కొత్త సంవత్సరంలో బజాజ్‌ నుంచి 6 కొత్త టూ వీలర్లు.. తక్కువ ధరలో సీఎన్‌జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.!!

భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా బజాజ్(Bajaj Auto) ఆటో గుర్తింపు పొందింది. బజాజ్‌ సంస్థకు చెందిన పల్సర్.. పల్సర్‌ సిరీస్ బైక్స్‌ విక్రయాల ద్వారా యువతలో మంచి డిమాండ్‌ ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో బజాజ్‌ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త స్కూటర్లు, బైక్‌లు మరింత అధునాతనంగా ఉండనున్నాయి.

బజాజ్‌ నుంచి కొత్త సంవత్సరంలో భారత మార్కెట్లోకి రానున్న బైక్‌ బజాజ్ పల్సర్(Bajaj Pulsar) NS400.. ఈ బైక్ దాదాపు పల్సర్ NS200 మాదిరిగానే డిజైన్, ఫీచర్లను పోలి ఉంటుంది. 373సీసీ లిక్విడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంకా గరిష్ఠంగా 40 bhp పవర్, 35 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.

Bajaj-Pulsar-RS200

ఇక బజాజ్‌ కంపెనీ నుంచి కూడా సీఎన్‌జీ బైక్‌ రానుంది. తక్కువ ధరలో సీఎన్‌జీతో నడిచే ఈ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికి E101 అనే కోడ్ పేరును సంస్థ ప్రకటించింది. కాగా రానున్న కొత్త CNG బైక్ CT100 లేదా CT110 మోడల్‌పై ఆధారపడి ఉండనున్నట్లు సమాచారం. సరసమైన ధరలో ఈ బైక్‌ అందుబాటులోకి రానుంది.

కాగా భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ N150 విడుదలైన తర్వాత, పల్సర్ P150 విక్రయాలు నిలిపివేశారు. కాగా ఇప్పుడు సంస్థ P సిరీస్‌లో 125 సిసి కేటగిరీలో కొత్త బైక్ Pulsar P 125 ను విడుదల చేయడానికి బజాజ్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ సరికొత్త బైక్‌ ట్రయల్‌ రన్‌ ఇప్పటికే రోడ్లపై చక్కర్లు వేయగా.. ఈ బైక్‌ దాదాపుపల్సర్ P150 బైక్‌ను పోలి ఉంటుంది.

Bajaj-Chetak

అంతే కాకుండా బజాజ్ నుంచి సన్నీ EVని కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ స్కూటర్‌ అత్యుత్తమ స్కూటర్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా సంస్థ భావిస్తోంది. కాగా దీనిపై పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ఈ స్కూటర్‌ను వినూత్నమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అధునాతనంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది భారత మార్కెట్లో ఈ స్కూటర్‌ను బజాజ్‌ గ్రాండ్‌గా లాంచ్‌ చేయనుంది.

భారత్‌లో మధ్య తరగతి ప్రజల జనాభా ఎక్కువ. వారిని దృష్టిలో ఉంచుకుని.. బజాజ్ సిటీ (CT) సిరీస్‌లో కొత్త బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ బైక్‌ పేరు బజాజ్‌ CT 150X కాగా దీనిని టెస్ట్ డ్రైవ్‌లో ఇటీవల గుర్తించారు. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో ఈ బైక్‌ అందుబాటులోకి రానుంది. కాగా ఈ బైక్‌.. పల్సర్ 150 సీసీ బైక్‌లో మాదిరి ఇంజన్ కలిగి ఉండవచ్చని సమాచారం.

ఇక బజాజ్‌ నుంచి తక్కువ ధరలో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కూడా రానుంది. అభివృద్ధి దశలో ఉన్న చేతక్‌(Chetak) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త వేరియంట్‌ను ఇటీవల రోడ్డుపై టెస్ట్ర్ డ్రైవ్‌ చేస్తూ కనిపించింది. కాగా దీని స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర దాదాపు రూ. 1 లక్ష వరకు ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, November 20, 2023, 9:19 [IST]
English summary
Bajaj auto to launch 6 new two wheelers including cng bike chetak ev in 2024 list here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+