కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత హుందాగా..!!

ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతూ ముందుకు వెళుతున్న ఏథర్ 450ఎక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు కొత్త కలర్ ఆప్సన్స్ తో విడుదలైంది. కంపెనీ విడుదల చేసిన ఈ అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

బెంగుళూరుకు చెందిన EV తయారీదారు ఏథర్ ఎనర్జీ తన 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొత్త సీటు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో మాత్రమే కాకుండా నాలుగు కొత్త కలర్ ఆప్సన్స్ తో విడుదల చేసింది. అవి కాస్మిక్ బ్లాక్, లూనార్ గ్రే, సాల్ట్ గ్రీన్ మరియు రావిషింగ్ రెడ్ కలర్స్. ఈ నాలుగు కలర్ ఆప్సన్స్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు AtherStack 5.0 వంటి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉన్నాయి.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

Atherstack 5.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్, కొత్త ఇన్ఫర్మేషన్ లేఅవుట్ మరియు గూగుల్ తో అనుబంధంగా రూపొందించబడిన వెక్టర్ మ్యాప్స్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను అందిస్తుంది. యూజర్ ఇంటర్ ఫేస్(యూఐ) ఒక టచ్ స్క్రీన్ సిస్టమ్. బైక్ స్టార్ట్ చేసే ముందు బ్లూటూత్ కనెక్షన్‌లు, నావిగేషన్ వంటి ఎంపికలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రైడర్ స్కూటర్ ని ఏ మోడ్లో వినియోగిస్తున్నారు, చార్జింగ్ వంటి వివరాలు ఈ డిస్ ప్లే లో కనిపిస్తాయి.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

ఇక గూగుల్ వెక్టార్ మ్యాప్స్ విషయానికి వస్తే, ఇది లైవ్ ట్రాఫిక్ ను చూడటంతో పాటు నావిగేషన్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. యూజర్ల లోకేషన్, రైడింగ్ స్టైల్ ని ఇది రియల్ టైం లో మనకు తెలియజేస్తుంది. బహుశా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఆధునిక కాలంలో ఇదే కావొచ్చని భావిస్తున్నాము.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

2022 లో కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కొత్త సంవత్సరంలో ఆధునిక కలర్ ఆప్సన్స్ మరియు అప్డేట్స్ తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. దీనిని ఇప్పుడు కొత్త కలర్స్ యాడ్ అవ్వడంతో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ఆరు కలర్స్ తో అందుబాటులో ఉంటుంది.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

బెంగళూరు వేదికగా నిర్వహించిన ఏథర్ కమ్యూనిటీ డే ఈవెంట్‍లో కంపెనీ ఏథర్ 450ఎక్స్ కొత్త కలర్లతో పాటు ఏథర్ స్టాక్ 5.0 సాఫ్ట్ వేర్ అప్‍డేట్‍ను కూడా అధికారికంగా ప్రకటించింది. ఏథర్ స్టాక్ 5.0 సాఫ్ట్‌వేర్‌కు అప్‍డేట్ చేసుకుంటే ఏథర్ స్కూటర్లు వాడుతున్న యూజర్ల కొత్త ఫీచర్లను పొందవచ్చు. ఇది మేజర్ అప్‍డేట్‍గా ఉంది. బ్యాటరీ లైఫ్ పెరిగేలా కూడా కొన్ని కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

ఏథర్ 450ఎక్స్‌ లో ఇప్పుడు కొత్త సీటింగ్ కూడా వచ్చేసింది. కావున ఈ సీటు ఇప్పుడు కొంత ఎత్తులో ఉంటుంది. ఇది ఎత్తుగా ఉన్న రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త సీటు ముందు భాగంలో కొంత ఇరుగ్గా ఉన్నప్పటికీ వెనుక పిలియన్ కి చాలా అనుకూలంగా ఉండేలా రూపొందించబడి ఉంటుంది. ఇది మంచి కుషనింగ్ కూడా అందిస్తుంది.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

కంపెనీ అప్డేటెడ్ 450X యొక్క బ్యాటరీ ప్రొటెక్షన్ కూడా ప్రకటించింది ఇందులో భాగంగానే ఇప్పుడు ఉన్న మూడు సంవత్సరాల వారంటీకీ మరో రెండు సంవత్సరాల వారంటీ కూడా జోడించింది. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీ పొందవచ్చు. అయితే అదనపు వారంటీకీ రూ. 6,999 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కూడా బ్యాటరీ 70 శాతం పనితీరును తప్పకుండా అందిస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.

కొత్త కలర్ ఆప్సన్స్ & అప్డేటెడ్ ఫీచర్స్‌తో.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత హుందాగా..!!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.37లక్షల నుంచి రూ. 1.60లక్షల వరకు ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్‍ అందిస్తుంది. కొత్త కలర్ ఆప్సన్స్ మరియు ఆధునిక ఫీచర్స్ తో విడుదలైన ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 9, 2023, 8:17 [IST]
English summary
Ather introduced updates for 450 lineup atherstack 5 0 new interface colour options warranty details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+