ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారా... ఈ స్కూటర్లపై రూ.24 వేల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు..!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సంవత్సరం చివర్లో విక్రయాలను పెంచుకొనేందుకు ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్ పేరిట (Ather electric december) తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో సుమారు 24 వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఏథర్‌ 450X మరియు ఏథర్ 450S ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఆఫర్‌ వర్తించనుంది.

ఏథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్ ఆఫర్‌ ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.7000 విలువైన బ్యాటరీ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ ఉచితంగా అందించబడుతుంది. ఇందులో 5 సంవత్సరాలు లేదా 60 వేల కిలోమీటర్ల వినియోగానికి సంబంధించిన ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు 70 శాతం స్టేట్‌ ఆఫ్‌ హెల్త్‌ గ్యారెంటీ కూడా అందించబడుతుంది.

Ather electric december

ఇది కాకుండా ఏథర్‌ ఎనర్జీ కూడా 5.99 శాతం వడ్డీ రేటుతో జీరో డౌన్‌ పేమెంట్‌ మరియు సులభమైన నెలవారీ వాయిదాల ప్లాన్‌ను అందించనున్నట్లు ప్రకటన చేసింది. దీంతోపాటు ఏథర్‌ ఎనర్జీ 60 నెలల EMI ప్లాన్‌ కింద ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకానికి అందించనున్నట్లు ప్రకటన చేసింది.

ఏథర్‌ ఎనర్జీ నుంచి త్వరలో 450 అపెక్స్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బుకింగ్‌ను ఇటీవలే ప్రారంభించింది. ఇప్పటికే ఈ స్కూటర్‌పై కస్టమర్లలో భారీ అంచనాలున్నాయి. కొత్త స్కూటర్‌ కోసం రూ.2,500 మొత్తాన్ని చెల్లించి బుక్‌ చేసుకోవాలని ఏథర్‌ ఎనర్జీ తెలిపింది.

Ather energy announces ather electric december offers

ఏథర్‌ 450X అపెక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల డెలివరీలు 2024 మార్చి నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ ఫీచర్‌ Warp+ రైడింగ్‌ మోడ్‌ అనే అద్భుతమైన ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్‌ ప్రీమియం ధర ట్యాగ్‌తో వస్తాయి. మరియు ఇందులో వినూత్నమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

450X ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 2.9 kWh మరియు 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లతో వస్తుంది. దీని ధరలు వరుసగా రూ.1,38,000, రూ.1,44,921గా ఉంది. ఈ స్కూటర్‌ పూర్తి ఛార్జింగ్‌తో 115 కి.మీ- 145 కి.మీల రేంజ్‌ అందిస్తుంది. 3.3 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 450X ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిస్క్‌ బ్రేక్‌ ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది.

ఈ కొత్త సంవత్సరంలో ఏథర్‌ రెండు స్కూటర్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త సంవత్సరం మంచి స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకొనే వారికి ఇదో శుభవార్త. అద్భుతమైన పనితీరు, అధునాతన ఫీచర్లు మరియు సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, December 15, 2023, 18:47 [IST]
English summary
Ather energy announces ather electric december offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+