2023 లో విడుదలైన సూపర్ బైక్‌లు ఇవే.. డిజైన్, ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే..
భారత్‌లో ఆటో రంగంలో ఈ ఏడాది ద్విచక్ర వాహన తయారీ సంస్థలు దూకుడు మీదే ఉన్నాయని చెప్పవచ్చు. సాధారణ బైక్‌ల నుంచి కాస్ట్లీ బైక్‌లు వరకు పలు కంపెనీల బైక్‌లు ఈ ఏడాది విడుదలై సేల్స్ పరంగా మంచి వృద్ధిని సాధించాయి. కాగా ఈ ఏడాది(2023) ఇప్పటివరకు విడుదలైన టూ వీలర్ వివరాలు ఈ కథనంలో..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350): భారత మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న బైక్‌లలో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350. ఈ బైక్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 1న సంస్థ విడుదల చేసింది. రూ. 1.74 లక్షల(ఎక్స్ షోరూమ్) ధరతో ఈ బైక్ అందుబాటులో ఉంది.

కాగా బుల్లెట్ బైక్.. క్లాసిక్ 350 కంటే రూ. 19వేలు తక్కువ. ఇక హంటర్ 350 ధర బుల్లెట్‌తో పోలిస్తే సుమారు రూ. 24 వేలు ఎక్కువగా ఉంది. బుల్లెట్ 350 లో 349 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటారు గరిష్ఠంగా 20 bhp శక్తిని, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ అపాచీ RTR 310 (TVS Apache RTR 310): టీవీఎస్ సంస్థ నుంచి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బైక్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310. గత సెప్టెంబర్‌లో ఈ బైక్‌ను టీవీఎస్ మోటార్స్ లాంచ్ చేసింది. కాగా దీని ప్రారంభ ధర రూ. 2.42 లక్షలు(ఎక్స్ షోరూమ్).

టీవీఎస్ అపాచీ RTR 310 బైక్‌లో 312.12 సీసీ ఇంజిన్‌ని ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 35.08 bhp శక్తిని మరియు 28.7 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సూపర్ బైక్ మాత్రమే కాకుండా ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించారు.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310లో క్రూయిజ్ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ ల్యాంప్, 5 అంగుళాల TFT స్క్రీన్, గో-ప్రో కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్ట్, స్మార్ట్ హెల్మెట్ డివైస్ కనెక్టివిటీ మరియు నావిగేషన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

అప్రిలియా RS 457(Aprilia RS 457): భారత మార్కెట్లో బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్ అప్రిలియా RS 457. డిసెంబర్ 8 న ఈ బైక్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 4.10 లక్షలు(ఎక్స్ షోరూమ్).
అప్రిలియా RS 457.. Aprilla కంపెనీ నుంచి అత్యుత్తమ cc కెపాసిటీ బైక్ మోడల్‌లలో ఒకటి. ఈ బైక్ 457 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 47 బిహెచ్‌పి పవర్ మరియు 44 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది. కాగా ఈ బైక్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు. వచ్చే ఏడాది మార్చిలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

హోండా CB300R(Honda CB300R): ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా ఈ ఏడాది పలు బైక్‌లను లాంచ్ చేసింది. వాటిలో మొదటిది CB300R.. ఈ బైక్‌ను గత అక్టోబర్‌లో సంస్థ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 2.40 లక్షలు(ఎక్స్-షోరూమ్).
హోండా షైన్ 100 (Honda Shine 100): హోండా సంస్థ నుంచి షైన్ 100 మరో గొప్ప లాంచ్. ఈ జాబితాలో ఇది అత్యంత సరసమైన బైక్ మోడల్. రూ. 65,012 ధరతో దీనిని విడుదల చేసింది. ఈ బైక్‌లో 98.98 సీసీ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 7.28 bhp మరియు 8.05 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కాకుండా, హీరో సూపర్ స్ప్లెండర్ XTEC (Hero Super Splendor XTEC) ధర రూ. 85,149, రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 (Royal Enfield Super Meteor 650) ధర రూ. 3.60 లక్షలు, Triumph Tiger 900 బైక్ రూ. 13.95 లక్షల ధరతో భారత మార్కెట్లో విడుదలయ్యాయి.
ఇంకా ఈ ఏడాది 2023లో భారత మార్కెట్లో హీరో కరిజ్మా XMR 210 (Hero Karizma XMR 210) - ధర రూ. 1.79 లక్షలు, బజాజ్ పల్సర్ NS200 (Bajaj Pulsar NS200) రూ. ఈ ఏడాది భారత్‌లో 1.42 లక్షలతో ధరతో విడుదల అయ్యాయి.


Click it and Unblock the Notifications








