Bajaj Avenger మరోసారి విడుదల కానున్న అవెంజర్ బైక్.. ఈ సారి సరికొత్తగా మార్కెట్‌లోకి

బజాజ్ అవెంజర్‌ని మూడేళ్ల క్రితం ఆ సంస్థ ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా మరోసారి ఈ బైక్ రోడ్డుపై కనిపించనుంది. దానికి సంబంధించిన వివరాలను ఆ కంపెనీ వెల్లడించింది. యువతలో ముఖ్యంగా ఈ బైక్‌కి అధిక క్రేజ్ ఉంది. లక్షల్లో ఈ అవెంజర్ సిరీస్‌కి అధిక స్థాయిలో అభిమానులున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని ఉత్పత్తి ఆగిపోయింది. ఇప్పుడు ఈ సంస్థ తిరిగి లాంఛ్ చేసింది.

'బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్' పేరిట ఈ బైక్‌ని సంస్థ తీసుకువచ్చింది. ఈ బజాజ్ అవెంజర్ 220 క్రూయిజర్, 160 స్ట్రీట్ లతో పాటు విక్రయించబడుతుంది. దీంతో కంపెనీ తన అమ్మకాలను పెంచుకుని ద్విచక్ర వాహన మార్కెట్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ బైక్‌కి ఉన్న వాల్యూ ఆధారంగా సేల్స్ ఎక్కువగా జరగవచ్చని సంస్థ భావిస్తోంది.

bajaj avenger 220 street

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనల్నీ కచ్చితం చేసింది. ఈ20 ఫ్యూయల్ (80 పెట్రోల్ 20 ఇథనాల్)కు సపోర్ట్ చేసేలా ఈ మోటార్ సైకిల్ ఇంజిన్ ను అప్ గ్రేడ్ చేశారు. మారిన ఉద్గార నియమాలకు అనుగుణంగా ఇవి అందుబాటులో ఉండనున్నాయి. బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ మోటార్ సైకిల్ ఉత్పత్తిని ఆ సంస్థ 2020లో నిలిపివేసింది.

ఈ బైక్ 220 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 19bhp వద్ద 17.55nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇది ఆకర్షణీయమైన హెడ్ లైట్ కౌల్, హ్యాండిల్ బార్ మరియు గ్రాబ్ రైల్ ను కలిగి ఉంది. ఇందులో అత్యాధునిక డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఇది 13 లీటర్ల సామర్థ్యం మరియు 169 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఫ్యూయల్ ట్యాంక్ ను కలిగి ఉంది.

బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక 5 స్టేజ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ని గమనించవచ్చు. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, సింగిల్-ఛానల్ ఎబిఎస్ 280 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను పొందుతుంది.

బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ రూ.1.42 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో దేశంలో రీలాంచ్ చేసింది. 160 స్ట్రీట్ ధర రూ.1.12 లక్షలుగా నిర్ణయించింది. మొత్తం మీద బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ ను సరసమైన ధరలో తిరిగి విడుదల చేయడం ద్వారా అమ్మకాలను రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఈ బైక్ లీటరుకు 40 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని సంస్థ పేర్కొంది. దీంతో మరింత మంది యువ వినియోగదారులను ఆకర్షించడానికి ఇది కలిసి రానుంది. అలానే ఇంజన్ లో అత్యాధునిక ఆప్షన్లను అప్ డేట్ చేసింది కాబట్టి ఎక్కువగా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ బైక్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Article Published On: Saturday, May 13, 2023, 11:02 [IST]
English summary
Bajaj avenger 220 street re launched with new emission norms
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+