2023 ఆటో ఎక్స్‌పోలో అడుగెట్టిన 'అల్ట్రావయోలెట్ F99'.. పర్ఫామెన్స్‌లో తగ్గేదేలే

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ 'F77' లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ప్రదర్శించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ బైక్ పేరు "F99 ఫ్యాక్టరీ రేసింగ్ ప్లాట్‌ఫారమ్‌". ఈ ఆధునిక ఎలక్ట్రిక్ బైక్ గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కావున ఈ ఎలక్ట్రిక్ బైక్ F77 బైక్ మాదిరిగా కాకుండా రేస్ ట్రాక్‌కి పరిమితం చేయబడింది. ఎందుకంటే ఇది ట్రాక్ లో అద్భుతమైన పనితీరుని అందించడానికి తాయారు చేయబడింది కావున ఇందులో రో బిట్‌లు మరియు మృదువైన కాంపౌండ్ టైర్ వంటివి ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగెట్టిన అల్ట్రావయోలెట్ F99..

అల్ట్రావయోలెట్ F99 అనేది F77 యొక్క 60 వోల్ట్ ఆర్కిటెక్చర్ కాకుండా 120 వోల్ట్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. ఇందులో భారీగా ఉన్న ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది. అయితే దీనికి పటిష్టమైన భద్రతను అందించడం జరిగింది. దీని వల్ల 50kW లేదా 68hp మోటారు, బైకుని 200kph గరిష్ట వేగంతో వెళ్లేలా చేస్తుందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న F77 Recon కంటే మెరుగ్గా ఉంటుంది.

అల్ట్రావయోలెట్ F99 అధిక సామర్థ్యము అందించే ఎలక్ట్రి మోటరుని కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ బైక్ రైడింగ్ పొజిషన్, రైడింగ్ ఎర్గోనామిక్స్‌ను అడ్జస్ట్ చేయడానికి అడ్జస్ట్ చేయగల రియర్ సెట్ ఫుట్ పెగ్‌లు పొందుతుంది. అంతే కాకుండా ఇందులో కొంత సన్నగా మరియు గట్టిగా ఉండే సీటు ఉంటుంది. ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క బాడీ ప్యానెల్‌లు కార్బన్ ఫైబర్‌తో తాయారు చేయబడి ఉంటాయి, కావున బరువును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగెట్టిన అల్ట్రావయోలెట్ F99..

అల్ట్రావయోలెట్ F99 బైక్ బ్రెంబో మాస్టర్ సిలిండర్ మరియు పిరెల్లి సూపర్‌కోర్సా టైర్‌లతో ట్వీక్ చేయబడిన బ్రేకింగ్ సిస్టమ్ పొందుతుంది. ఇది రేస్ ట్రాక్ మీద మంచి గ్రిప్ అందించేలా రూపొందించబడి ఉన్నాయి. ఈ లేటెస్ట్ రేస్ ట్రాక్ బైక్ మీటియార్ గ్రే మరియు ప్లాస్మా రెడ్ అనే డ్యూయెల్ టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

ప్రస్తుతం కంపెనీ ఈ F99 బైక్ గురించి ఎక్కువ సమాచారం అందించలేదు. అయితే ఈ సంవత్సరం వన్ మేక్ రేసింగ్ సిరీస్‌ను నిర్వహించే ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది. బహుశా ఆ సమయంలో ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ ఇప్పటికే అల్ట్రావయోలెట్ ఎఫ్77, ఎఫ్77 రీకాన్ మరియు ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 3.80 లక్షలు, రూ. 4.55 లక్షలు, రూ. 5.50 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగెట్టిన అల్ట్రావయోలెట్ F99..

అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే ఎఫ్77 వేరియంట్ కంటే కూడా రీకాన్ వేరియంట్ రేంజ్ 100 కిమీ ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది.

అల్ట్రావయోలెట్ F77 లిమిటెడ్ ఎడిషన్ 307 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇవి స్టాండర్డ్ మరియు బూస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ కలిగి ఉంటాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 15A ప్లగ్ పాయింట్‌లోకి ప్లగ్ చేయవచ్చు. డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో ఎల్ఈడీ లైట్, వెనుక స్ప్లిట్ LED టైల్‌లైట్లు ఉంటాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ TFT డాష్‌తో టర్న్-బై-టర్న్ నావిగేషన్ మరియు నోటిఫికేషన్ అలర్ట్‌లు వంటి ఫీచర్లను ఎనేబుల్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, January 13, 2023, 8:02 [IST]
English summary
Auto expo 2023 ultraviolette f99 revealed design features and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+