ABZO VS01 ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల.. 180 కి.మీ రేంజ్‌..!

భారత్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా అనేక వాహన తయారీ సంస్థలు కస్టమర్ల ప్రాధాన్యత, అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ABZO మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ను విడుదల చేసింది. ABZO VS01 పేరుతో మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ రెట్రో థీమ్‌ క్రూయిజర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందు, వెనుక LED ల్యాంప్‌లు ఉంటాయి. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తుంది. ఈ బైక్‌ మూడు రైడింగ్‌ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, నార్మల్‌, స్పోర్ట్స్‌ మోడ్‌లతో లభిస్తుంది. ఎకో మోడ్‌లో 45 kmph, అదే నార్మల్‌ మోడ్‌లో 65 kmph, స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 kmph వేగాన్ని అందుకుంటుంది.

ABZO VS01 Electric bike

ABZO VS01 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌, వెనుకవైపు డ్యూయల్‌ షాక్‌ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బైక్‌ ముందు, వెనుక చక్రాలకు డిస్క్‌ బ్రేకులు కలిగి ఉన్నాయి. దీంతోపాటు కాంబి బ్రేకింగ్‌ సిస్టమ్‌ (CBS) ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ రివర్స్‌ మోడ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుందని ABZO సంస్థ వెల్లడించింది.

ఈ మోటార్‌ సైకిల్‌ కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది. ఈ బైక్‌ ధర రూ.1.8 లక్షల నుంచి రూ.2.22 లక్షల మధ్య ఉంది. ఈ బైక్‌ 72V 70Ah లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 180 కి.మీ మైలేజ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ బైక్‌ 8.44 bhp శక్తి, 190Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌ బ్యాటరీని సాధారణ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జింగ్‌ చేసేందుకు 6.35 గంటల సమయం పడుతుందని తెలిపింది. అయితే ఈ బైక్‌ మాత్రం ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 3.20 గంటల్లో ఛార్జింగ్‌ చేయవచ్చని వెల్లడించింది.

ABZO VS01 ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ ఇంపీరియల్‌ రెడ్‌, మౌంటైన్‌ వైట్‌, జార్జియన్‌ బే, బ్లాక్‌ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌ రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీతో వస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ 1473mm వీల్‌బేస్‌, 158mm గ్రౌండ్ క్లియరెన్స్‌, 700mm సీట్‌ ఎత్తును కలిగి ఉంది. దాంతోపాటు 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో ట్యూబ్‌లెస్‌ టైర్లను కలిగి ఉంది.

ABZO మోటార్స్‌ సంస్థ తొలి ఏడాదిలో 9000 యూనిట్లు, రెండో సంవత్సరంలో 15,000, మూడో సంవత్సరంలో 24,000, నాలుగో సంవత్సరంలో 40,000 యూనిట్లు, ఐదో సంవత్సరంలో 60,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తయారీ ప్లాంట్‌ను విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా లక్ష్యాలు నిర్దేశించుకుంది.

ABZO VS01 బైక్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు కంచి పటేల్‌ వెల్లడించారు. సంస్థ నుంచి మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గుజరాత్‌లో సంస్థ ఉనికిని మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. బైక్‌లు సహా మరిన్ని రకాల ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, September 11, 2023, 16:10 [IST]
English summary
Abzo motors launched electric bike at rs1 8 lakh starting price in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+