ఆటో ఎక్స్‌పో 2023: Leoncino 800 మరియు 752S ఆవిష్కరించిన Benelli

బెనెల్లి కంపెనీ భారతదేశంలో జరుగుతున్న 2023 ఆటో ఎక్స్‌పోలో తన లియోన్సినో 800 బైక్ ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ లియోన్సినో 800 బైక్ మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో బెనెల్లి ఆవిష్కరించిన లియోన్సినో 800 బైక్ అనేది నేక్డ్ బైక్ మాదిరిగా ఉంటుంది. ఇది LED హెడ్‌లైట్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎక్స్‌పోజ్డ్ ఛాసిస్ వంటి వాటిని పొందుతుంది. ఫ్యూయల్ ట్యాంక్ మీద 800 బ్యాడ్జ్ చూడవచ్చు. బైక్‌కి కుడి వైపున ఉండే చంకీ ఎగ్జాస్ట్ ఉంటుంది, అదే సమయంలో వెనుక భాగంలో ఫుల్లీ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఉంటుంది. ఈ బైక్ సింగిల్ పీస్ సీట్ కలిగి రైడర్ మరియు పిలియన్ కి సౌకర్యవంతంగా ఉంటుంది.

Leoncino 800 మరియు 752S ఆవిష్కరించిన Benelli

ఫీచర్ విషయానికి వస్తే, బెనెల్లీ లియోన్సినో 800 ఫుల్లీ TFT డిజిటల్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటితో పాటు రైడర్ కి అవసరమైన మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణంలో కొంత పెద్దదిగానే ఉంటుంది, కావున లాంగ్ రైడింగ్ కి కూడా అందుకూలంగా ఉంటుంది. మొత్తం మీద డిజైన్ మరియు ఫీచర్స్ ఆధునికంగా ఉన్నాయి.

బెనెల్లి లియోన్సినో 800 బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో ఫ్రంట్ ఫోర్క్‌లతో కూడిన ట్రెస్టెల్ స్టీల్ ట్యూబ్ ఛాసిస్ మరియు వెనుకవైపు ప్రీలోడ్ మరియు రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్‌తో మోనోషాక్‌ని కలిగి ఉంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు డ్యూయెల్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్‌ బ్రేక్ మరియు వెనుక వైపు సింగిల్ 260 మిమీ డిస్క్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70 ఫ్రంట్ మరియు 180/55 రియర్ టైర్లు కలిగి 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది.

Leoncino 800 మరియు 752S ఆవిష్కరించిన Benelli

బెనెల్లీ లియోన్సినో 800 (Benelli Leoncino 800) బైక్ 754 సిసి లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదలకానుంది.

బెనెల్లీ 752ఎస్ (Benelli 752S):

బెనెల్లి కంపెనీ ఆటో ఎక్స్‌పో 2023లో బెనెల్లీ 752ఎస్ బైక్ కూడా వెల్లడించింది. ఈ బైక్ 754 సిసి ఇంజిన్ కలిగిన నేకెడ్ మోటార్‌సైకిల్. ఈ ఇందులోని 754 సిసి ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 67 ఎన్ఎమ్ టార్క్ గరిష్ట టార్క్‌ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Leoncino 800 మరియు 752S ఆవిష్కరించిన Benelli

ఈ బైక్ పరిమాణంలో కూడా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ పొడవు 2,130 మిమీ, వెడల్పు 810 మిమీ, ఎత్తు 1,100 మిమీ మరియు 1,460 వీల్‌బేస్‌ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ కాగా బైక్ బరువు 226 కేజీల వరకు ఉంటుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఈ బైక్ ద్వారా లాంగ్ రైడ్ కి కూడా వెళ్ళవచ్చు.

బెనెల్లీ 752ఎస్ మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ ట్రెస్టెల్ స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్‌తో 50 మిమీ అప్సైడ్డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు అడ్జస్టబుల్ ప్రీలోడ్‌ మోనోషాక్‌ను కలిగి ఉంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్‌లు వెనుక వైపు సింగిల్ పిస్టన్ కాలిపర్‌తో కూడిన 260 మిమీ డిస్క్ ఉంటుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎన్ కూడా అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 19:02 [IST]
English summary
Benelli showcased leoncino 800 and 752s at 2023 auto expo details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+