దేశంలో 1000కి పైగా ఏథర్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్.. వచ్చే నెల వరకు ఫ్రీ
ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ సంస్థ ఏథర్ దేశ వ్యాప్తంగా మరిన్ని ఛార్జింగ్ స్టేషన్ లను (ఏథర్ గ్రిడ్) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైక్ లు వినియోగం డిమాండ్ పెరుగుతున్న కారణంగా దేశ వ్యాప్తంగా అన్నీ ప్రముఖ నగరాల్లో విస్తృతం చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ముఖ్య నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చామని వాటి సంఖ్యను ఇంకా పెంచనున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే 80 ముఖ్య నగరాల్లో దాదాపు 1000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు ఏథర్ గ్రిడ్ లు ఉపయోగపడతాయని ఏథర్ కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. 2023 నాటికి ఈ స్టేషన్ల సంఖ్యను 2500పైగా పెంచేందుకు యోచిస్తున్నట్లు ఏథర్ వివరించింది. ఈ స్టేషన్లు అధికంగా ఉండటం వల్ల ప్రజలు సులభంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

60 శాతం ఛార్జింగ్ పాయింట్స్ తో టాప్ లో ఏథర్..
మొదటి నుంచి సేల్స్ తో పాటు ఛార్జింగ్ పాయింట్స్ పై కూడా ఏథర్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సౌకర్యం తమ స్టేషన్ లలో కల్పించింది. దీంతో ఈ స్టేషన్లను డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం దేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లో 60 శాతం ఛార్జింగ్ పాయింట్లను కంపెనీ నెలకొల్పింది. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటులో వ్యూవాత్మకంగా వ్యవహరించడంతో కంపెనీ సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. ఉదా.. ముంబయి నుంచి పుణె, సిలిగురి నుంచి డార్జిలింగ్, కోయంబత్తూరు నుంచి ఊటీ ఇలా ముఖ్య నగరాలను కలుపుతూ తమ సామ్రాజ్యాన్ని ఏథర్ విస్తరించింది.
'ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు ఏథర్ కట్టుబడి ఉంది'
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అభిృద్ధికి ఏథర్ ఎనర్జీ కట్టుబడి ఉందని ఆ సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్ నీత్ ఫోకెలా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా విస్తరింపచేయడంలో ఛార్జింగ్ పాయింట్స్ కీలకమైనవని ఆయన అన్నారు. EV సహిత పర్యావరణ వ్యవస్థ నిర్మాణం కోసం ఒక బ్రాండ్‌గా ఎదిగేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఫోకెలా వివరించారు. ఇప్పటికే దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ని నిర్మించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు.

భవిష్యత్ లో వీటి వినియోగం దృష్ట్యా అపార్ట్ మెంట్ బ్లాక్ లు, ఆఫీస్, టెక్-పార్క్ లు మొదలైన సెమీ-ప్రైవేట్ స్థలాల వద్ద వీటిని నెలకొల్పనున్నట్లు ఏథర్ చీఫ్ జిజినెస్ ఆఫీసర్ తెలిపారు. అవసరమైతే అంతరిక్షంలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఛార్జింగ్ స్టేషన్ ల అభివృద్ధి వల్ల అవేర్ నెస్ పెరిగి ఈవీ పరిశ్రమకు ఉపకరిస్తుందని అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఏరియాలలో ఛార్జింగ్ స్టేషన్ లకు యాక్సెస్ ఇవ్వడంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారడానికి ప్రజలకు విశ్వాసాన్ని ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ల ద్వారా తక్కువ సమయంలో దాదాపు 80% వరకుబైక్ లను ఛార్జ్ చేయడానికి వీలుంది. ఒక నిమిషంలో 1.5 కి.మీ సరిపడా ఛార్జింగ్ అందించవచ్చు. ఈ సౌకర్యం EV వినియోగదారులకు చాలా సులభంగా, వేగంగా సమయం కలిసి వచ్చేందుకు ఉపకరిస్తుంది. రియల్ టైంలో ఛార్జింగ్ స్టేషన్ లను గుర్తించడానికి EV బైక్ లలో సదుపాయం ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ను అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం మార్చి 2023 వరకు ఉచితంగా అందుబాటులో ఉండనుంది. మార్చి తరువాత ఛార్జ్ ఆధారంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

జనవరిలో అత్యధికంగా 12 వేలకు పైగా సేల్స్..
ఈ సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ సేల్స్ లో మంచి లాభాలను గడించింది. కేవలం జనవరిలోనే 12,419 యూనిట్లను సేల్ చేసి అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా, ఏథర్ తన రెండవ తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని హోసూర్ లో ప్రారంభించింది. ఇది వరకే ఈ కంపెనీ మాన్ ఫాక్చరింగ్ మొదటి కేంద్రం బెంగుళూరులో ఉంది.
ఎలక్ట్రిక్ బైక్ ల విభాగంలో ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బలమైన రిటైల్ విక్రయాల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దేశంలోని 80పైగా పేరొందిన నగరాల్లో 100కి పైగా ఈ కంపెనీ షోరూంలు ఉన్నాయి. వీటని మరింత విస్తరించేందుకు టైర్ 1,2 & 3 నగరాల్లో మరిన్నీ షోరూంలు నెలకొల్పేందుకు ఏథర్ ప్రణాళికలు చేస్తుంది. మార్చి 2023 నాటికి 100 నగరాల్లో దాదాపు 150పైగా కేంద్రాలకు రిటైల్ కేంద్రాలే లక్ష్యంగా పెట్టుకుని సంస్థ పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








