టెక్‌ దిగ్గజం Acer నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌.. తక్కువ ధర, రెండు బ్యాటరీలు సహా అద్భుతమైన ఫీచర్లు!!

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఈవీలను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల డిమాండ్‌, అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఈవీలను విడుదల చేస్తున్నాయి. ఓలా, టీవీఎస్‌, ఏథర్‌, బజాజ్‌ సంస్థలు ఈ రేస్‌లో ముందంజలో ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్ల తయారీతో ప్రముఖ సంస్థగా ఉన్న తైవాన్‌కు చెందిన Acer (ఏసర్‌) ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. భారత్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ Acer MUVI 125 4G ను విడుదల చేసింది. హైదరాబాద్‌ వేదికగా ఈ లాంచ్‌ కార్యక్రమం నిర్వహించింది. భారతీయ ఎలక్ట్రిక్‌ మొబిలిటి ఫ్లాట్‌ఫాం eBikeGo భాగస్వామ్యంతో ఈ ఈవీని తయారుచేసింది.

Acer MUVI 125 4G

ఏసర్‌ MUVI 125 4G ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధర రూ.1,00,000 (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. దీంతోపాటు ఆసక్తిగల సంస్థల నుంచి డీలర్‌షిప్‌ కోసం సంప్రదించాలని ఏసర్‌ కోరింది. ముందస్తు బుకింగ్‌లు త్వరలో ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఈ సంవత్సరం గ్రేటర్‌ నోయిడాలోని EV ఇండియా ఎక్స్‌పో 2023లో తొలిసారిగా ఏసర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రదర్శించారు.

ఈ స్కూటర్‌ 48V, 35.2Ah సామర్థ్యం గల రెండు స్వాపబుల్‌ బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీలను ఒకసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 80 కి.మీ రేంజ్‌ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ స్కూటర్‌ గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది. బ్యాటరీలను నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చు. ఈ ఈవీ రెండు బ్యాటరీలను కలిగి ఉంటుంది. అయితే రైడర్‌ ఒకే బ్యాటరీని కూడా వినియోగించుకోవచ్చు.

Acer MUVI 125 4G Electric scooter launched

ఏసర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గ్రే, తెలుపు, నలుపు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మరియు తేలికైన ఛాసిస్‌తో వస్తుంది. 16 అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన షాక్‌ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు హైడ్రాలిక్‌ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది.

ఏసర్ MUVI 125 4G ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన 4 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ లేదా iOS ఫోన్‌ను ఉపయోగించి కనెక్ట్‌ చేసుకోవచ్చు. మరియు మూడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఏసర్‌ నుంచి వచ్చిన తొలి ఈవీ కాబట్టి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Acer MUVI 125 4G Electric scooter launched in india

ఏసర్‌ MUVI 125 4G ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పట్టణ ప్రయాణానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. మరియు తేలికైన, ధృడమైన ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. రైడర్‌కు మైరుగైన డ్రైవింగ్‌ అనుభవాన్ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. అయితే ఎప్పటి నుంచి ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయో వెల్లడికాలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, October 16, 2023, 14:27 [IST]
English summary
Acer enters in electric scooter market with muvi 125 4g
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+