బజాజ్‌ నుంచి త్వరలో సీఎన్‌జీ పవర్డ్‌ బైక్‌.. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌.!!

దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో త్వరలో మార్కెట్లోకి CNG ఆధారిత బైక్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బైక్‌ వల్ల కస్టమర్లకు ఫ్యూయెల్ ఖర్చు సగానికి సగం తగ్గనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దేశీయ మార్కెట్లో బజాజ్‌ బైక్‌లు, స్కూటర్లు.. వాటి ఆకర్షణీయమైన డిజైన్‌లు, ఫీచర్‌లతో ప్రసిద్ధి చెందాయి. అంతే కాకుండా సరసమైన ధరల్లో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. కాగా బజాజ్ కంపెనీ చేతక్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఈవీ మార్కెట్లోనూ బజాజ్‌ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Bajaj-CNG-Bike

ఈ క్రమంలో బజాజ్‌.. కస్టమర్లకు మరితం చవక ధరలో మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), ఇథనాల్ ఇంధనంతో నడిచే బైక్‌లను అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే వీటిని తక్కువ ధరలకు విడుదల చేయడానికి బజాజ్‌ ఆటో సన్నాహాలు చేస్తోంది.

కాగా బ్రూజర్ E101, బ్రూజర్ E101 కోడ్‌నేమ్‌తో కూడిన సీఎన్‌జీ-కమ్-పెట్రోల్ బైక్‌ దాదాపు చివరి దశకు చేరుకుందని బజాజ్‌ తెలిపింది. రానున్న 6 నెలల్లో లేదా ఏడాదిలోకి ఈ బైక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ప్రదర్శన కోసం కొన్ని నమూనాలను ఇప్పటికే ఉత్పత్తి చేశారు. కాగా దీనిని 110 సీసీ బైక్‌గా రూపొందించారు.

Bajaj-CNG-Bike

బజాజ్‌ కొత్త సీఎన్‌జీ పవర్డ్‌ బైక్‌ల ఉత్పత్తిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో చేయాలని బజాజ్‌ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న బజాజ్‌ ప్లాటినా పేరునే దీనికీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే బజాజ్ కంపెనీ తక్కువ ధరకే సీఎన్‌జీ బైక్‌ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నట్లు గతంలో వివిధ మీడియా సంస్థలు నివేదించాయి.

ఈ క్రమంలో బజాజ్ రూపొందిస్తున్న సీఎన్‌జీ వాహనాలపై విధించే జీఎస్‌టీని 18 శాతం తగ్గించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభ్యర్థించినట్లు సంస్థ తెలిసింది. కాగా భారతీయ టూ వీలర్‌ మార్కెట్లో 125cc - 200cc విభాగంలో బజాజ్ 30 శాతం వాటాను కలిగి ఉంది. బజాజ్‌ CNG బైక్‌ను విడుదల చేస్తే, ఈ విభాగంలో కంపెనీ మరింత బలపడే అవకాశం ఉంది.

Bajaj-CNG-Bike

కాగా బజాజ్‌ సంవత్సరానికి సుమారు 1 నుంచి 1.2 లక్షల CNG బైకులను ఉత్పత్తి చేయాలనేది ప్రారంభ ఉత్పత్తి ప్రణాళికగా నిర్ణయించినట్లు బజాజ్‌ ED రాకేష్‌ శర్మ అన్నారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను 2 లక్షల యూనిట్లకు సవరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా త్రీ వీలర్‌ సెగ్మెంట్‌లో బజాజ్‌ CNG, LPG వేరియంట్లలో అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో 90 శాతం వాటాను కలిగి ఉంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న బజాజ్ ప్లాటినా ధర రూ. 89,792 గా ఉంది. ఇది ఆన్-రోడ్ ధర. బజాజ్‌ ప్లాటినా బైక్‌ 7.79 bhp గరిష్ట శక్తి వద్ద 8.34 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇది 102 cc BS6 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇందులో 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

బజాజ్ తక్కువ ధరలో CNG పవర్డ్ బైక్‌ను అభివృద్ధి చేస్తే దీని ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఎందుకంటే CNG ఫ్యూయెల్‌ ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ మైలేజ్‌ని ఇస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ బైక్ లాంచ్ కానుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 18, 2023, 20:34 [IST]
English summary
Bajaj is working on cng powered bike it would be called platina
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+