వాహ్ 'బజాజ్ ఇ-చేతక్' సరికొత్త ఎడిషన్ రిలీజ్.. 90కి.మీ రేంజ్..!
ప్రముఖ ద్విచక్ర వాహనల తయారీ సంస్థ బజాజ్ ఆటో చేతక్ ప్రీమియం మోడల్ ఈవీ స్కూటర్ ను విడుదల చేసింది. 2023 ఎడిషన్ గా అందుబాటులోకి తెచ్చిన ఈ స్కూటర్ లో డిజైన్ తో పాటు కొన్ని మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సరికొత్త ప్రీమియం స్కూటర్ ధర రూ. 1.52(ఎక్స్ షోరూమ్)గా ఉండనుంది. మరి ఈ చేతక్ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంముందంటే..
రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ స్కూటర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ నుంచి దీనికి సంబంధించిన డెలివరీలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మరో చేతక్ ఈవీ రూ.1.22 లక్షలకి అందుబాటులో ఉంది. 2023లోని ఈ ప్రీమియం బజాజ్ చేతక్ డిజైన్ లో మార్పులు లేవు కానీ కొన్ని చిన్న చిన్న మార్పుల్ని సంస్థ చేసింది.

మూడు కలర్స్ లో అందుబాటులోకి..
మ్యాట్ కోర్స్ గ్రే, మాట్ కరేబియన్ బ్లూ, శాటిన్ బ్లాక్‌లలో మూడు కలర్లల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఎడిషన్ లో ఆల్-కలర్ LCD డిజిటల్ కన్సోల్ ను కూడా పొందుతుంది. ఇది ఇప్పటికే ఉన్న వెర్షన్ కంటే కొంచెం మెరుగైన స్పష్టతను ఇస్తుంది.
ఇ-స్కూటర్ లో ప్రీమియం డ్యుయల్-టోన్డ్ సీట్, బాడీ-కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్ మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్ కాస్టింగ్ లు ఉన్నాయి. ఇంకా, హెడ్ ల్యాంప్ కేసింగ్, ఇండికేటర్ లు సెంట్రల్ ట్రిమ్ ఎలిమెంట్ లు చార్‌కోల్ బ్లాక్ లో పూర్తి మోడల్ కి రిఫ్రెష్ రూపాన్ని అందిస్తోంది.

90 కి.మీ రేంజ్..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగల్ ఛార్జ్ తో 90 కి.మీ రేంజ్ వరకు వస్తుంది. బ్యాటరీలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడున్న బేస్ మోడల్ కు అందిస్తున్న 2.88 kWh తో రానుంది. 4.2 kW మోటార్ నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5.3 bhp వద్ద 20 Nm గరిష్ట టార్క్ ను చేరుకుంటుంది.
కొత్త ప్రీమియం 2023 ఎడిషన్ ద్వారా చేతక్ మరింత బలోపేతం అవుతుందని మాట్లాడుతూ, బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రంగులు, అద్భుతమైన కొత్త డిస్‌ప్లే కన్సోల్ ఇతర ఆధునాతన ఫీచర్ లు చేతక్ ని మోస్ట్ అస్పైర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలబెట్టనున్నాయని అన్నారు. ప్రతి నెలా 10000 యూనిట్ల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్ లను ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్ణయించుకుందని చెప్పారు.

60 నగరాల్లో ఇ-స్కూటర్ రిటైల్ సంస్థలు..
EV వాహనాల తయారీలో మా నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు డీలర్ షిప్స్ ను పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో EVల బలోపేతం కోసం వీటి సంఖ్యపై ప్రస్తుతం దృష్టి పెట్టామని చెప్పారు. విభిన్న విభాగాలు ధరల పాయింట్ లను కవర్ చేయడానికి మా ఉత్పత్తి పోర్ట్ ఫోలియోను బలోపేతం చేయడానికి ఇది సహకరిస్తుందని అన్నారు. EV మార్కెట్ సంస్థ అనుకూలంగా మార్చుకుంటుందని వివరించారు.
సుమారు నాలుగు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. కంపెనీ 60 నగరాల్లో ఇ-స్కూటర్ ను రీటైల్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి 85 నగరాల్లోని 100 స్టోర్‌లకు తన ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటివరకు 40 చేతక్ కేంద్రాలను కలిగి ఉంది. వీటిలో కొన్ని సేవా కేంద్రాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








