బజాజ్‌ నుంచి స్పోర్టీ లుక్‌లో కొత్త Pulsar N150 లాంచ్‌.. ధర, ఫీచర్లు ఇవే.!!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్(Bajaj) నుంచి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్సర్ N150(Pulsar N150) విడుదల అయింది. కొత్త పల్సర్ N150ని బజాజ్‌ సంస్థ ఆకర్షణీయమైన స్పోర్టీ లుక్‌తో ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీ ధరలో సంస్థ ఈ బైక్‌ను లాంచ్‌ చేసింది.

కొత్త పల్సర్ N150 బైక్‌ ఇంజిన్ అవుట్‌పుట్ మరియు మైలేజ్‌ పరంగా పల్సర్ 150ని పోలి ఉంటుందని బజాజ్‌ తెలిపింది. కానీ, పల్సర్‌ N150లో స్టైల్ మరియు ఫీచర్లను కొత్తగా ప్రవేశపెట్టింది. అదే సమయంలో, ఈ కొత్త మోడల్ బైక్.. ఇతర పల్సర్ మోడల్స్ నుంచి కొన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్‌ ముందు వైపున ఉన్న పదునైన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి.

Bajaj-Pulsar-N150

అంతే కాకుండా కొత్త పల్సర్‌ N150లో ఇన్‌బిల్ట్‌ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. బాడీ కలర్ ఇంజిన్ గార్డ్, ఫ్రంట్ మడ్‌గార్డ్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లోని కొన్ని భాగాల్లో కాంట్రాస్ట్ కలర్‌తో వినూత్నంగా కనిపించేలా రూపొందించారు. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ. బజాజ్ 1.17 లక్షలు(ఎక్స్‌- షోరూమ్‌).

ముఖ్యంగా, బజాజ్ పల్సర్ లైనప్‌లో విడుదల చేయనున్న 2వ 150సీసీ మోటార్‌సైకిల్ ఇది. కంపెనీ ఇప్పటికే P150 మోడల్, 150cc బైక్‌ను అందిస్తోంది. ఇక ఇందులో ఫీచర్ల విషయానికొస్తే, బైక్‌లో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మీడియం డిజిటల్ సామర్థ్యంతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, బ్లూటూత్ కనెక్టివిటీ లేదు.

ఇక కొత్త పల్సర్‌ N150 ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్ 149.68 సిసి, 4 స్ట్రోక్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది సింగిల్ సిలిండర్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 14.5 PS పవర్ మరియు 13.5 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

కొత్త పల్సర్‌ N150 సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు చక్రం టెలిస్కోపిక్ మరియు వెనుక చక్రం మోనోషాక్‌ను కలిగి ఉంది. ఇవి రఫ్‌గా ఉండే రోడ్లపై సైతం సులువుగా వెళ్లేలా చేస్తుంది. అదేవిధంగా, ఈ బైక్ చాలా మంచి బ్రేకింగ్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 240 mm డిస్క్ బ్రేక్ మరియు 130 mm డ్రమ్ బ్రేక్ సింగిల్ ఛానల్ ABS ఉన్నాయి.

కొత్త పల్సర్ N150 కలర్స్‌ విషయానికొస్తే.. ఈ బైక్‌ రేసింగ్ రెడ్, మెటాలిక్ పెరల్ వైట్ మరియు ఎబోనీ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. Pulsar N150కి ఈ కలర్స్‌ చాలా స్పోర్టీ లుక్‌ను కూడా అందిస్తాయి. ఇంకా కొత్త పల్సర్ N150 లో స్టెప్స్‌ మాదిరిగా ఉండే సీటు, సన్నని ఎగ్జాస్ట్‌, ఫ్లోటింగ్ టైప్ బాడీ ప్యానెల్స్ మరింత స్పోర్టీ లుక్‌ను జోడించాయి.

దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్ మోడల్‌లలో పల్సర్ బైక్ ఒకటి. బజాజ్ ఇప్పుడు ఈ బైక్ మోడల్‌లో కొత్త ఎంపికను ప్రారంభించింది. ఇప్పటికే విక్రయిస్తున్న ఇతర పల్సర్ మోడల్‌ల మాదిరిగానే దీనికి మంచి ఆదరణ లభిస్తుందని బజాజ్‌ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 26, 2023, 20:19 [IST]
English summary
Bajaj pulsar n150 launched in india price design engine performance features here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+