KTM 390 Duke 2024 Full Review Video సరికొత్త లుక్‌తో కేటీఎం 390 డ్యూక్‌ ఫుల్‌ రివ్యూ వీడియో

యూత్‌ ఫేవరెట్‌ KTM తన 390 డ్యూక్ బైక్‌ను అప్‌డేట్ చేసి దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా అనేక కొత్త ఫీచర్లతో ఆకర్షణీయమైన కొత్త లుక్‌లో కేటీఎం 390 డ్యూక్‌ బైక్‌ను కంపెనీ రూపొందించింది. ఈ బైక్‌ను థర్డ్ జనరేషన్ మోటార్‌సైకిల్‌గా సంస్థ పరిచయం చేయగా.. త్వరలో బైక్‌ ప్రియులకు అందుబాటులోకి రానుంది.

కొత్త KTM 390 డ్యూక్‌ బైక్‌ను పరిశీలించడానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఆహ్వానం లభించింది. దీంతో మా బృందం నేరుగా ఈ బైక్‌ను టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళింది. ఈ బైక్‌ను నడపడంతో పాటు రైడింగ్‌ అనుభవాన్ని వీడియోలో పంచుకుంది. ఈ బైక్‌ ఫీచర్లు, డిజైన్‌, పర్ఫామెన్స్‌ పూర్తి వివరాలను వీడియోలో చూడవచ్చు.

KTM 390 డ్యూక్ 399 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 45.4 HP వద్ద 39 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ బై డైరెక్షనల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఇంజిన్‌ను చల్లబరచడానికి డ్యూయల్ ఫ్యాన్ రేడియేటర్‌ను ఇందులో అమర్చారు.

2024-KTM-390-Duke

థర్డ్‌ జెన్‌ KTM 390 బైక్‌లో అనేక ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చారు. అధునాతనంగా ఫ్యూయెల్‌ ట్యాంక్‌, హెడ్‌లైట్‌పై అదనపు ప్లాస్టిక్ ప్యానెల్‌లు, 183mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కొత్త ఎగ్జాస్ట్ ప్రధాన ఫీచర్లుహా ఉన్నాయి. ఇంకా ఈ బైక్ బరువు 168 కిలోలు. అదేవిధంగా ఈ బైక్‌లో 15 లీటర్ పెట్రోల్ ట్యాంక్, వెనుక మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, September 17, 2023, 15:33 [IST]
English summary
2024 ktm 390 duke engine features performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+