2023 ఆటో ఎక్స్‌పోలో సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రదర్శన - వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సుజుకి మోటార్‌సైకిల్‌ 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ప్రదర్శించింది. సుజుకి మోటార్‌సైకిల్‌ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ప్రదర్శనతో ఫ్లెక్స్ ఫ్యూయల్ విభాగంలో చేరిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నిజానికి మార్కెట్లో దాదాపు బైకులు మరియు స్కూటర్లు పెట్రోల్ తో నడుస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ (పెట్రోల్ మరియు ఇథనాల్) వాహనాల విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ప్రదర్శించింది. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ ఇథనాల్ ఆధారిత ఇంధనాల (E20 నుండి E85 వరకు) శ్రేణిపై నడుస్తుంది.

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్

ఫ్లెక్స్ ఫ్యూయెల్ మరియు ఇథనాల్ ఆధారిత ఇంధనం విషయానికి వస్తే, సాధారణంగా రెండు అంకెల సంఖ్య ముందు 'E' తో సూచించబడతాయి. అంటే ఇక్కడ ఆ సంఖ్యలు ఇంధన శాతాన్ని చూపిస్తాయి. E20 ఇంధనం అంటే ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. అదే సమయంలో E80 అని ఉంటే ఇందులో 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో 100 శాతం పెట్రోల్ ఉపయోగించబడదు. ఇందులో ఇథనాల్ కూడా ఉపయోగించబడుదుతుంది.

మార్కెట్లో ఆవిష్కరించబడిన సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ సుజుకి Gixxer 250 మోటార్‌సైకిల్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో ఇథనాల్ ఉపయోగించబడుతుంది, కావున కంపనీ దీనికి తగిన విధంగా ఇంజిన్ లో మార్పులు చేసి ఉంటుంది. ఇవి సాధారణ బైకుల మాదిరిగానే మంచి పనితీరుని అందిస్తాయి. కావున వినియోగదారులు పర్ఫామెన్స్ గురించి ఎలాంటి చింత చెందాల్సిన అవసరం లేదు.

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ 249 సిసి, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 9,300 rpm వద్ద 26.14 bhp గరిష్ట పవర్ మరియు 7,300 rpm వద్ద 22.2 Nm గరిష్ట టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఈ సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అదే 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

పరిమాణం పరంగా కూడా ఈ కొత్త సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ 2,010 మిమీ పొడవు, 805 మిమీ వెడల్పు, 1,035 మిమీ ఎత్తు మరియు 1,340 మిమీ వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే సుజుకి Gixxer 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి, 156 కేజీల బరువును కలిగి ఉంటుంది.

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్

సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కి సమానంగా ఉంటుంది. కావున డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా సాధారణ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ ఈ బైక్ యొక్క పర్ఫామెన్స్ మరియు మైలేజ్ వంటి వివరాలు మాత్రమే కాకుండా ఈ బైక్ యొక్క ధరలు కూడా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2023, 8:13 [IST]
English summary
Auto expo 2023 suzuki gixxer 250 flex fuel showcased details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+