మాధవన్ సూపర్ బైక్స్ కలెక్షన్.. ఒక్కో బైక్‌ను చూస్తుంటే మతి పోవాల్సిందే..

బైక్స్ అంటే యువతకు చాలా క్రేజ్. ఇక సెలబ్రిటీలు వాడే బైక్స్ అంటే చెప్పనవసరం లేదు. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తన బైక్స్ కోసం ఒక గ్యారేజ్‌నే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక సినీ నటుడు ఆర్. మాధవన్ సూపర్ బైక్స్ మీరెెప్పుడైనా చూశారా..

2000 సంవత్సరం ఆరంభంలో చాక్లెట్ బాయ్‌గా ప్రేక్షకులను ఆర్ మాధవన్ విపరీతంగా ఆకట్టుకున్నారు. దేశంలో సినీ రంగంలో మాధవన్ గురించి తెలియని వారుండరు. 80', 90'లలో పుట్టిన వారికి మాధవన్ అంటే విపరీతమైన క్రేజ్.. ఇప్పటికీ మాధవన్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే మాధవన్‌కు కూడా బైక్స్ అంటే మహా క్రేజ్..

Madhavan-Superbikes

అయితే ఇటీవల మాధవన్ టూ వీలర్ కలెక్షన్‌లకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సినిమా ఫోటోగ్రాఫర్ అరవింద్ కమలనాథన్ ఈ వీడియోను చిత్రీకరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నటుడు మాధవన్ తన వద్ద ఉన్న ప్రతి సూపర్‌బైక్‌ను తన గ్యారేజీ నుండి డ్రైవింగ్ చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. దీని ప్రకారం నటుడు మాధవన్ వెల్లడించిన సూపర్ బైక్‌ల గురించి ఇక్కడ ఈ కథనంలో మీ కోసం అందిస్తున్నాం.

ఇండియన్ రోడ్‌మాస్టర్: ఇండియన్ రోడ్ మాస్టర్ అనేది పేరుకు మాత్రమే.. అయితే ఇది అమెరికన్ స్టైల్ క్రూయిజర్ బైక్. మాధవన్ దగ్గర ఓల్డ్ మోడల్ రోడ్‌మాస్టర్ బైక్ ఉంది. అంటే ఆయన చాలా సంవత్సరాల క్రితమే ఈ బైక్ కొనుగోలు చేసి ఉండాలి. ఈ బైక్‌లో 1811సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను విడుదల చేస్తుంది.

Madhavan-Superbikes

యమహా వి మ్యాక్స్: యమహా వి మ్యాక్స్, క్రూయిజర్ మోటార్‌సైకిల్, యమహా 1985 నుంచి 2020 వరకు ఉత్పత్తి చేసింది. యమహా వీ మ్యాక్స్ బైక్‌ను నటుడు మాధవన్ ఏ సంవత్సరంలో తయారు చేశారో వెల్లడించలేదు. కానీ, వీడియోలో బైక్ తాజా లుక్‌ను చూస్తుంటే, ఈ బైక్‌ను గత 10 పదేళ్లలో కొనుగోలు చేసి ఉండొచ్చు. ఈ బైక్ 1700cc V4 ఇంజిన్ (197 bhp)తో పనిచేస్తుంది.

ట్రయంఫ్ రాకెట్ 3R: ఇది బహుశా ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ నుంచి అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్ కావచ్చు. ఎందుకంటే ఈ ట్రయంఫ్ బైక్‌లో దాదాపు 2500సీసీ ఇంజిన్‌ని అమర్చారు. క్రోమ్ ఎడిషన్‌లో ఉన్న ఈ బైక్‌ను నటుడు మాధవన్ సొంతం చేసుకున్నారు. మాధవన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ మోటార్ సైకిళ్లలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ట్రయంఫ్ రాకెట్ 3R క్రోమ్ ఎడిషన్ గత ఏడాది అక్టోబర్‌లో భారతదేశంలో విడుదల చేశారు. ఆ తర్వాత మాత్రమే మాధవన్ దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Madhavan-Superbikes

2022 హోండా గోల్డ్ వింగ్: నటుడు మాధవన్ ఇటీవల కొనుగోలు చేసిన సూపర్ బైక్ ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వీడియో కాస్త చీకటి సమయంలో చిత్రీకరించబడినప్పటికీ, ఈ బైక్ మెరిసిపోతుంది. హోండా చాలా సంవత్సరాల తర్వాత 2022లో గోల్డ్ వింగ్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలో తిరిగి విడుదల చేసింది. మాధవన్ యొక్క ఈ హోండా సూపర్ బైక్‌లో 1833cc 6-సిలిండర్ ఆటోమేటిక్ DCT పవర్‌ట్రెయిన్ ఉంది.

Madhavan-Superbikes

మాధవన్ సూపర్‌బైక్ కలెక్షన్‌లను చూస్తుంటే, మతి పోతుంది కదా.. అన్నీ లగ్జరీ బైక్‌లే అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ వీడియోను బట్టి పరిశీలిస్తే మాధవన్‌కు లో-ఎండ్ క్రూయిజర్ మోటార్‌సైకిళ్లపై ఇష్టం ఉందని స్పష్టమవుతోంది. అంటే ఎగ్రెసివ్ రైడింగ్ లేకుండా రిలాక్స్‌డ్‌గా, కంఫర్టబుల్‌గా మోటార్‌సైకిల్‌ను నడపాలనుకునే వ్యక్తులు సాధారణంగా క్రూయిజర్ బైక్‌లను ఇష్టపడతారు.

Madhavan-Superbikes

2023 కామన్వెల్త్ క్రీడలు ఇటీవల ట్రినిడాడ్ మరియు టొబాగో రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగాయి. స్విమ్మర్‌గా పాల్గొన్న మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ పోటీల ప్రారంభం రోజున భారత జాతీయ జెండాను ఎగురవేశాడు. ఆ సమయంలో నటుడు మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 'గో ఇండియా... విష్ యూ సక్సెస్' అంటూ పోస్ట్ చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, August 24, 2023, 16:41 [IST]
English summary
Actor r madhavan super bikes collection here is the video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+