Ather 450X రూ. 98 వేలకే మంచి కంపెనీ నుంచి అదిరే EV స్కూటీ.. 146 కి.మీ రేంజ్..!
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. గత కొన్ని నెలలుగా వీటిని విక్రయించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలు పై వస్తున్న పుకార్లను చాలెంజింగ్ తీసుకున్న సంస్థలు అందుకు తగినట్లుగా అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా బైకులు లేదా స్కూటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో ఏథర్, ఓలా, టీవీఎస్, హీరో ఇంకా మొదలగు కంపెనీల నుంచి అనేక మోడళ్లు కొనుగోళ్లకు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా సంస్థలు కూడా కస్టమర్లను ఆకర్షించే విధంగా ఫీచర్లతో పాటు తక్కువ ధరలో వీటినిఅందిస్తున్నాయి. టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఏథర్ సరికొత్త బేస్ వేరియంట్ మోడల్ ను తీసుకువచ్చింది.

బేస్ వేరియంట్‌లో..
ద్విచక్ర వాహనాల విభాగంలో మరింత పోటీనీ తట్టుకునేలా ఏథర్ ఎనర్జీ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఏథర్ 450X స్కూటర్ కొత్త బేస్ వేరియంట్ ధర రూ.98,183 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండనుంది. ఇదే కంపెనీ నుంచి లభించే ప్రో ప్యాక్‌తో ఉన్న ఏథర్ 450X కంటే కొత్త ఏథర్ 450X బేస్ వేరియంట్ రూ. 30,000 తక్కువలో రానుంది ఇది కస్టమర్లను కొంతమేర ఆకర్షించే అవకాశం ఉంది.
మరింత ఆసక్తికరంగా, ఏథర్ ఎనర్జీలో 450X బేస్ వేరియంట్‌లో ఎటువంటి పెద్ద సాంకేతిక మార్పులను సంస్థ చేయలేదు. కొత్త ఏథర్ 450X బేస్ వేరియంట్ అదే 6.4kW ఎలక్ట్రిక్ మోటార్ 3.7kW నికెల్ కోబాల్ట్-ఆధారిత లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్‌గా అందుబాటులో ఉండనుంది.
అధిక ఫీచర్లు..
ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్‌తో పోలిస్తే, ఏథర్ 450X బేస్ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లను సంస్థ తొలగించింది. వెర్సా ఫంక్షన్, బ్లూటూత్, 4G LTE కనెక్టివిటీ, హిల్-హోల్డ్ అసిస్ట్, నావిగేషన్ రైడ్ మోడ్‌లను కోల్పోయింది. ఇవి యూజర్లకు కొద్ది మేర డిస్సాప్పాయింట్ చేయవచ్చు.
ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే రైడ్ మోడ్‌తో వస్తుంది. ఇది క్లెయిమ్ చేయబడిన రేంజ్ ఫిగర్‌లపై స్వల్ప ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా, ఏథర్ 450X బేస్ వేరియంట్ OTA అప్‌డేట్‌లతో రాదు. అలానే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో రావడం లేదు. ఏథర్ 450X బేస్ వేరియంట్ స్లో హోమ్ ఛార్జర్‌తో వస్తుంది.
5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్..
దీనిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు గ్రేస్కేల్ కలర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. నెమ్మదిగా ఉండే హోమ్ ఛార్జర్‌లలో, ఈథర్ 450X దాని బ్యాటరీ ప్యాక్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 15 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. ప్రో ప్యాక్‌తో కూడిన ఏథర్ 450X దాని బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 5 గంటల 40 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. 146 కి.మీ రేంజ్ ను అందించే అవకాశం ఉంది.
ఇక వారంటీ పరంగా, ఏథర్ 450X శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లు వాహనం, బ్యాటరీపై 3 సంవత్సరాల / 30,000 కిమీ వారంటీతో వస్తాయి. ప్రో ప్యాక్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ కోసం 5 సంవత్సరాల / 60,000 కిమీ వారంటీతో వస్తుంది. ప్రత్యర్థి ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారుల నుంచి పోటీ పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు కొత్త ధర మరియు ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో రివిజన్ వ్యూహాన్ని అనుసరించిందని చెప్పవచ్చు.
దేశంలోని హై-స్పీడ్ ఇ-స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యంత సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా ఉన్నప్పటికీ, ఏథర్ 450X Ola S1 ప్రోతో పోలిస్తే చాలా ఖరీదైనదిగా ఉండడం దీనికి ప్రతికూలంగా మారింది. అయితే, కొత్త సవరించిన ధరలతో, సరసమైన ధర అనేక ఫీచర్లతో సెగ్మెంట్‌లో ఇప్పటికే తన ఆధిపత్యాన్ని స్థాపించిన Ola S1 ప్రోను సవాలు చేయడమే Ather లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








