పల్సర్ NS200, NS160 అప్ డేటెడ్ బైక్స్ టీజర్ రిలీజ్

గత కొన్ని సంవత్సరాలుగా బజాజ్ నుంచి పల్సర్ ల నుంచి అనేక రకాల మోడల్‌లను ఆఫర్ చేస్తూ వస్తోంది. వీటిలో NS 160, NS 200 అత్యంత ఆధరణను పొందాయి. ఈ బైక్స్ మార్కెట్ లో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి భిన్నంగా దాదాపు ఇదే ఫార్మాట్‌ నూతన బైక్స్ ని సంస్థ విడుదల చేయనుంది.

NS 200 పల్సర్ ను బజాజ్ కంపెనీ 2012 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. అలానే NS 160 మోడల్ బైక్ 2017లో విడుదల చేయబడింది. గత సంవత్సరాలుగా ఈ రెండు బైక్‌ లతో సంస్థ పెద్దగా మార్పు చేయలేదు. సరికొత్త ఫీచర్లతో పాటు అప్ డేటెడ్ వెర్షన్లలో ఈ బైక్స్ ను సంస్థ తీసుకురానుంది.

పల్సర్

USD ఫ్రంట్ ఫోర్క్‌లతో..

సంస్థ నుంచి తదుపరి రాబోయే బైక్స్ లో USD ఫోర్క్‌ లతో (ముందు భాగంలోని డిస్క్ శాకబ్జర్స్) పల్సర్ NS 160, NS 200లను విడుదల చేయనుంది. దానికి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ను బజాజ్ విడుదల చేసింది. టీజర్ వీడియోలో 'రొటేట్ యువర్ ఫోన్' అని చెబుతూ.. చివరలో - మస్కులర్ స్టైలింగ్ గోస్ అప్‌ సైడ్ డౌన్ అని ఆకర్షనీయమై మోటోతో విడుదల చేసింది.

ఫ్రంట్ వీల్ USD ఫోర్క్స్, పల్సర్ NS కొత్త కలర్ షేడ్‌ లకు సంబంధించిన టీజర్ ను పరిచయం చేసింది. NSమోడల్ లో USD ఫోర్క్‌లను చూడటం ఇది కొత్తేమి కాదు. బ్రెజిల్‌లో USD ఫ్రంట్ ఫోర్క్‌లతో NS160, NS200లను సంస్థ విక్రయిస్తోంది. ఇక్కడ ఈ రెండు మోటార్‌సైకిళ్లు Dominar 160, Dominar 200గా విడుదల చేయబడ్డాయి. 200cc మోడల్‌లో 33mm USD ఫోర్క్‌లను, 160cc మోడల్‌లో 31mm USD ఫోర్క్‌లను అందిస్తోంది.

బజాజ్ పల్సర్

బ్రెజిల్ విక్రయం..

ఈ బైక్ లు లాంచ్ అయిన అనంతరం 2023 పల్సర్ NS 160, NS 200 లలో బ్రెజిల్ లో విక్రయిస్తున్న USD ఫోర్క్స్ ను పొందుపరిచే అవకాశం ఉంది. USD ఫోర్క్‌ ల ద్వారా ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవచ్చు. మెరుగైన ఫ్రంట్-ఎండ్ అనుభూతిని పొందవచ్చని సంస్థ వెల్లడించింది.

స్పోర్టి మెషీన్‌ గా పిచ్ చేయబడిన ఈ బైక్స్ లిక్విడ్ కూలింగ్, 6-స్పీడ్ గేర్‌ బాక్స్ వంటి ఫీచర్లతో రానుంది. USD ఫోర్క్‌ లతో పాటు, బజాజ్ డ్యూయల్-ఛానల్ ABSని కూడా జోడిస్తోంది. బజాజ్ ఇప్పటికే పల్సర్ RS200లో డ్యూయల్ ABSని అందిస్తోంది. ఈ కొత్త చేర్పులతో, TVS అపాచీ RTR 200 4Vకి బలమైన పోటీదారుగా ఉండనుంది. ఈ బైక్ కి ప్రత్యర్థిగా హోండా హార్నెట్ 2.0, KTM 200 డ్యూక్ లు ఉన్నాయి.

బజాజ్ పల్సర్..

ఇతర కంపెనీలకు ధీటుగా తయారు..

2012లో ప్రారంభించినప్పటి నుంచి పల్సర్ NS200 పరిశ్రమలో ఎక్కువగా మాట్లాడే మోటార్‌సైకిళ్లలో ఒకటి. ఇది KTM డ్యూక్ 200 వలె అదే ఇంజన్‌ తో పాటు లిక్విడ్ కూలింగ్ 6-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను చాలా తక్కువ డబ్బుతో కలిగి ఉంది. ప్రారంభించినప్పటి నుండి డిజైన్‌లో సున్నా మార్పులు చేసినప్పటికీ, ఇది ఇప్పటికీ అత్యంత ఆకర్షణీయంగా కనిపించే మోటార్‌సైకిళ్లలో ఒకటి. ఇది పొడవాటి రైడర్‌లకు అద్భుతమైన ఎర్గోనామిక్స్ మరియు స్పోర్టి వైఖరిని అందిస్తుంది.

పల్సర్ NS200 బైక్ 199.5 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 9750 ఆర్‌పిఎమ్ వద్ద 24.13 బిహెచ్‌పి పవర్, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18.57 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక NS160 విషయానికి వస్తే, ఇది 160.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 17.2 బిహెచ్‌పి పవర్ & 14.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పల్సర్ NS 160 USD, పల్సర్ NS 200 USD ధరలు అవుట్‌గోయింగ్ వెర్షన్‌ల కంటే దాదాపు రూ. 5-10k ఎక్కువగా ఉండనున్నాయి. వీటి ధర వరుసగా రూ.1.25 లక్షలు, రూ.1.4 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 11, 2023, 13:52 [IST]
English summary
Bajaj pulsar ns 160 ns 200 comes with usd forks dual abs and more features launch teaser
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+