తక్కువ ధరకే ఏథర్ నుంచి 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంఛ్.. మళ్లీ కింగ్‌ మేకర్‌ అవుతాయా?

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. సాంప్రదాయ వాహనాలను స్వస్తి పలుకుతున్న జనాలు ఎక్కువగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సేల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో ఈ వెహికిల్స్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో తమదైన ముద్ర వేసిన ఏథర్ ఎనర్జీ మూడు '450' సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఏథర్ కొత్త 450S మరియు 450X సిరీస్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లను విడుదల చేసింది. ఈ స్కూటర్స్ బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్‌ల పరంగా భిన్నంగా ఉండనున్నాయి.

Ather-Energy-450s

ప్రస్తుతం ఏథర్ లాంఛ్‌ చేసిన ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపు కంపెనీ పాత మోడల్ డిజైన్‌ని కలిగి ఉంది. షార్ప్ ఫ్రంట్ ఎండ్ మరియు ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌లైట్‌ని ఈ స్కూటర్‌లో చూడవచ్చు. హ్యాండిల్ బార్ కౌల్‌పై టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. సైడ్ నుంచి కూడా చూడటానికి ఈ స్కూటర్‌ స్మార్ట్‌లుక్‌తో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాలకు చెందిన యువ కస్టమర్లను ఆకర్షించనుంది.

ఈ స్కూటర్‌లోని ఫీచర్ల విషయానికొస్తే, ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వివిధ ఫీచర్లను కలిగి ఉంది. కొత్త 450S ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే ఉంది. 450X కొత్త వేరియంట్లు పాత 7 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్‌ని పొందుతుంది.

Ather-Energy-450-Series

కస్టమర్లు అదనంగా రూ.20,000 చెల్లించి 'ప్రో ప్యాక్' ఆప్షన్ష్‌తో ఈ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఇది 450S ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ మరియు 450ఎక్స్ స్కూటర్లో స్మార్ట్ ఎకో, ఎకో, రైడ్, స్పోర్ట్ మరియు వార్ప్ వంటి రైడింగ్ మోడ్లను పొందుతారు.

దీనితో గైడ్ -మి-హోమ్ లైట్స్, న్యావిగేషన్, టో/ థెఫ్ట్ నోటిఫికేషన్, రైడ్ స్టేటస్, ఇంటర్-సిటి పార్కింగ్ ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌కి అనుగుణంగా పూర్తి ఛార్జీలో 115 కి.మీ నుంచి 145 కి.మీ రేంజ్‌ అందిస్తుంది.

Ather-Energy-Scooters

కొత్త ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని పూర్తి ఛార్జ్‌పై 115 కిలోమీటర్ల (ఐడిసి) పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో 0 - 40 వేగాన్ని అందుకుంటుంది. అలానే గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

450 ఎస్ మరియు 450 ఎక్స్ (2.9 కిలోవాట్) స్కూటర్లలో ఒకే బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది 8 గంటల 36 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఎథర్ 450 ఎక్స్ (3.7 కిలోవాట్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ 5 గంటల 45 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక, మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

Ather-Energy-Scooters-Grab-Rail

డిస్క్ కు రెండు వైపులా బ్రేక్ ఆప్షన్ ఉంది. ఇందులో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ 90/90, రియర్ 100/80 ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో వీటితో పాటు అనేక సదుపాయలు ఉన్నాయి. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న స్కూటర్లలోని ఫీచర్ల కంటే కొన్ని అధునాతన ఫీచర్లతో ఇవి రానున్నాయి.

ఏథర్ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్‌లో గట్టీ పోటీదారులు ఉన్నాయి. ఓలా, టీవీఎస్, హీరో, బజాజ్ నుంచి ఈ స్కూటర్లకు గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఈ సారి లాంఛ్‌ చేసిన స్కూటర్లు కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్నాయి. రాబోయే పండుగ సీజన్లో పెద్ద సంఖ్యలో వీటి విక్రయాలు పెరిగి.. తిరిగి మొదటి స్థానాన్ని ఆక్రమించే అవకాశం లేకపోదు.

ఇక ఆఖరుగా ఈ స్కూటర్ల ధరల విషయానికి వస్తే ఏథర్ 450ఎస్ ధర రూ.1,29,999, 450 ఎక్స్ (2.9 కిలోవాట్ల బ్యాటరీ) ధర రూ.1,38,000, 450 ఎక్స్ (3.7 కిలోవాట్ల బ్యాటరీ) ధర రూ.1,44,921 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, August 11, 2023, 18:01 [IST]
English summary
Ather energy launched 3 new 450 series electric scooters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+