Bajaj E-Scooter: ఒక్కసారి ఛార్చ్ చేస్తే 108 కిలోమీటర్ల ప్రయాణం..

ద్విచక్ర వాహనాల కేటగిరీలో బజాజ్ చేతక్ కి ఉన్న క్రేజ్ వేరు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆ సంస్థ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ బైక్ లను అందుబాటులోకి తెస్తుంది. అందులో భాగంగా 2020లో ఆ సంస్థ ఈ-స్కూటర్ ని విడుదల చేసింది. దీనికి మరిన్నీ ఫీచర్లు జోడిస్తూ ఆ కంపెనీ తాజాగా ఓ మోడల్ తీసుకువచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

బజాజ్ చేతక్ తాజాగా 2023 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేసింది. ఢిల్లీ ఆర్టీవో విడుదల చేసిన పత్రాల ప్రకారం ఈ మోడల్ స్కూటర్20శాతం మెరుగుపడినట్లు తెలుస్తుంది. దీంతోపాటు సరికొత్త ఈ-స్కూటర్ కి మరిన్నీ ఫీచర్లను జోడించి ఆధునీకరించారు. ప్రస్తుతం కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఈ-స్కూటర్ ఒక్కసారి ఛార్చ్ చేస్తే కేవలం 90 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే ప్రయాణించవచ్చు. కానీ తాజాగా విడుదలైన స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లవచ్చు.

బజాజ్ చేతక్ ఈ-స్కూటర్

సూపర్ బ్యాటరీ..

ఇక ధర విషయానికి వస్తే ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ధర 1.52 లక్షలుగా ఉంది. ప్రస్తుతం 4 కలర్లలో అందుబాటులో ఉంది. అవి బ్రూక్లిన్ బ్లాక్, హాజెల్ నట్, ఇండిగో మెటాలిక్, వెల్లుటో రోస్సో లిభిస్తుంది. ఈ- స్కూటర్ లో సరికొత్త సాఫ్ట్ వేర్ ను సంస్థ ఆధునీకరించిందనే చెప్పాలి. అందులోనూ డిజైన్ ఇతర మార్పులు కస్టమర్స్ ని ఆకర్షించవచ్చు.

ముఖ్యంగా (IP67-రేటెడ్) బ్యాటరీ మేనెజ్ మెంట్ సిస్టమ్ ని మరింత బలోపేతం చేసింది. ఇది గతంతో స్కూటర్ బరువు ఇతర కొలమానాలు చూసుకుంటే కొత్త బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ ప్రస్తుతం ఉన్న మోడల్‌ కి సమానంగా ఉంటుంది. కంపెనీ అందులో కొద్దిపాటి మార్పులు మాత్రమే చేసింది. 2022లో దాదాపు 30000 వేల పైచిలుకు సేల్స్ చేసిన బజాజ్.. ఈ ఏడాది ఆ సంఖ్యను డబుల్ చేసేలా లక్ష్యాన్ని పెట్టుకుంది.

బజాజ్ చేతక్ ఈ-స్కూటర్

అదనపు పీఛర్స్

మెటాలిక్ బాడీ, ట్యూబ్‌లెస్ టైర్స్, బ్యాక్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్-టచ్ స్విచ్ గేర్, 18L బూట్ స్పేస్, 4L గ్లోవ్ బాక్స్, LED లైటింగ్,ఇంకా 'కీ' లేకుండా ఆపరేట్ చేసే సదుపాయాన్ని పొందుపరచింది. డిజిటల్ బ్లూటూత్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్‌ ఫీచర్లు కూడా ఈ స్కూటర్ లో అందుబాటులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 4 kW మోటార్ 5.3 బిహెచ్‌పి పవర్ ని ఈ స్కూటర్ డెలివరీ చేస్తుంది.

ఇతర కంపెనీలతో పోల్చుకుంటే తక్కువ..

ఇతర ఎలక్ట్రిక్ బైక్ లతో పోల్చుకుంటే బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ రేంజ్ (90) కిలోమీటర్లను కలిగి ఉందని చెప్పవచ్చు. ప్రధాన పోటీ కంపెనీల నుంచి విడుదలైన TVS iQube, Ather 450X, Ola S1 Pro వంటి ప్రీమియం బైక్ లతో పోల్చుకుంటే బజాజ్ ఈ-స్కూటర్ రేంజ్ చాలా తక్కువ అనే చెప్పాలి. చేతక్ కి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా తాజాగా పెంచిన రేంజ్(108 KM) ప్రకారం భవిష్యత్ లో కంపెనీ ఏ మేరకు ఆశించిన ఫలితాలను రాబట్టగలుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ కి ఉన్న ఆధారణ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి లభించలేదు. ఈవీ వాహనాల కొనుగోలు పెరుగుతుంటంతో ఆ విభాగంలో వేగంగా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పలు మార్పులు చేస్తూ కొత్త మోడళ్లను బజాజ్ ప్రవేశ పెట్టనుంది. ప్రధాన పోటీ సంస్థలను నిలదొక్కుకునేందుకు తాజా మోడల్ ని తీసుకువచ్చినట్లు కంపెనీ భావిస్తోంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను సులభంగా ఈఎంఐలోనూ కొనుగోలు చేయవచ్చు. దీనీకి సంబంధించి బజాజ్ ఫైనాన్స్‌ ద్వారా సులభంగా రుణం పొందవచ్చు. ఈ సదుపాయం కస్టమర్లను భారీగా ఆకర్షించే అవకాశం ఉంది. తక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ చెల్లించి రుణం ద్వారా బైక్ ని సొంత చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఒకేసారి స్కూటర్ ధరను పేమెంట్ చేసి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దూసుకుపోతుంది. తర్వాతి స్థానంలో హీరో ఎలక్ట్రిక్, ఏథర్, టీవీఎస్ ఉండగా.. బజాజ్ చేతక్ ఐదవ స్థానంలో కొనసాగుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 16, 2023, 14:21 [IST]
English summary
Bajaj chetak electric scooter to come with improved range
Read more on: #బజాజ్ #bajaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+