Air Bag: సూపర్ ఎయిర్‌బ్యాగ్‌ బైక్.. ప్రమాదాలు పరార్..!

రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ భాగం ద్విచక్రవాహనాల వల్లే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మరణిస్తున్నవారి సంఖ్య ద్విచక్ర వాహన ప్రయాణికులే కావడం గమనార్హం. భవిష్యత్తులో వీటిని తగ్గించేందుకు, చాలా కంపెనీలు దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. ఆ సరికొత్త బైక్ వివరాలు మీకోసం..

ద్విచక్ర వాహన ప్రయాణికుల భద్రత కోసం రెండు రకాల ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేసేందుకు హోండా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ పేటెంట్ కూడా పొందింది. దీనిపై పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఒకవేళ ఈ టైప్ బైక్స్ అందుబాటులోకి వస్తే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్యూచర్ లో మరిన్నీ కంపెనీలు కూడా వీటిని తీసుకువచ్చే అవకాశం ఉంది.

హోండా ఎయిర్ బ్యాగ్

రెండు రకాల ఎయిర్ బ్యాగ్స్..

హోండా స్కూటర్లు, బైక్‌లలో ఈ ప్రయోగం చేయనుంది. వాటి డిజైన్ కి తగినట్లుగా ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేస్తోంది. దీని కోసం కంపెనీ అధునాతన అనుకరణ సాధనాలతో దాని మొదటి కాన్సెప్ట్‌ను సిద్ధం చేసి క్రాష్ టెస్ట్ ని కూడా నిర్వహించింది. త్వరలో కంపెనీ దీన్ని మరింత మెరుగైన రీతిలో అందించే అవకాశం ఉంది. త్వరిగతన వీటిని అందుబాటులోకి తెచ్చేదుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

బైక్‌ ప్రయాణికుల కోసం ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేస్తున్న హోండా సంస్థ రెండు రకాల ఎయిర్‌బ్యాగ్‌లను సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిది రైడర్ సీటు కింద ఇన్‌స్టాల్ చేయబడుతుంది. ఇది ప్రమాదం జరిగినప్పుడు బైక్ రైడర్‌ను రక్షించేలా పని చేస్తుంది. అందుకు తగినట్లుగా ప్రయోగాలను కూడా చేసింది.

మరొకటి బైక్‌ సీటు మధ్యలో రెండవ ఎయిర్‌బ్యాగ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది బైక్ రైడర్ దానిపై కూర్చున్న ప్రయాణీకుల మధ్య ఉంటుంది. ఇద్దరికీ భద్రతను అందించేలా దీనిని రూపొందించారు. దీనివల్ల ప్రమాదం జరిగనప్పుడు బైక్ పై వెళ్తున్న వారికి ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ సదుపాయం వల్ల భారీగా ప్రమాదలను తప్పించుకోవచ్చు.

హోండా

మార్కెట్ లో ఎయిర్ బ్యాగ్ బైక్..

గతేడాది విడుదల చేసిన హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్‌లో ఎయిర్‌బ్యాగ్‌ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. భారతదేశంలో, ఈ బైక్ CBU (కంప్లీట్లీ బిల్ట్-అప్) రూట్ ఆప్షన్ లో తీసుకువచ్చింది. దేశంలో ఈ బైక్ ఇదివరకే విక్రయించబడింది. ఇది కాకుండా, ఆటోమేటిక్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, LED లైటింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్‌లో అందుబాటులో ఉన్నాయి.

అలాగే, ఈ బైక్‌లో నిల్వ సామర్థ్యాన్ని 121 లీటర్లకు పెంచారు. ఇది బైక్ సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా దాదాపు అన్ని అవసరమైన ఫీచర్లతో అమర్చబడి ఉండటానికి సహాయపడుతుంది. బూట్ స్పేస్ ఎక్కువతో ఉండేలా దీనిని తీసుకువచ్చింది. ఇది కస్టమర్లను కచ్ఛితంగా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.

సరికొత్త ఫీచర్లతో..

ఈ హోండా మోటార్‌సైకిల్‌ 1833cc లిక్విడ్-కూల్డ్ 4-స్ట్రోక్ 24-వాల్వ్ SOHC ఫ్లాట్-6 ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 5,500 rpm వద్ద 124.7 bhp శక్తిని, 4,500rpm వద్ద 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. థ్రోటల్ బై వైర్ ఇంజన్ మేనేజ్‌మెంట్ ఈ బైక్‌లో ఉంది. ఈ బైక్‌లో టూర్, స్పోర్ట్, ఎకాన్, రెయిన్ వంటి నాలుగు రైడింగ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి. దీని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఆప్షన్ లను పొందుతుంది.

పియాగో కంపెనీ కూడా ద్విచక్ర వాహనాలకు ఎయిర్‌బ్యాగ్‌లను తయారు చేస్తోంది. దీని కోసం ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్‌లను అందించే ఆటోలైవ్ అనే కంపెనీతో కంపెనీ జతకట్టింది. ఇలాంటి అధునాతన బైక్స్ ని తీసుకురావడం వల్ల ప్యూచర్ లో చాలా ప్రమాదాలను నివారించవచ్చు. మరిన్నీ కంపెనీలు దీనిపై దృష్టి సారిస్తాయని ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Friday, March 17, 2023, 15:19 [IST]
English summary
Airbags will soon be available in two wheelers as well chances of injury will reduce accidents
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+