Ather నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ డ్రైవ్ ఫొటోలు వైరల్..!
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicle) వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారులు అవసరాలు, సౌకర్యాలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ద్విచక్ర వాహన సెగ్మెంట్‌లో వివిధ సంస్థలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) .. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఏథర్ ఎనర్జీ బెంగళూరు వేదికగా కార్యకలాపాలు సాగిస్తోంది. బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ ఇ-స్కూటర్‌ను టెస్ట్ డ్రైవ్ చేసింది.

ఈ వాహనాలకు గట్టి పోటీ.. : ఈ స్పై ఫొటోల ఆధారంగా ఏథర్ ఎనర్జీ కొత్త స్కూటర్ టీవీఎస్ icube, బజాజ్ చేతక్ EVలతో పోటీ పడనుందని తెలుస్తోంది. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ తరహాలో.. కొత్త వాహనం కూడా స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. తాజా ఫొటోల ఆధారంగా ఈ స్కూటర్ ఫ్రంట్ మరియు వెనుక వైపు సౌకర్యవంతంగా ఉంది. దీంతోపాటు ఫ్లోర్‌బోర్డ్ వెడల్పుగా కనిపిస్తోంది.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్: ఇతర వాహనాల మాదిరిగానే వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల కోసం ఫోల్డబుల్ పుట్‌రెస్ట్ ఉంది. స్టాండర్డ్ ఫ్రంట్ హెడ్‌లైట్‌ను చూడవచ్చు. దీంతోపాటు స్కూటర్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ బయటకు కనిపించకుండా సైడ్ ప్యానళ్లు అమర్చబడ్డాయి. ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే.. ఈ కొత్త ఈవీలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది.

ఎంత రేంజ్ ఇస్తుందంటే.. : ఫొటోలో ఉన్న 12 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంది. ముందు వైపు డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. ఈ కొత్త ఈవీ 100 కి.మీ నుంచి 150 కి.మీ రేంజ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఏథర్ కొత్త స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఛార్జింగ్ స్టేషన్ల కొరత : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి మార్కెట్ ఉంది. మార్కెట్ డిమాండ్, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల కొరత సహా ఇతర విడి భాగాలు, నిపుణుల కొరత కారణంగా చాలా మంది కస్టమర్లు వెనక్కి తగ్గుతున్నారు.

రానున్న రోజుల్లో : అయితే ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు ఛార్జింగ్ స్టేషన్ల కొరతను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల ఆయా సంస్థల తరఫున ప్రధాన నగరాలు సహా పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








