ఫ్లెక్స్ ఫ్యూయల్ అవతార్‌లో కనిపించిన 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్160'.. డిజైన్ & వివరాలు

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో తన 'పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్' ని 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ బైక్ ప్రదర్శనతో కంపెనీ ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న బైకులతో పల్సర్ ఎన్ఎస్160 ఒకటి. అయితే ఈ బైక్ ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ గా ఆవిష్కరించబడింది. ఇది చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది.ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ఇథనాల్ ఆధారిత ఇంధనాల (E20 నుండి E85 వరకు) శ్రేణిపై నడుస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అవతార్‌లో కనిపించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్160

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ 160.37 సిసి ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద 14.6 bhp పవర్ మరియు 8,500 rpm వద్ద 12.5 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఈ బైక్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. కావున లాంగ్ రైడ్ చేయాలనుకునే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం విషయానికి వస్తే, సాధారణంగా రెండు అంకెల సంఖ్య ముందు 'E' తో సూచించబడతాయి. అంటే ఇక్కడ ఆ సంఖ్యలు ఇంధన శాతాన్ని చూపిస్తాయి. E20 ఇంధనం అంటే ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. అదే సమయంలో E80 అని ఉంటే ఇందులో 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో 100 శాతం పెట్రోల్ ఉపయోగించబడదు. ఇందులో ఇథనాల్ కూడా ఉపయోగించబడుదుతుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అవతార్‌లో కనిపించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్160

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2017 మిమీ, వెడల్పు 804 మిమీ, ఎత్తు 1060 మిమీ మరియు వీల్‌బేస్‌ 1372 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 301 కేజీల వరకు ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ 12 లీ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా సాధారణ మోడల్ మాదిగానే ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పులు జరిగినట్లు కనిపించదు. కావున చూడటానికి మునుపటి పల్సర్ ఎన్ఏస్160 మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అవతార్‌లో కనిపించిన బజాజ్ పల్సర్ ఎన్ఎస్160

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క పనితీరుని గురించి మరియు మైలేజ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. బహుశా కంపెనీ ఈ బైక్ కి సంబంధించిన చాలా సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆటో ఎక్స్‌పో 2023 లో సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కూడా ప్రదర్శించబడ్డాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2023, 10:35 [IST]
English summary
Auto expo 2023 bajaj pulsar ns160 flex fuel showcased details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+