అధునాతన టెక్నాలజీని యమహా ఈ ట్రైసిటీలో అందిస్తోంది. ట్రైసిటీ 125సీసీ బైక్ ధర మన కరెన్సీలో సుమారు రూ. 3.1 లక్షలు, 155 సీసీ ధర సుమారు రూ.3.54 లక్షలు ఉండే అవకాశం ఉంది.
2014లోనే యమహా ట్రిసిటి బైక్ ని విడుదల చేసింది. కానీ ఈ విభాగంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని ఆ సంస్థ అందుకోలేక పోయింది. 2019లో మరోసారి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆసియా, యూరప్ మార్కెట్ లలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. 2023లో తీసుకువచ్చిన ఈ సరికొత్త మోడల్ అయిన మార్కెట్ లో ఏ మేరకు నిలదొక్కుకుంటుందో లేక ముందు చూసిన పరాభవాన్ని చవిచూడాల్సి వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.


Click it and Unblock the Notifications








