నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న బజాజ్ ట్రయంఫ్ బైక్‌.. జూలై 5న భారత్‌లోకి?

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ట్రయంఫ్ - బజాజ్ భాగస్వామ్యంతో 400 సీసీ బైక్‌ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(జూన్‌ 27) అట్టహాసంగా బజాజ్‌ ట్రయంఫ్‌ బైక్‌ విడుదల కానుంది. లండన్‌లో గ్లోబల్‌ ప్రీమియర్‌లో ఘనంగా ఈ మోటార్‌ సైకిల్‌ను ప్రదర్శించనున్నారు.

2020లో బజాజ్‌తో ట్రయంఫ్‌ జత కట్టిన తర్వాత ఈ రెండు బ్రాండ్‌లు కలిసి 400cc బైక్‌ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. అప్పటినుంచి టెస్ట్ మ్యూల్ యొక్క అనేక స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు దానికి తెరదించుతూ వాహనప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ బైక్‌ ఈ రోజు లాంచ్‌ కానుంది. జూలై 5న భారత్‌లో విడుదల కానుంది.

Bajaj-Triumph-Motorcycle

బజాజ్‌ ట్రయంఫ్‌ భాగస్వామ్యంలో వస్తున్న ఈ బైక్‌ USD సస్పెన్షన్, వెనుకవైపు మోనోషాక్, అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ABS, LED లైటింగ్, బార్-ఎండ్ మిర్రర్స్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రేడియల్-మౌంటెడ్ ఫ్రంట్ బ్రేక్ మరియు మరిన్నింటితో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇక డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌ పూర్తి వివరాలను పరిశీలిస్తే..

డిజైన్‌ : బజాజ్‌ ట్రయంఫ్‌ 400 సీసీ బైక్‌ టెస్టింగ్ దశలో చాలా సార్లు స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. ఇది మొత్తం డిజైన్ మరియు ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడిస్తుంది. 400సీసీ బైక్‌లో టియర్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, మేట్ బ్లాక్ కలర్ ఇంజిన్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్ సెటప్, వెడల్పాటి హెడ్ కవర్ మరియు USD ఫోర్క్స్ వంటి వాటితో రావచ్చని స్పై చిత్రాల ద్వారా తెలుస్తోంది.

ఫీచర్లు : ఇటీవల పూణేలో కెమెరాలో చిక్కుకున్న ఈ టెస్ట్ మ్యూల్ బైక్ యొక్క సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను సూచిస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో రావచ్చు. USD ఫోర్క్, మోనో షాక్‌లు మరియు రెండు వైపుల డిస్క్ బ్రేక్‌లతో సహా హై-ఎండ్ కాంపోనెంట్‌లతో అమర్చబడి ఉంటుందని అంచనా. బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిల్ యొక్క మరింత ఆఫ్-రోడ్-ఫోకస్డ్ స్క్రాంబ్లర్ వేరియంట్ కూడా చాలాసార్లు పరీక్షించబడింది.

ఇంజిన్ : 400cc మోటార్‌సైకిళ్లు లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో నడిచే అవకాశం ఉంది. ఇది గరిష్ఠంగా 35bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. భారత్‌లో ప్రారంభించిన తర్వాత, ఇది యెజ్డీరోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ జావా, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి వాటితో పోటీపడనున్నాయి.

రానున్న బజాజ్-ట్రయంఫ్ మోటార్‌సైకిల్‌ను UKలోని ట్రయంఫ్ యొక్క R&D విభాగం అభివృద్ధి చేసింది. అయితే ఈ బైక్ ఉత్పత్తిని బజాజ్ చూసుకుంటుంది. దీని ద్వారా మోటార్‌సైకిల్ ధరను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అదే విధంగా విడిభాగాల సులభ లభ్యతను నిర్ధారిస్తుందని చెప్పవచ్చు.

భారత్‌లో జూలై 5న ఈ బైక్‌ విడుదల కానుంది. ఆ తర్వాత ఈ మోటార్‌సైకిల్‌ విక్రయాలు మరియు సేవలను బజాజ్ నిర్వహిస్తుంది. వారి అధికారిక లాంచ్‌కు ముందే బహుళ డీలర్‌షిప్‌లు తెరవబడ్డాయి. ఇక భారత్‌లో ధర విషయానికొస్తే, రూ. 2.50 లక్షల నుండి రూ. 2.80 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 27, 2023, 11:39 [IST]
English summary
Bajaj triumph motor cycle launch in london today soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+