Dash Cam ఫీచర్‌తో త్వరలో మార్కెట్‌లోకి రానున్న Rivot NX100 స్కూటర్.. పూర్తి ఛార్జ్‌పై 280 కి.మీ రేంజ్
భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి.. Rivot NX100. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్టోబర్ 23 న లాంచ్ కానుంది. అదే రోజు బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.
దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఫ్యూయెల్ ఖర్చులు లేకపోవడం, లో మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీ, తక్కువ బరువు కారణంగా కస్టమర్లు ఎక్కువగా ఈవీల వైపు ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవీ రంగంలో స్టార్టప్‌లుగా అడుగు పెడుతూ కొత్త కంపెనీలు సంచలన విజయాన్ని సాధిస్తున్నాయి.

ఈ క్రమంలో కర్ణాటకలోని బెలగావి నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో భారత మార్కెట్‌లోకి రానుంది. ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో Rivot NX100 చర్చనీయాంశంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సామర్థ్యాలు, టెక్నాలజీ కారణంగా హాట్ టాపిక్‌గా నిలిచింది.
బెలగావ్ బేస్‌డ్ రివోట్ మోటార్స్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ NX100 ఈ నెల 23 న విడుదల కానుంది. ఈ స్కూటర్ బుకింగ్‌లు ఆ రోజే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సిటీ కమ్యూటర్ల కోసం ఈ రివోట్ NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించారు. బుకింగ్ వ్యవధి ముగిసిన ఆరు నెలల తర్వాత ఈ స్కూటర్ డెలివరీలు స్టార్ట్ అవుతాయి.

రివోట్ మోటార్స్ వెల్లడించిన వివరాల ప్రకారం NX100 పూర్తి ఛార్జ్‌పై 280 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోనే అత్యధిక రేంజ్ అని చెప్పవచ్చు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే.. Rivot NX100 లో అతి పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.
5.7 KWh లిథియం- అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను స్కూటర్‌లోని ఫైర్ బోల్ట్ కింద ఇన్‌స్టాల్ చేశారు.ఇందులో IP67 రేటింగ్ కారణంగా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. సౌకర్యవంతమైన రైడింగ్ కోసం Rivot NX100 విశాలమైన లెవెల్ ఫుట్ బోర్డ్‌ను కలిగి ఉంది.

కొత్త Rivot NX100 లో మరో చెప్పుకోదగ్గ అంశం.. రివోట్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మిడ్- డ్రైవ్ మోటార్లను వినియోగిస్తారు. 150 Nm గరిష్ట అవుట్‌పుట్‌తో, మోటారు 6 kWh శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్లలోని మోటార్ మాదిరిగాన్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్‌ను కలిగి ఉంది.
ఇక Rivot NX100 లో అధునాతన ఫీచర్లను ప్రవేశపట్టారు. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే.. రైడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదనంగా ఈ స్కూటర్‌లో సెన్సార్ ఓపెనింగ్ బూట్‌స్టోరేజ్, డ్యాష్ క్యామ్ ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యాష్ క్యామ్‌ను ప్రవేశపెట్టిన మొదటి కంపెనీ రివోట్ మోటార్స్.
సెన్సార్ ఓపెనింగ్ బూట్ స్టోరేజ్ ఫీచర్ ద్వారా రైడర్లు.. స్టోరేజ్ బాక్స్‌ను చేతితో లేపే పని లేకుండా సెన్సార్ ముందు తమ పాదాలను కదిలిస్తే ఆటోమేటిక్‌గా బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రివోట్ మోటార్స్ మరో రెండు రోజుల్లో ఈ అధునాతన Rivot NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








