కొత్త KTM 390 Duke బైక్ విడుదల.. సరికొత్త పవర్ ట్రెయిన్, ఆకర్షణీయమైన డిజైన్
దేశీయ మార్కెట్లో KTM సరికొత్త డ్యూక్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్‌ను సరికొత్త పవర్ ట్రెయిన్ సిస్టమ్‌తో సంస్థ ప్రవేశపెట్టింది. ఇంకా దాని ఓల్డ్ వెర్షన్‌తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు చేసింది. ఇక ధర, డిజైన్, ఫీచర్లు, పూర్తి వివరాలు ఈ కథనంలో..
కేటీఎం 390 డ్యూక్ మోటార్‌సైకిల్ కొత్త వెర్షన్‌ను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియన్ తయారీదారు కేటీఎం 2013 మోడల్ 390 ను తిరిగి ప్రవేశపెట్టినప్పటికీ ఈ బైక్ అతిపెద్ద అప్‌డేట్‌ను కలిగి ఉంది. డిజైన్ మరియు పవర్‌ట్రెయిన్ కాకుండా ఇతర అప్‌డేట్‌లలో కొత్త ఛాసిస్ మరియు సబ్-ఫ్రేమ్ కూడా ఉన్నాయి.

ఇందులో పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్త 2024 KTM 390 డ్యూక్ మోటార్ సైకిల్ పాత 373 cc, సింగిల్ సిలిండర్, DOHC, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను తొలగించి, పెద్ద 399 cc, సింగిల్-సిలిండర్, DOHC, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త 399 cc ఇంజిన్ 64 mm వద్ద పొడవైన స్ట్రోక్‌ను కలిగి ఉంటుంది. అయితే, బోర్ దాని ముందున్న 89 మిమీతో సమానంగా ఉంటుంది. దాని లాంగ్ స్ట్రోక్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఇంజిన్ ప్రత్యేకత ఏంటంటే తక్కువ rpm వద్ద ఎక్కువ శక్తిని ఇంకా గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2024 KTM 390 డ్యూక్‌లోని కొత్త 399cc ఇంజిన్ 8,500 rpm వద్ద 45.37 bhp మరియు 6,500 rpm వద్ద 39 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఓల్డ్ వెర్షన్ 390 డ్యూక్ బైక్.. 9000 rpm వద్ద 42.9 bhp మరియు 7,000 rpm వద్ద 37 Nm టార్క్ ఉత్పత్తి చేసింది.
ఇక ఈ కొత్త కేటీఎం 390 బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఇదిప్రీ లోడ్ సర్దుబాటుతో పాటు రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా సస్పెన్షన్ సెటప్‌ను చక్కగా ట్యూన్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంకా ఇందులో ఫ్రంట్ ఎండ్ USD ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. అయితే వెనుక భాగంలో మోనో సస్పెన్షన్ కలిగి ఉంది.

డిజైన్ విషయానికి వస్తే, కొత్త KTM 390 డ్యూక్ మోటార్‌సైకిల్ దాని పెద్ద ట్యాంక్ ష్రౌడ్స్‌తో ఆకర్షణీయంగా ఉంది. దాని పైన, రేర్ భాగం ఫాక్స్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ఇంకా ఇది బల్కీనెస్‌కు మరింత సపోర్ట్ ఇస్తుంది. ఇలా సరికొత్త అప్‌డేట్లతో ఈ బైక్‌ను ఆకర్షణీయంగా తయారు చేశారు.
కొత్త KTM 390 డ్యూక్ బైక్‌ను విడుదల చేయడంతో, KTM సంస్థ తన మోటార్‌సైకిల్ పనితీరును మరింత విస్తరించాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇంకా ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది కస్టమర్లను తన బ్రాండ్‌కు ఆకర్షించాలని చూస్తోంది. సరికొత్తగా వస్తున్న ఈ బైక్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఆశాభావంతో ఉంది.

చివరగా కొత్త కేటీఎం 390 బైక్ ధర ఎక్స్ షో రూమ్ వద్ద రూ. 3.11 లక్షల్లో అందుబాటులో ఉంది. ఈ బైక్ అద్భుతమైన పనితీరు మరియు హార్డ్‌వేర్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా దాని ధరకు న్యాయం చేస్తుంది. అంతేకాకుండా, అప్‌డేటెడ్ పవర్‌ట్రెయిన్ తక్కువ వేగంతో మోటార్‌సైకిల్‌ను మరింత ట్రాక్టబుల్‌గా మార్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








