Ather 450S ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీకి సిద్ధం.. ఓలాకు గట్టి పోటీ..!
భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉంది. ఆగస్టు నెలలో సేల్స్ రిపోర్టులను చూస్తే ఇది అర్థం అవుతుంది. FAME-2 కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించిన తర్వాత జూన్, జులై నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు తగ్గినా.. ఆగస్టు నెలలో మళ్లీ పుంజుకున్నాయి.
అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కొత్త మోడల్‌లను తక్కువ ధరల్లో విడుదల చేస్తున్నాయి. ఏథర్ ఎనర్జీ సంస్థ ఇటీవల రూ.1,29,999 (ఎక్స్‌షోరూం) ధరతో Ather 450Sను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను OLA S1 ఎయిర్‌కు పోటీగా లాంచ్ చేసింది. భారత్‌లో పండుగల సీజన్‌కు ముందే డెలివరీలు చేసేందుకు సిద్ధం చేస్తోంది.

ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ సంవత్సరం జూన్‌లో విడుదల చేశారు. తమిళనాడులోని హైసూర్ ప్లాంట్ నుంచి ఈ స్కూటర్లను విడుదల చేయనున్నారు. ఫేమ్ -2 కింద సవరించిన ధరలకు అనుగుణంగా ఈ స్కూటర్ల ధరను నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. డెలివరీకి సిద్ధంగా ఉన్న స్కూటర్ల ఫోటోలను ఏథర్ సీఈవో విడుదల చేశారు.
Ather 450S ఎలక్ట్రిక్ స్కూటర్ 3kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 115 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది. గృహ విద్యుత్ కనెక్షన్‌ను ఉపయోగించి, ఈ బ్యాటరీని సుమారు 6.36 గంటల్లో 80 శాతం వరకు ఛార్జింగ్ చేయవచ్చు. మరో రెండు గంటల్లో 100 శాతం పూర్తిచేయవచ్చు. అంటే 8 గంటల 36 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు.

ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ మోటార్ 7.24bhp శక్తి, 22Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏథర్ 450S ఈవీ 90kmph గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. ఈ ఈవీ మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. స్పోర్ట్స్ మోడ్, ఎకో మోడ్, రైడ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.
ఏథర్ 450S ఈవీ డిజైన్ 450X మాదిరిగానే ఉంది. భారీగా మార్పులు చేయలేదు LED హెడ్‌ల్యాంప్‌తో కూడిన కర్వడ్ ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మ్యాప్ నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉండదు. ధరను తగ్గించడంలో భాగంగా ఈ ఫీచర్‌ను తొలగించారు. అయితే టర్న్ బై టర్న్ నావిగేషన్‌తో వస్తుంది.

ఏథర్ ఎనర్జీ సంస్థ ఆగస్టు నెలలో 6835 యూనిట్ల ద్విచక్రవాహనాలను విక్రయించింది. జూలైలో ఈ సంస్థ 6,671 యూనిట్లను విక్రయించింది. జులై నెలలో పోలిస్తే ఆగస్టులో 2% వృద్ధిని నమోదు చేసింది. ఈథర్ 450S ఈవీ ధర రూ.1,29,999 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ స్కూటర్ 115 కి.మీ రేంజ్ ఇస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








