మరోసారి పల్సర్ బైక్ రిలీజ్.. కొత్తగా ఏముంది..!

బైక్ ప్రేమికులు అత్యంత అమితంగా ప్రేమించే బజాజ్ పల్సర్ ని కొన్ని నెలలుగా ఆ సంస్థ నిలిపివేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ ఆ మోడల్ లో బైక్‌ ను రీ లాంచ్ చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే ఈ కొత్త అవతార్ పల్సర్ లో వస్తున్న ఫీచర్లు ఏంటో తెలుసుకోండి.

సౌత్ ఇండియా మార్కెట్ లో బజాజ్ కి మంచి సేల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పల్సర్ బైక్ సేల్స్ భారీగా జరుగుతాయి. అయితే బజాజ్ ఈ మోడల్ నీ నిలిపివేసి N250, F250లను ఆ కంపెనీ ప్రవేశ పెట్టింది. ఈ బైక్ లు సంస్థకు ఆశించిన ఫలితాలను రాబట్టలేదు. దీంతో తన సక్సెస్ మోడల్ బైక్ పల్సర్ ను మరలా ప్రవేశ పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

బజాజ్ పల్సర్

2023 బజాజ్ పల్సర్ 220F డిజైన్..

ప్రస్తుతం తీసుకువచ్చిన పల్సర్ బైక్‌ లో బజాజ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే క్లిక్ అయిన డిజైన్‌ కి కొనసాగింపుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ముందుభాగంలో భారీ ఫ్రంట్ ఫేసియా, స్ప్లిట్-టైప్ సీటుతో పాటు సీటుకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ని కల్పించింది. బైక్ ను సరికొత్తగా రిలీజ్ చేస్తున్నా.. పాత డిజైన్‌ కి కొనసాగింపుగా మాత్రమే ఈ బైక్ ను మనం భావించవచ్చు.

ఇంకా మరిన్నీ ఫీచర్ల విషయానికొస్తే, LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ ఈ బైక్ లో అమర్చారు. సెమీ-డిజిటల్ కన్సోల్ ను కల్పించింది. ఎప్పటిలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్ లను ఈ బైక్ కు జతచేసింది. డ్యూయల్ ఛానల్ ABS సదుపాయం ఈ బైక్ లో కలదు. ఇలా మరిన్నీ అదనపు ఫీచర్లను బాజాజ్ కల్పించింది.

బజాజ్ పల్సర్

ఇంజన్..

డిజైన్ ఫీచర్ల మాదిరిగానే, ఇంజిన్ కూడా పాత పల్సర్ మాదిరిగానే ఉంటుంది. 20.11bhp వద్ద 18.55Nm గరిష్ట టార్క్‌ను ఈ బైక్ ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ తో ఈ బైక్ పనిచేస్తుంది. ఐదు స్పీడ్ గేర్‌ లను ఈ బైక్ కలిగి ఉంది. 17-అంగుళాల కల్గిన అల్లాయ్ వీల్స్‌ తో బైక్ ప్రయాణిస్తుంది. BS -6 ఫేజ్ 2 నార్మ్స్ ప్రకారం ఈ బైక్ ను తీసుకురానున్నారు.

డ్యూయల్ టోన్ కలర్స్ లో ఈ బైక్ లు దర్శనమివ్వనున్నాయి. మొత్తం మూడు కలర్లలలో అందుబాటులో ఉండనుంది. బ్లూ బ్లాక్, రెెడ్ బ్లాక్ కలర్లతో పాటు రెడ్, వైట్, బ్లాక్ షేడ్ లో బైక్ లను తీసుకురానుంది. బజాజ్ తన పల్సర్ బ్రాండ్‌ బైకులను దాదాపు 70 పైగా దేశాల్లో విక్రయిస్తుంది. పల్సర్ బ్రాండ్ లోనే అనేక మోడళ్లను ఆ సంస్థ విక్రయిస్తోంది.

బజాజ్ పల్సర్

పల్సర్ 2023 అవతార్ ధర..

ఇక ధర విషయానికి వస్తే.. బజాజ్ పల్సర్ 220ఎఫ్ రూ.1.41లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త పల్సర్ N250, F250 కంటే తక్కువ ధరను కలిగి ఉండటం.. పాత బైక్ బజాజ్ పల్సర్ పై ఆసక్తి ఉన్నవారు కొత్తగా వస్తున్న ఈ బైక్ ను కొనుగోలు చేసే అవకాశం లేకపోదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కొత్త పల్సర్ ఈ సంస్థకు ఏ మేరకు లాభాలను తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.

2021 అక్టోబర్ 28న దేశీయ విపణిలోకి సరికొత్త బజాజ్ పల్సర్ 250 మోటార్‌సైకిళ్లు విడుదలయ్యాయి. ఇందులో N250 మరియు F250 అనే రెండు బైకులున్నాయి. అయితే ఈ బైకులు మునుపటి పల్సర్ బైకులకంటే మాదిరిగా ఆధరణను పొందలేక పోయాయి. దీంతో ఈ బైక్ సక్సెస్ కాలేక పోయింది. దీనిపై పునరాలోచించిన కంపెనీ చేసేదేమిలేక ప్రస్తుతం పాత విధానానికే ఓటేసింది.

More from DriveSpark

Article Published On: Monday, February 20, 2023, 19:59 [IST]
English summary
Bajaj 220f pulser re launched with advanced technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+