ఆటో ఎక్స్‌పో 2023: ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో రానున్న యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ యమహా మోటార్‌సైకిల్ ఆటో ఎక్స్‌పో 2023 లో 'యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్' (Yamaha FZ-15 ABS) ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ ప్రదర్శించింది. కంపెనీ ప్రదర్శించిన ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ మంచి డిజైన్ కలిగి చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉంటుంది. భారతదేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులకు ఎక్కువ ఆదరణ ఉంది, అయితే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని కంపెనీలు ఈ మోడల్స్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. కావున రానున్న రోజుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో విడుదల కానున్నాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో రానున్న యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్

యమహా ఎఫ్‌జెడ్ 15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ 149 సిసి, సింగిల్ సిలిండర్, SOHC 2 వాల్వ్ 4 స్ట్రోక్ ఇంజిన్ పెట్రోల్‌ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, కావున మంచి పనితీరుని అందిస్తుంది.

భారతదేశంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులకు ఎక్కువ ఆదరణ ఉంది, అయితే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని కంపెనీలు ఈ మోడల్స్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే హీరో మోటోకార్ప్ గ్లామర్ Xtec ఫ్లెక్స్ ఫ్యూయల్, సుజుకి జిక్సర్ 250 ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హోండా XRE 300 ఫ్లెక్స్-ఫ్యూయెల్ వంటివి ఆవిష్కరించబడ్డాయి.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో రానున్న యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ బైక్ పొడవు 2000 మిమీ, వెడల్పు 780 మిమీ, ఎత్తు 1080 మిమీ మరియు వీల్‌బేస్‌ 1330 మిమీ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే పల్సర్ ఎన్ఎస్160 ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్‌సైకిల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క బరువు (కర్బ్ వెయిట్) 135 కేజీల వరకు ఉంటుంది.

ఫ్లెక్స్ ఫ్యూయెల్ మరియు ఇథనాల్ ఆధారిత ఫ్యూయెల్ విషయానికి వస్తే, సాధారణంగా రెండు అంకెల సంఖ్య ముందు 'E' తో సూచించబడతాయి. అంటే ఇక్కడ ఆ సంఖ్యలు ఇంధన శాతాన్ని చూపిస్తాయి. E20 ఇంధనం అంటే ఇందులో 20 శాతం ఇథనాల్ ఉంటుంది. అదే సమయంలో E80 అని ఉంటే ఇందులో 80 శాతం పెట్రోల్ ఉంటుంది. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల్లో 100 శాతం పెట్రోల్ ఉపయోగించబడదు. ఇందులో ఇథనాల్ కూడా ఉపయోగించబడుదుతుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌లో రానున్న యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ 11.9 లీ కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ బైక్ డిజైన్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. ఫీచర్స్ కూడా సాధారణ మోడల్ మాదిగానే ఉంటుంది. ఇందులో పెద్దగా మార్పులు జరిగినట్లు కనిపించదు. కావున చూడటానికి యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.

యమహా ఎఫ్‌జెడ్-15 ఎబిఎస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ యొక్క పనితీరుని గురించి మరియు మైలేజ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. బహుశా కంపెనీ ఈ బైక్ కి సంబంధించిన చాలా సమాచారాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ బైక్ మంచి బ్రేకింగ్ సిస్టం పొందుతుంది, ఈ బైక్ యొక్క ముందు వైపు 282 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, January 14, 2023, 14:53 [IST]
English summary
Auto expo 2023 yamaha fz 15 flex fuel motorcycle showcased details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+