'2023 ఆటో ఎక్స్‌పో' లో విడుదలైన జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్ - ధర రూ. 1.49 లక్షలు

2023 ఆటో ఎక్స్‌పో వేదికగా అనేక కొత్త ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే 'జాయ్' (Joy) కంపెనీ మిహోస్ ఈ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

జాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 100 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చబడి ఉంటుంది. మిహోస్ ఎలక్ట్రిక్ వెహికల్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లోసీ, సాలిడ్ ఎల్లో గ్లోసీ మరియు పెర్ల్ వైట్ కలర్స్. కంపెనీ ఈ-బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్

జాయ్ ఈ-బైక్ కొనాలనుకునే కస్టమర్లు దేశ వ్యాప్తంగా ఉన్న కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. జాయ్ ఇ-బైక్ మిహోస్ పొడవు 1,864 మిమీ, వెడల్పు 700 మిమీ మరియు ఎత్తు 1,178 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,360 మిమీ పొడవైన వీల్‌బేస్‌ కలిగి, 175 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటు ఎత్తు భూమి నుంచి 740 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

జాయ్ ఇ-బైక్ మిహోస్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి సింపుల్ గా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ రెట్రో డిజైన్‌ను కలిగి రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది, దానికి కింద ఇండికేటర్స్ చూడవచ్చు. మిహోస్‌లో పొడవైన సీటు మరియు సింగిల్-పీస్ గ్రాబ్రెయిల్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బాడీ ప్యానెల్ పాలీ డిసైక్లోపెంటాడైన్ తో తాయారు చేయబడి ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కి కనెక్ట్ అయ్యే జాయ్ ఇ-కనెక్ట్ యాప్‌తో సహా అనేక ఫీచర్లను పొందుతుంది. ఇవన్నీ స్కూటర్ గణాంకాలను తనిఖీ చేయడానికి మరియు GPS తో రిమోట్‌గా ట్రాక్ చేయడానికి రైడర్ ని అనుమతిస్తుంది. అంతే కాకుండా ఇందులో జియోఫెన్సింగ్, యాంటీథెఫ్ట్ మరియు కీలెస్ ఆపరేషన్‌తో పాటు సులభమైన పార్కింగ్ కోసం రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉన్నాయి.

జాయ్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) లిథియం-అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2.5 kWh బ్యాటరీ కలిగి ఉండటం వల్ల, ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 100 కిమీ పరిధిని అందిస్తుండని ధృవీకరించబడింది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి పట్టే సమయం నాలుగు గంటలు మాత్రమే. దీని గరిష్ట వేగం 70 కిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన జాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్

జాయ్ ఇ-బైక్ మిహోస్‌లో టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు మోనోషాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో హైడ్రాలిక్ కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా సహాయపడే రెండు డిస్క్ బ్రేక్స్ కలిగి ఉంటాయి. మీరు బ్రేక్ లివర్‌ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని ఛార్జ్ చేయడంలో బ్రేక్‌లు సహాయపడతాయి. ఇది ఈ ఎలక్ట్రిక్ బైకులో ఒక ఉత్తమైన ఫీచర్ అనే చెప్పాలి. కావున ఇది అన్ని విధాలుగా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ఆటో ఎక్స్‌పో 2023 వేదికగా జాయ్ కంపెనీ రాక్‌ఫెల్లర్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా ప్రదర్శించింది. ఈ బైక్ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో హైడ్రాలిక్ బ్రేక్‌లు, వెహికల్ ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, రిమోట్ డియాక్టివేషన్ మరియు ఆడియో ప్లేబ్యాక్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, January 13, 2023, 13:07 [IST]
English summary
Auto expo 2023 joy e bike mihos launched in india price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+